స్విఫ్ట్ డిజైర్ లో లిమిటెడ్ ఎడిషన్ విడుదల చేసిన మారుతి సుజుకి

Written By:

భారత దేశపు దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లోకి తమ స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌ను అల్లుర్ అనే పేరుతో లిమిటెడ్ ఎడిషన్‌గా విడుదల చేసింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ డిజైర్ సరికొత్త ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ యాక్ససరీలతో సాధారణ డిజైర్ కన్నా ఎంతో విభిన్నంగా ఉంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ అల్లుర్ లిమిటెడ్ ఎడిషన్

మారుతి సుజుకి తరచుగా తమ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ను మాత్రమే స్పెషల్ ఎడిషన్‌గా విడుదల చేస్తూ వచ్చేది. అయితే ఈ సారి స్విప్ట్ డిజైర్ ను నూతన ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ యాక్ససరీలతో కస్టమర్ల మనసును దోచుకునే విధంగా లిమిటెడ్ ఎడిషన్ అల్లుర్ పేరుతో కాంపాక్ట్ సెడాన్‌ను విడుదల చేసింది.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ అల్లుర్ లిమిటెడ్ ఎడిషన్

మారుతి సంస్థకు ఆల్టో తరువాత అత్యధిక అమ్మకాలు సాధించిపెడుతన్న మోడల్ స్విప్ట్ డిజైర్, ఇప్పుడు దీనిని నూతన కలర్ ఆప్షన్‌లో లిమిటెడ్ ఎడిషన్‌లో విడుదల చేసింది కాబట్టి చాలా మంది ఔత్సాహికులు దీనిని ఎంచుకోవడానికి ఎగబడటం ఖాయం.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ అల్లుర్ లిమిటెడ్ ఎడిషన్

స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ ఆరు విభిన్న రంగుల్లో లభించును, దీనికి ఎక్ట్సీరియర్ మీద సైడ్ స్కర్ట్స్, క్రోమ్ బంపర్ కార్నర్ ప్రొటెక్టర్, Allure పేరుతో బాడీ గ్రాఫిక్స్, క్రోమ్ విండో ఫ్రేమ్ కిట్, క్రోమ్ పూత పూయబడిన బూట్ లిడ్, మరియు క్రోమ్ ఫినిషింగ్ గల Allure బ్యాడ్జి పేరు కలదు.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ అల్లుర్ లిమిటెడ్ ఎడిషన్

అల్లుర్ లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్ ప్రీమియమ్ అనుభూతికి చాలా దగ్గరిగా ఉంటుంది. చూడటానికి లగ్జరీ శైలిలో నూతన ఫీచర్లను ఇందులో అందివ్వడం జరిగింది.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ అల్లుర్ లిమిటెడ్ ఎడిషన్

అల్లుర్ లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్‌లో డ్యూయల్ టోన్ బీజి, చాకోలెట్ బ్రౌన్ లెథర్ సీట్ కవర్లు, అల్లుర్ బ్రాండ్ పేరుతో ఉన్న తలగడలు, డ్యాష్ బోర్డ్ మీద ఫాక్స్ వుడ్ వారి సొబగులు, ముందు వైపు మధ్య భాగంలో ఆర్మ్ రెస్ట్, ఆంబియంట్ లైటింగ్. బీజి ఫ్లోర్ కార్పెట్లు మరియు నెర్ట్జ్ మ్యూజిక్ సిస్టమ్ ఆప్షనల్‌గా ఉంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ అల్లుర్ లిమిటెడ్ ఎడిషన్

స్విఫ్ట్ డిజైర్ అల్లుర్ లిమిటెడ్ ఎడిషన్‌లో 1.3-లీటర్ సామర్థ్యం గల డిడిఐఎస్ డీజల్ ఇంజన్ కలదు, ఇది 74బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ అల్లుర్ లిమిటెడ్ ఎడిషన్

ఇక ఇందులోని 1.2-లీటర్ సామర్థ్యం గల కె-సిరీస్ విటివిటి పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 83బిహెచ్‌పి పవర్ మరియు 115ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగలదు.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ అల్లుర్ లిమిటెడ్ ఎడిషన్

స్విఫ్ట్ డిజైర్ అల్లుర్ లిమిటెడ్ ఎడిషన్ లోని రెండు ఇంజన్ వేరియంట్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో ఉన్నాయి. మరియు డీజల్ వేరియంట్లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా కలదు.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ అల్లుర్ లిమిటెడ్ ఎడిషన్

మారుతి సుజుకి 2017 లో మూడవ తరానికి చెందిన స్విప్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేయనుంది. ఈ ఏడాది స్విఫ్ట్ కొంటున్నట్లయితే 2017 స్విఫ్ట్ కోసం వేచి ఉండండి... ఇది ఎలా ఉంటుందో గమనించాలంటే క్రింద ఉన్న గ్యాలరీ మీద క్లిక్ చేయాల్సిందే.

 

English summary
Maruti Suzuki Launches The Limited Edition Swift Dzire Allure In India
Story first published: Tuesday, January 24, 2017, 18:20 [IST]
Please Wait while comments are loading...

Latest Photos