నాలుగు కార్లను మార్కెట్ నుండి తొలగించిన మారుతి సుజుకి

Written By:

భారత దేశపు దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ లైనప్‌లోని కొన్ని అతి ముఖ్యమైన మోడళ్లను తొలగించింది. ఇందులో మంచి డిమాండ్ కలిగి ఉన్న మారుతి సుజుకి సెలెరియో డీజల్, వ్యాగన్ ఆర్, ఆమ్నీ కార్గో మరియు ఈఎకో కార్గో. ఈ నాలుగు మోడళ్లను ఇక మీదట మారుతి డీలర్ల వద్ద కొనుగోలు చేయలేరు.

మారుతి తమ ఫోర్ట్‌ఫోలియోలో ఉన్న నాలుగు ప్రముఖ కార్లను అమ్మకాల నుండి తొలగించినట్లు ప్రముఖ ఆటోమొబైల్ వార్తా వేదిక GaadiWaadi ఓ కథనాన్ని ప్రకటించింది.

మారుతి 2013 లో వ్యాగన్ ఆర్ స్టింగ్‌రే ను విడుదల చేసింది. అయితే ఈ వేరియంట్‌ను శాశ్వతంగా మార్కెట్ నుండి తొలగించి 2017 వ్యాగన్ ఆర్ వేరియంట్‌గా మళ్లీ విడుదల చేయనుంది. మునుపటి మోడల్‌తో పోల్చితే విశాలమైన ఇంటీరియర్‌తో పాటు మరిన్ని ప్రీమియమ్ ఫీచర్లతో రానుంది.

మారుతి లైనప్‌లో అతి ముఖ్యమైన మరో మోడల్ సెలెరియో. ఇందులోని డీజల్ వేరియంట్ ను విపణిలో నుండి తొలగించింది. అయితే పెట్రోల్ వేరియంట్ అలాగే కొనసాగనుంది. మారుతి 2015 లో సెలెరియో డీజల్ ను పరిచయం చేసింది.

యుటిలిటి వాహనాలయిన ఆమ్నీ కార్గో మరియు ఇఎకో కార్గో లను కూడా తమ ఫోర్ట్‌ఫోలియో నుండి తొలగించింది. ఈ రెండింటి స్థానంలోకి సూపర్ క్యారీ ఎల్‌సివి ని అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం వాణిజ్య విక్రయ కేంద్రాలలో ఈ వేరియంట్ అమ్మకాలకు అందుబాటులో ఉంది.

పైన తెలిపిన వాహనాల తొలగింపు మినహాయింపుతో పాటు ఆల్టో కె10 ఏఎమ్‌టి మరియు ఆల్టో కె10 సిఎన్‌జి వేరియంట్లను ఇప్పుడు ఏఎమ్‌టి(ఒ) మరియు సిఎన్‌జి(ఒ) అనే పేర్లతో మార్పులు చేసింది.

రూ. 3.5 లక్షల ప్రారంభ ధరతో హ్యుందాయ్ శాంట్రో
హ్యుందాయ్ మోటార్స్ తమ నెక్ట్స్ జనరేషన్ శాంట్రో కారును 2018 నాటికి రూ. 3.5 లక్షల ప్రారంభ ధరతో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం.

 

English summary
Maruti Suzuki India Discontinues Celerio Diesel, Wagon R, Omni Cargo And Eeco Cargo
Story first published: Wednesday, January 18, 2017, 12:10 [IST]
Please Wait while comments are loading...

Latest Photos