ఇగ్నిస్ ఆర్ఎస్ ను సిద్దం చేస్తున్న మారుతి సుజుకి

Written By:

మారుతి సుజుకి గత వారంలో విపణిలోకి విడుదల చేసిన తమ మొదటి కాంపాక్ట్ క్రాసోవర్ ఇప్పటికే 6,000 లకు పైగా బుకింగ్స్ నమోదు చేసుకుంది. ఈ ఆసక్తికరమైన మోడల్ ద్వారా విజయం తథ్యం అనుకున్న మారుతి ఇప్పుడు దీనిని మరింత శక్తివంతమైన వర్షెన్‌లో విడుదల చేయడానికి సిద్దం అవుతోందనే సమాచారం ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

మారుతి సుజుకి ఇగ్నిస్ ఆర్ఎస్

2015 లో మారుతి విడుదల చేసిన బాలెనో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌ను ఆర్ఎస్ లో విడుదల చేస్తున్నట్లు ఇది వరకే మారుతి తెలిపింది. దీనిని 2017 ఫిబ్రవరిలో అమ్మకాలకు సిద్దం చేయనుంది. ఇగ్నిస్ కూడా బాలెనో ప్లాట్‌ఫామ్ మీద అభివృద్ది చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇగ్నిస్ ఆర్ఎస్ వెర్షన్‌లో రానుంది.

మారుతి సుజుకి ఇగ్నిస్ ఆర్ఎస్

2017 మలిసగంలో మారుతి తమ ఇగ్నిస్ ఆర్ఎస్ వెర్షన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇగ్నిస్ కాంపాక్ట్ క్రాసోవర్ మారుతి వారి నెక్సా ప్రీమియమ్ విక్రయ కేంద్రాల ద్వారా అందుబాటులో ఉంది. కాబట్టి, ఇగ్నిస్ ఆర్ఎస్ కూడా నెక్సా ద్వారా లభ్యమయ్యే అవకాశం ఉంది.

మారుతి సుజుకి ఇగ్నిస్ ఆర్ఎస్

బాలెనో ఆర్ఎస్ లో ఉన్నటువంటి 1.0-లీటర్ సామర్థ్యం ఉన్న బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్‌ ఇగ్నిస్ ఆర్ఎస్ వేరియంట్లో రానుంది.

మారుతి సుజుకి ఇగ్నిస్ ఆర్ఎస్

ఈ బూస్టర్ జెట్ ఇంజన్ మారుతి సుజుకి అభివృద్ది చేసిన మొదటి టుర్బో పెట్రోల్ ఇంజన్. అయితే ఇగ్నిస్ ఆర్ఎస్ లో పరిచయం చేసే ఇంజన్ స్వల్ప మేర తక్కువ పవర్ ఉత్పత్తి చేయనుంది. ప్రస్తుతం బాలెనో ఆర్ఎస్ లోనిది గరిష్టంగా 110బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

మారుతి సుజుకి ఇగ్నిస్ ఆర్ఎస్

డిజైన్ విషయానికి వస్తే అచ్చం ఇదే ఆకారాన్ని పొందనుంది. అయితే కాస్మొటిక్ మార్పులు ఇందులో వచ్చే అవకాశం ఉంది. ఆర్ఎస్ ను తలపించే విధంగా బంపర్, సైడ్ స్కర్ట్స్, వంటి వాటి మీద విభిన్న రంగులు రానున్నాయి.

మారుతి సుజుకి ఇగ్నిస్ ఆర్ఎస్

ఇంటీరియర్ లో ట్యాబ్లెట్ తరహాలో ఉన్నటువంటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్మార్ట్ ప్లే లింకేజ్ డిస్ల్పే ఆడియో సిస్టమ్ రిమోట్ యాప్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే వంటి ఫీచర్లు ఇగ్నిస్ ఆర్ఎస్ లో రానున్నాయి.

మారుతి సుజుకి ఇగ్నిస్ ఆర్ఎస్

పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, కీ లెస్ ఎంట్రీ, స్టీరింగ్ ఆధారిత ఆడియో మరియు ఫోన్ కంట్రోల్స్, మరియు కొన్ని క్రోమ్ సొబగులను పొందవచ్చు.

మారుతి సుజుకి ఇగ్నిస్ ఆర్ఎస్

సాధారణ ఇగ్నిస్ పెట్రోల్ వేరియంట్ ధరలు రూ. 4.59 లక్షల నుండి 6.30 లక్షల మధ్య మరియు డీజల్ ఇగ్నిస్ ధరలు రూ. 6.39 లక్షలు నుండి 7.46 లక్షల మధ్య ధరతో అందుబాటులో ఉంది. పెట్రోల్ వేరియంట్లో రానున్న ఆర్ఎస్ ధర ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది.

 

English summary
Also Read In Telugu: Maruti Suzuki Might Introduce Ignis RS Soon In India
Story first published: Wednesday, January 18, 2017, 16:29 [IST]
Please Wait while comments are loading...

Latest Photos