స్టింగ్రే స్థానంలోకి వ్యాగన్ఆర్ మైనర్‌ను విడుదల చేస్తున్న మారుతి

Written By:

మారుతి సుజుకి అభివృద్ది చేస్తున్న నెక్ట్స్ జనరేషన్ టాల్ బాయ్ హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ ఆర్ లోని స్టింగ్రే ను మైనర్ అనే బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ వేరియంట్ ‌ను మారుతి వ్యాగన్‌ఆర్ పేరుతో రహస్యంగా పరీక్షించింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
స్టింగ్రే స్థానంలోకి వ్యాగన్ఆర్ మైనర్

సాధారణ వ్యాగన్ ఆర్ స్టింగ్రే వేరియంట్ స్థానంలోకి వ్యాగన్ ఆర్ మైనర్ వేరియంట్ విడుదలపై మారుతి నుండి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

స్టింగ్రే స్థానంలోకి వ్యాగన్ఆర్ మైనర్

అయితే మారుతి సుజుకి విక్రయ కేంద్రాల నుండి అందుతున్న ఆధారం లేని సమాచారం ప్రకారం, టాప్ ఎండ్ వేరియంట్ విఎక్స్ఐ ఏజిఎస్ లో విడుదల కానున్న వ్యాగన్ఆర్ మైనర్ ధర సుమారుగా రూ. 4.13 నుండి 5.36 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్‌గా ఉండే అవకాశం ఉంది.

స్టింగ్రే స్థానంలోకి వ్యాగన్ఆర్ మైనర్

రహస్యంగా విడుదలై ఫోటోల ప్రకారం వ్యాగన్ ఆర్ బ్యాడ్జింగ్‌ను కలిగి ఉంది. లైసెన్స్ ప్లేట్ పై భాగంలో ఉన్న క్రోమ్ పట్టీ మీద వ్యాగన్ ఆర్ పేరును గుర్తించవచ్చు. ఇంటీరియర్ కూడా బ్లాక్ మరియు బీజీ డ్యూయల్ టోన్ రంగుల్లో దర్శనమిస్తోంది.

స్టింగ్రే స్థానంలోకి వ్యాగన్ఆర్ మైనర్

సాధారణ స్టింగ్రే లో ఆల్-బ్లాక్ మాదిరి కాకుండా వ్యాగన్ ఆర్ మైనర్ ఇంటీరియర్ లో బీజి కలర్ ఆప్‌హోల్‌స్ట్రే కలదు. వ్యాగన్ ఆర్ మైనర్ హ్యాచ్‌బ్యాక్ సూపీరియర్ వైట్, సిల్కీ సిల్వర్ మెటాలిక్, ప్యాసన్ రెడ్, మెటాలిక్ గ్లిస్టెనింగ్ గ్రే, మెటాలిక్ బేకర్స్ చాకోలెట్, మెటాలిక్ బ్లేజింగ్ బ్లూ మరియు మిడ్ నైట్ బ్లూ వంటి ఎక్ట్సీరియర్ బాడీ రంగుల్లో లభించును.

స్టింగ్రే స్థానంలోకి వ్యాగన్ఆర్ మైనర్

మారుతి సుజుకి సంస్థకు పేరెంట్ సంస్థగా ఉన్న సుజుకి గతంలో 7-సీటింగ్ సామర్థ్యం గల వ్యాగన్ ఆర్ హ్యాచ్‌బ్యాక్‌ను ప్రదర్శించింది. మరియు దీనికి వైజెసి అనే కోడ్ పేరును కూడా ఖరారు చేసింది.

స్టింగ్రే స్థానంలోకి వ్యాగన్ఆర్ మైనర్

కాన్సెప్ట్ గా పరిచమైన వ్యాగన్ ఆర్ 7 మంది కూర్చునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఎమ్‌పివి శైలిలో ఉన్న దీనినే మైనర్ పేరుతో రీ బ్రాండ్ గా స్టింగ్రే స్థానాన్ని ఆక్రమించనుందనే వార్త కూడా ప్రచారంలో ఉంది.

స్టింగ్రే స్థానంలోకి వ్యాగన్ఆర్ మైనర్

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ మైనర్ హ్యాచ్‌బ్యాక్‌లో ఎలాంటి సాంకేతిక మార్పులు చోటు చేసుకోవడం లేదు, ప్రస్తుతం వ్యాగన్ ఆర్‌లో అందుబాటులో ఉన్న 1.0-లీటర్ సామర్థ్యం గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో రానుంది.

ప్రస్తుతం మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ మోడల్

ప్రస్తుతం మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ మోడల్

మారుతి లైనప్‌లో ఉన్న వ్యాగన్ ఆర్ టాప్ ఎండ్ వేరియంట్ విఎక్స్ఐ + వ్యాగన్ ఆర్ మైనర్ పేరుతో అందుబాటులోకి రానుంది. ఇది సిఎన్‌జి ఇంధన వేరియంట్లో కూడా పరిచయం కానుంది. ప్రస్తుతం మారుతి పిలిచే ఆటో గేర్ షిఫ్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ జోడింపుతో వచ్చే అవకాశం ఉంది.

స్టింగ్రే స్థానంలోకి వ్యాగన్ఆర్ మైనర్

ఈ ఏడాది మారుతి సుజుకి కారు కొనాలనుకుంటున్నారా... అయితే మారుతి త్వరలో విడుదల చేయనున్న 2017 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ను ఎంచుకోండి. ప్రస్తుతం ఉన్న మోడల్ కన్నా అత్యంత పదునైన, స్పోర్టివ్ డిజైన్‌తో రానుంది. ఈ నూతన స్విఫ్ట్ ఫోటోలు చూడండి....

  
English summary
Maruti Suzuki Wagon R Might Be Rebranded With A New Name
Story first published: Thursday, January 19, 2017, 11:10 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark