తొలి రోజు దక్షిణ్ డేర్ ర్యాలీ ప్రారంభించిన మారుతి సుజుకి

Written By:

మారుతి సుజుకి తొమ్మిదవ దక్షిణ్ డేర్ ర్యాలీని జూలై 16, 2017 న బెంగళూరు నగర వేదికగా, సుమారుగా 180 మంది ర్యాలీ ఔత్సాహికుల మధ్య ప్రారంభించింది. దక్షిణ్ డేర్ సిరీస్‌లో 2017 ర్యాలీ తీవ్రపోటీ మధ్య సాగనుంది. సౌత్ ఇండియాలోని అడ్వెంచరస్ రూట్స్ మీదుగా కఠినమైన పశ్చిమ భూబాగాలను దాటుకుని క్లైమాక్స్ దశకు చేరుకోనుంది.

దక్షిణ్ డేర్ ర్యాలీ ప్రారంభించిన మారుతి సుజుకి

ర్యాలీలో పాల్గొనే పోటీదారులు అనేక సవాళ్లతో కూడుకున్న చిత్రదుర్గ, బెల్గా మరియు కోల్హాపూర్ ప్రాంతాల్లోని ఉత్కంఠభరితమైన భూభాగాలు మీదుగా పూనేను చేరుకోనున్నారు. జూలై 22, 2017 తేదీన విజేతలను ప్రకటించి, బహుమతి ప్రధానం చేయబడును.

దక్షిణ్ డేర్ ర్యాలీ ప్రారంభించిన మారుతి సుజుకి

మారుతి సుజుకి 2017 దక్షిణ్ డేర్ ర్యాలీని మూడు కెటగిరీల వారీగా నిర్వహిస్తోంది. అవి - ఎండ్యూరెన్స్, అల్టిమేట్ కార్ మరియు అల్టిమేట్ బైక్. ర్యాలీలో పాల్గొనే పోటీదారులు మొత్తం 2,000 కిలోమీటర్ల దూరాన్ని ఆరు రోజుల్లో చేధిచాల్సి ఉంటుంది. భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ, పోటీదారులను మరియు వారి వెహికల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించి ర్యాలీ ప్రారంభించారు.

దక్షిణ్ డేర్ ర్యాలీ ప్రారంభించిన మారుతి సుజుకి

అల్టిమేట్ కార్ కెటగిరీలో, 2016 దక్షిణ డేర్ ర్యాలీలో విజేతలుగా నిలిచిన మారుతి సుజుకి టీమ్‌లోని సురేశ్ రాణా మరియు అశ్విన్ నాయక్‌లు గ్రాండ్ వితారా ద్వారా పోటీలో పాల్గొనగా, వీరికి పోటీగా సందీప్ శర్మ మరియు కరణ్ ఆర్య తమ మారుతి సుజుకి జిప్సీ ద్వారా తలపడనున్నారు.

దక్షిణ్ డేర్ ర్యాలీ ప్రారంభించిన మారుతి సుజుకి

అదే విధంగా, ఎండ్యూరెన్స్ కెటగిరీలో జగ్మీట్ గిల్ మరియు చందన్ సెన్ వితారా బ్రిజా డ్రైవ్ చేయనున్నారు, వీరు ఎస్-క్రాస్ ను నడపనున్న కార్తీక్ మారుతి మరియు శంకర్ ఆనంద్‍‌ల నుండి తీవ్ర పోటీని ఎదుర్కోనున్నారు.

దక్షిణ్ డేర్ ర్యాలీ ప్రారంభించిన మారుతి సుజుకి

మారుతి సుజుకి సౌత్ ఇండియా వాణిజ్య వ్యాపార విభాగాధిపతి ఆనంద్ ప్రకాశ్ ఈ సంధర్బంగా మాట్లాడుతూ," ప్రతి ఏటా నిర్వహిస్తున్న దక్షిణ్ డేర్ ర్యాలీకి ఔత్సాహికుల నుండి ప్రోత్సాహకరమైన స్పందన రావడం ఎంతో సంతోషాన్నిస్తోందిని తెలిపాడు. ఎప్పటిలా కాకుండా మునుపున్న హద్దులను చెరిపేసి, ఈ ర్యాలీని పొడగించినట్లు పేర్కొన్నాడు."

దక్షిణ్ డేర్ ర్యాలీ ప్రారంభించిన మారుతి సుజుకి

2017 లో మారుతి సుజుకి నిర్వహించనున్న డెసర్ట్ స్టార్మ్, దక్షిణ్ డేర్ మరియు రైడ్ డే హిమాలయ ఈ మూడు ర్యాలీలకు మొబిల్1 అఫీషియల్ లుబ్రికేట్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. 2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన కార్యక్రమంలో మొబిల్ బృందం పొల్గొంది.

దక్షిణ్ డేర్ ర్యాలీ ప్రారంభించిన మారుతి సుజుకి

డ్రైవ్‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సౌత్ ఇండియాలో జరుగుతున్న మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్లలో 2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ అతి పెద్దది. ఈ ఏడాది ర్యాలీ రూటు పొడగించడం మరియు ర్యాలీలో అనేక సవాళ్లను ఎదుర్కోనుండటంతో పోటీ ఇప్పుడు మరింత ఇంట్రస్టింగ్‌గా మారుతోంది.

English summary
Read In Telugu: 2017 Maruti Suzuki Dakshin Dare Flagged Off From Bangalore
Story first published: Monday, July 17, 2017, 17:59 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark