మారుతి సుజుకి ఎర్టిగా లిమిటెడ్ ఎడిషన్ విడుదల

Written By:

మారుతి సుజుకి తమ ఏకైక మరియు బెస్ట్ సెల్లింగ్ ఎమ్‌పీవీని లిమిటెడ్ ఎడిషన్‌గా విపణలోకి ప్రవేశపెట్టింది. మునుపటి ఎర్టిగాతో పోల్చుకుంటే ఇందులో ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ పరంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.

మారుతి సుజుకి 2012 లో ఎర్టిగా ఎమ్‌పీవీని ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు బెస్ట్ సెల్లింగ్ ఎమ్‌పీవీగా నిలిచిన ఇది సుమారుగా 3 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడుపోయింది. ప్రస్తుతం ఈ లిమిటెడ్ ఎడిషన్‌లో పై మెరుగులు మినహాయిస్తే ఎలాంటి ఇతర మార్పులు చోటు చేసుకోలేదు.

ఎక్ట్సీరియర్ పరంగా లిమిటెడ్ ఎడిషన్ ఎర్టిగాలో ఎక్విసిట్ మెరూన్ బాడీ కలర్, అల్లాయ్ వీల్స్, క్రోమ్ ఫాగ్ ల్యాంప్ తొడుగులు,మరియు ప్రక్క వైపుల క్రోమ్ సొబగులందించారు.

లిమిటెడ్ ఎడిషన్ ఎర్టిగా ఇంటీరియర్‌ని స్పోర్ట్స్ గ్లిస్టెనింగ్ అస్సెంట్ ఫినిషింగ్ చేసారు, ప్రీమియమ్ సీట్ కవర్లు, ముందు సీటుకు ఆర్మ్ రెస్ట్, కలతో అందించిన సొబగులు, డ్యూయల్ టోన్ స్టీరింగ్ వీల్ కవర్, వైట్ ఆంబియంట్ లైట్ మరియు మెత్తటి తలగడలను ఇందులో కల్పించడం జరిగింది.

మారుతి సుజుకి లిమిటెడ్ ఎడిషన్ ఎర్టిగా ను కేవలం విఎక్స్ఐ మరియు విడిఐ ట్రిమ్ లలో మాత్రమే విడుదల చేసింది. ఈ రెండింటిని మూడు విభిన్న రంగుల్లో అందించింది. అవి, ఎక్విసిట్ మెరూన్, సిల్కీ సిల్వర్ మరియు సుపీరియర్ వైట్ వంటి రంగులు.

ఎర్టిగా లిమిటెడ్ ఎడిషన్ 7.85 లక్షల నుండి 8.10 లక్షల మధ్య ధరతో ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా అందుబాటులో ఉంది. కలర్ ఆప్షన్లు, వేరియంట్లు మరియు యాక్ససరీ కిట్‌లను కలుపుకొని ధరలు నిర్ణయించబడ్డాయి.

దీని విడుదల వేదిక మీద మారుతి సుజుకి మార్కెటింగ్ మరియు సేల్స్ ఎక్జ్సిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ఎస్ కల్సి మాట్లాడుతూ," విశాలమైన ఇంటీరియర్ స్పేస్, వైవిధ్యత, సాంకేతికత మరియు సౌకర్యం వంటి సమూహాల కలయిక గల పూర్తి స్థాయి ఎమ్‌పీవీ ఈ ఎర్టిగా" అని చెప్పుకొచ్చాడు.

కల్సి గారు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎర్టిగా అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు. అయితే భిన్నత్వాన్ని కోరుకునే ఔత్సాహికులకు, సాధారణ ఎర్టిగాను లిమిటెడ్ ఎడిషన్‌లో అందివ్వడం జరిగిందని పేర్కొన్నాడు.

మారుతి సుజుకి లోని అన్ని మోడళ్ల ధరలను మీ నగరంలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి మరియు అన్ని మోడళ్ల ఫోటోల కోసం.....

మారుతి ఈ ఏడాది 2017 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ను విడుదల చేయనుంది. దీనికి సంభందించిన ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద ఓ లుక్కేసుకోండి...

 

 

English summary
Maruti Suzuki Ertiga Limited Edition Launched; Prices Start At Rs 7.85 Lakh
Please Wait while comments are loading...

Latest Photos