స్విప్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో నూతన స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్ల జోడింపు

Written By:

ఈ మధ్య కాలంలో కార్ల కొనుగోలుదారులు, కారులోని భద్రత ఫీచర్ల మీద అధికంగా శ్రద్దచూపుతున్నారు. అయితే ఈ ధోరణి కార్ల అమ్మకాల మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. కొనుగోలు దారులు తమ కార్లలో భద్రత ఫీచర్లు తప్పనిసరిగా ఉండాలని కోరుకుంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థలు అతి ముఖ్యమైన భద్రత ఫీచర్లను తమ వేరియంట్లలో స్టాండర్డ్‌గా అందిస్తున్నాయి.

భారత దేశపు దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి భద్రత పరంగా కాస్త వెనుకడుగేస్తోంది. మారుతి వారి ప్రీమియమ్ షోరూమ్ ద్వారా అందుబాటులో ఉంచిన కార్లలోని అన్ని వేరియంట్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు మరియు యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను స్టాండర్డ్‌గా అందిస్తోంది.

అయితే మారుతి తమ సాధారణ డీలర్ల వద్ద అందుబాటులో ఉంచిన ఉత్పత్తుల్లో కూడా ఈ రెండు భద్రత ఫీచర్లను స్టాండర్డ్‌గా అందించాలనే ఆలోచనలో ఉంది. అందులో భాగంగా స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లోని అన్ని వేరియంట్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులను మరియు యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌లను తప్పనిసరిగా అందిస్తోంది.

ప్రముఖ ఆటోమొబైల్ వార్తా వేదిక టీమ్ బిహెచ్‌పి తెలిపిన వివరాల మేరకు, మారుతి తమ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లోని అన్ని వేరియంట్లలో కూడా డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగును అందిస్తున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఎల్ఎక్స్ఐ, ఎల్‌డిఐ, విఎక్స్ఐ, విడిఐ, జడ్ఎక్స్ఐ మరియు జడ్‌డిఐ అనే వేరియంట్లలో లభ్యమవుతోంది.

ఈ ఆరు వేరియంట్లలో ఉన్న జడ్ సిరీస్ కార్లలో అన్ని భద్రత ఫీచర్లున్నాయి. అయితే మిగతా వేరియంట్లలో భద్రతో ఫీచర్లను ఆప్షనల్‌గా అందిస్తోంది.

మారుతి ఈ మధ్యనే తమ సియాజ్ మరియు బాలెనో వేరియంట్లను ఐఎఫ్ఒఫిక్స్ ఉపకరణాలను అందించింది. ఇప్పుడు దీనిని తమ ఎస్-క్రాస్ లో కూడా పరిచయం చేసింది.

మారుతి తాజాగ ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన ఇగ్నిస్ క్రాసోవర్‌లో కూడా ఐఎస్ఒఫిక్స్ మౌంటెడ్ సీట్లను అందించింది. అంటే నెక్సా ప్రీమియమ్ షోరూమ్ ద్వారా లభించే అన్ని వేరియంట్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఐఎస్ఒఫిక్స్ మౌంట్లను అందింస్తోంది.

మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను ఆవిష్కరించింది. అతి త్వరలో దేశీయంగా దీనిని కొనుగోలు చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్లయితే ప్రస్తుతం ఉన్న స్విఫ్ట్ మరియు ఈ 2017 స్విఫ్ట్ కు మధ్య గల తేడాలేంటో క్రింది ఫోటోల ద్వారా గమనించండి.

 

English summary
Maruti Suzuki Swift Now Comes With The Standard Safety Feature
Story first published: Monday, January 23, 2017, 11:12 [IST]
Please Wait while comments are loading...

Latest Photos