న్యూ మారుతి సుజుకి స్విఫ్ట్‌కు క్రాష్ పరీక్షలు: ఆశ్చర్యపరిచే ఫలితాలు

Written By:

మారుతి సుజుకి దేశీయంగా విడుదల చేయనున్న తమ నెక్ట్స్ మోడల్ న్యూ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ క్రాష్ పరీక్షలు నిర్వహించింది. సేఫ్టీ ప్యాక్‌లతో మరియు సేఫ్టీ ప్యాక్‌లు లేకుండా నెక్ట్స్ జనరేషన్‌ స్విఫ్ట్‌కు యూరో ఎన్‌సిఏపి ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించింది.

మారుతి సుజుకి స్విఫ్ట్‌కు క్రాష్ పరీక్షలు

స్విఫ్ట్‌కు జరిపిన క్రాష్ పరీక్షల్లో ఆశాజనకమైన ఫలితాలు వచ్చాయి. సేఫ్టీ ప్యాక్ ఉన్న స్విఫ్ట్ ఐదుకు నాలుగు స్టార్లు మరియు సేఫ్టీ ప్యాక్ లేని స్విఫ్ట్ ఐదింటికి మూడు స్టార్ల రేటింగ్‌ను దక్కించుకున్నాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్‌కు క్రాష్ పరీక్షలు

సేఫ్టీ ప్యాక్ ఉన్న స్విఫ్ట్‌కు ముందు వైపు బలందా ఢీకొట్టి పరీక్షించగా, ప్రయణికులకు ప్రమాదం దరిచేరదని, ప్రయాణికుల మోకాళ్లు మరియు ఇతర శరీర భాగాలు సురక్షితంగానే ఉంటాయని తేలింది.

మారుతి సుజుకి స్విఫ్ట్‌కు క్రాష్ పరీక్షలు

కారుకు ఇరువైపులా బలంగా ఢీకొట్టించి జరిపిన పరీక్షల్లో ఛాతీకి ప్రమాదం తీవ్రత స్వల్పంగా ఉన్నట్లు తెలిసింది. అయితే బాడీ మొత్తం మీద జరిపిన, మరియు ఫోల్ ద్వారా ఢీ కొట్టించిన పరీక్షల్లో స్విప్ట్ మంచి మార్కులు పొందింది.

మారుతి సుజుకి స్విఫ్ట్‌కు క్రాష్ పరీక్షలు

ముందు నుండి ప్రమాదం జరిగితే ప్రయాణికులకు వాటిల్లే ప్రమాద తీవ్రత ఏమాత్రం లేదు. తల, ఛాతీ మరియు మోకాళ్లు వరకు ప్రమాద తీవ్రత దరిచేరకుండా ముందు వైపున ధృడమైన శరీరాన్ని మరియు ఆకృతిని అందివ్వడం జరిగింది.

మారుతి సుజుకి స్విఫ్ట్‌కు క్రాష్ పరీక్షలు

ఈ సుజుకి స్విఫ్ట్‌లో రాడార్ బ్రేకింగ్ సిస్టమ్ కలదు. అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ అని కూడా అంటారు. సిటీ రోడ్లలో దీని ఉపయోగం అధికంగా ఉంటుంది. నిర్ణీత దూరం వరకు ఉన్న అవరోధాలతో ప్రమాదానికి గురికాకుండా వాటిని దరిచేరే ముందు బ్రేకులు ఆటోమేటిక్‍‌గా పడతాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్‌కు క్రాష్ పరీక్షలు

సరికొత్త స్విఫ్ట్ సేఫ్టీ ప్యాక్ లేని హ్యాచ్‌బ్యాక్ భద్రత విషయానికి వస్తే, ఇది ఐదింటికి గాను మూడు స్టార్లను సాధించింది. ముందు మరియు ప్రక్కవైపుల క్రాష్ పరీక్షల్లో మంచి ఫలితాలనిచ్చింది. అదే విధంగా డ్రైవర్ మరియు కో డ్రైవర్ కాళ్లు మరియు ప్రధాన శరీర భాగాలకు ప్రమాదం తప్పుతుందని తేలింది.

మారుతి సుజుకి స్విఫ్ట్‌కు క్రాష్ పరీక్షలు

నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్‌‌బ్యాక్‌ అన్ని ప్రధానమైన భద్రత ఫీచర్లతో పాటు అదనంగా అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ అందివ్వడం ఓ విప్లవాత్మక పరిణామంగా చెప్పుకోవచ్చు.

న్యూ మారుతి సుజుకి స్విప్ట్‌కు నిర్వహించిన క్రాష్ టెస్ట్ వీడియో ద్వారా వీక్షించగలరు.

English summary
Read In Telugu Next-Generation Swift Crash Test Ratings Revealed
Story first published: Thursday, June 1, 2017, 12:39 [IST]
Please Wait while comments are loading...

Latest Photos