TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
అసలైన రూపంతో తొలి ఆవిష్కరణకు వచ్చిన స్విఫ్ట్: ఇవీ ప్రత్యేకతలు...
జర్మనీలో జరుగుతున్న 2017 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షో వేదిక మీద సుజుకి తమ సరికొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును ఆవిష్కరించింది. ప్రస్తుతం సుజుకి ప్రదర్శించిన స్విఫ్ట్ తరహాలోనే స్పోర్టివ్ డిజైన్ లక్షణాలతో మారుతి సుజుకి నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్‌ను ఇండియాలో వచ్చే ఏడాది జరగనున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్-పో వేదిక మీద ప్రదర్శించనుంది.
సుజుకి ప్రవేశపెట్టిన సరికొత్త స్విఫ్ట్ స్పోర్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో 1.4-లీటర్ సామర్థ్యం గల టుర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌తో వచ్చింది. మునుపటి స్విఫ్ట్‌లో ఉన్న 1.6-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ స్థానాన్ని ఇది భర్తీ చేసింది.
సాంకేతికంగా ఇందులోని 1.4-లీటర్ నాలుగు సిలిండర్ల టుర్బోఛార్జ్‌డ్ ఇంజన్ 5,500ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద గరిష్టంగా 138బిహెచ్‌పి పవర్ మరియు 2,500నుండి 3,500ఆర్‌పిఎమ్ మధ్య 230ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్‌కు అనుసంధానం చేసిన 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆధారంగా పవర్ మరియు టార్క్ స్విఫ్ట్ లోని ముందు చక్రాలకు అందుతుంది.


సరికొత్త స్విఫ్ట్ స్పోర్ట్ 970కిలోల బరువు ఉంది, మునుపటి వెర్షన్‌తో పోల్చుకుంటే 80కిలోల వరకు తేలికగా ఉంది. మరియు రెగ్యులర్ స్విఫ్ట్ కన్నా 50ఎమ్ఎమ్ పొడవు, 20ఎమ్ఎమ్ వీల్ బేస్ మరియు 40ఎమ్ఎమ్ వరకు వెడల్పు అధికంగా ఉంది.
కొత్త సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో నూతన సస్పెన్షన్ సిస్టమ్, 120ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్ కలదు, చివరి స్విఫ్ట్ స్పోర్ట్ కంటే 15ఎమ్ఎమ్ తక్కువగా ఉంది.
డిజైన్ మరియు ఎక్ట్సీరియర్ మార్పుల పరంగా చూస్తే, సరికొత్త సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్‌లో రీ డిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్ మరియు రెండుగా విభంజించబడిన ఫ్రంట్ గ్రిల్, 17-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, స్పోర్టివ్ బ్లాక్ డిఫ్యూసర్, మరియు నూతన ఎగ్జాస్ట్ పైపులు ఉన్నాయి.
సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ ఇంటీరియర్‌లో ఎరుపు రంగు దారంతో కుట్టబడిన, లెథర్ తొడుగు గల ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, డ్యాష్ బోర్డు మీద ఎరుపు రంగులో ఉన్న డయల్స్ మరియు రెడ్ ట్రిమ్ పార్ట్స్ గమనించవచ్చు.
అంతే కాకుండా, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వ్యవస్థలను సపోర్ట్ చేయడంతో పాటు బ్లూటూత్ కనెక్టివిటి గల 7-అంగుళాల పరిమాణం ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
జపాన్ సుజుకి ఇండియా విభాగం, మారుతి సుజుకి తమ డిజైర్ సెడాన్ తరహాలో స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను కొత్త తరం స్విఫ్ట్ విడుదల చేయనుంది. వచ్చే ఏడాది జరగనున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్-పో వేదిక మీద సరికొత్త స్విఫ్ట్‌ను మారుతి సుజుకి ఆవిష్కరించనుంది. మరిన్ని తాజా ఆటోమొబైల్ కథనాల కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి.