అత్యంత సరసమైన ధరతో పవర్ ఫుల్ కారును ఖరారు చేసిన మారుతి

Written By:

ఇండో-జపనీస్ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లోకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును అతి త్వరలో విడుదల చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు, ఇండిన్ కస్టమర్లకు మారుతి సుజుకి మరో గుడ్ న్యూస్ తీసుకొచ్చింది.

మారుతి స్విఫ్ట్ స్పోర్ట్

తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, మారుతి సుజుకి మోస్ట్ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ ఆల్ న్యూ స్విఫ్ట్ కారుతో పాటు స్విఫ్ట్ లోని పవర్ ఫుల్ వెర్షన్ స్విఫ్ట్ స్పోర్ట్ వేరియంట్‌ను కూడా ఇండియన్ మార్కెట్ కోసం ఖరారు చేసినట్లు తెలిసింది.

Recommended Video - Watch Now!
[Telugu] Tata Nexon Review: Specs
మారుతి స్విఫ్ట్ స్పోర్ట్

మారుతి సుజుకి తొలుత కొత్త తరం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును రెగ్యులర్ పెట్రోల్ మరియు డీజల్ వెర్షన్‌లో లాంచ్ చేయనుంది. వీటి తరువాత స్విఫ్ట్ స్పోర్ట్ మరియు స్విఫ్ట్ హైబ్రిడ్ వేరియంట్లను వరుసగా లాంచ్ చేయడానికి సన్నద్దం కానుంది.

మారుతి స్విఫ్ట్ స్పోర్ట్

కొత్త తరం స్విఫ్ట్ కారుతో పాటు స్విఫ్ట్ స్పోర్ట్ మోడల్ కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీదకు ప్రదర్శనకు రానుంది. రెగ్యులర్ స్విప్ట్ విడుదల అనంతరం కొన్ని నెలల తరువాత స్విఫ్ట్ స్పోర్ట్ విపణిలోకి రానుంది.

మారుతి స్విఫ్ట్ స్పోర్ట్

మారుతి స్విఫ్ట్ స్పోర్ట్ డిజైన్ చూడటానికి అచ్చం రెగ్యులర్ స్విఫ్ట్‌నే పోలి ఉండనుంది. అయితే, ప్రంట్ డిజైన్‌లో స్వల్ప మార్పులు మరియు స్పోర్టివ్ మోడల్ అని గుర్తించే విధంగా కొన్ని ప్రత్యేక డీకాల్స్ ఎక్ట్సీరియర్ మీద రానున్నాయి.

మారుతి స్విఫ్ట్ స్పోర్ట్

మారుతి స్విఫ్ట్ స్పోర్ట్ ఎక్ట్సీరియర్‌లో సైడ్ స్కర్ట్స్, గ్లాస్ బ్లాక్ గ్రిల్, రీడిజైన్ చేయబడిన స్పోర్టివ్ తత్వమున్న ఫ్రంట్ బంపర్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ డిఫ్యూజర్ మరియు రెండు ఎగ్జాస్ట్ పైపులు ఉన్నాయి.

మారుతి స్విఫ్ట్ స్పోర్ట్

స్విఫ్ట్ స్పోర్ట్ ఇంటీరియర్ రెగ్యులర్ స్విఫ్ట్ ఇంటీరియర్ తరహాలోనే ఉంటుంది. అయితే, డ్యాష్ బోర్డులో ఎరుపు రంగు సొబగులు అందివ్వడంతో అగ్రెసివ్ ఫీల్ కలిగించారు. సెంటర్ కన్సోల్ మీద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ రానుంది. ఇంటీరియర్ లేఔట్ మొత్తం బాలెనో మరియు ఎస్-క్రాస్ వెర్షన్‌లను పోలి ఉంటుంది.

మారుతి స్విఫ్ట్ స్పోర్ట్

సాంకేతింకగా మారుతి స్విఫ్ట్ స్పోర్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో 1.4-లీటర్ కెపాసిటి గల బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్ రానుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభించనున్న ఇది 138బిహెచ్‌పి పవర్ మరియు 230ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. స్విఫ్ట్ స్పోర్ట్ మొత్తం బరువు 970కిలోలుగా ఉంది, మునుపటి మోడల్ కంటే దీని బరువు 80కిలోల వరకు తక్కువగా ఉంది.

మారుతి స్విఫ్ట్ స్పోర్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

స్విప్ట్ స్పోర్ట్ విడుదలకు మరెంతో సమయం లేదు. స్విప్ట్ రెగ్యులర్ వెర్షన్ విడుదల అనంతరం వెంటనే స్విఫ్ట్ స్పోర్ట్ లాంచ్ చేయడానికి మారుతి ఏర్పాట్లు సిద్దం చేసుకుంటోంది. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే భారతదేశపు అత్యంత సరసమైన స్పోర్టివ్ హ్యాచ్‌బ్యాక్ కారుగా నిలవనుంది.

స్విఫ్ట్ స్పోర్ట్ విపణిలో ఉన్న వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ, ఫియట్ ఆబర్త్ పుంటో వంటి మోడళ్లతో పోటీపడనుంది.

English summary
Read In Telugu: Maruti suzuki swift sport confirmed india

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark