నిశ్శబ్దంగా విడుదలైన మారుతి స్విఫ్ట్ లిమిటెడ్ ఎడిషన్

Written By:

ఆన్‌లైన్లో మారుతి సుజుకి తమ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్‌ను స్పెషల్ ఎడిషన్‌లో ప్రకటన ఇస్తోంది. లిమిటెడ్ ఎడిషన్ పేరుతో అందుబాటులో ఉంచిన స్విఫ్ట్‌ను అధికారికంగా లాంచ్ చేయలేదు. అయితే, ఆన్‌‌లైన్ మీడియా ప్రకటనల్లో మారుతి స్విఫ్ట్ కొత్త ఫోటోలు తేలియాడుతున్నాయి.

మారుతి స్విఫ్ట్ లిమిటెడ్ ఎడిషన్

మారుతి సుజుకి స్విఫ్ట్ లిమిటెడ్ ఎడిషన్ పెట్రోల్ మరియు డీజల్ వెర్షన్‌లలో లభిస్తోంది. ఎల్ఎక్స్ఐ/ఎల్‌డిఐ మరియు విఎక్స్ఐ/విడిఐ వేరియంట్లలో ఇది అందుబాటులో ఉండనున్నట్లు తెలిసింది.

Recommended Video - Watch Now!
[Telugu] Benelli 300 TNT ABS Now Avaliable In India - DriveSpark
మారుతి స్విఫ్ట్ లిమిటెడ్ ఎడిషన్

స్విఫ్ట్ లిమిటెడ్ ఎడిషన్‌గలో అదనపు కిట్ ఉంది. ఫ్రంట్ బానెట్, సైడ్ మరియు రూఫ్ మీద ప్రత్యేకమైన డీకాల్స్ ఉన్నాయి. ఎక్ట్సీరియర్ డీకాల్స్‌తో మ్యాచ్ అయ్యేలా సీట్ కవర్లు మరియు స్టీరింగ్ వీల్ తొడుగులు వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

మారుతి స్విఫ్ట్ లిమిటెడ్ ఎడిషన్

మారుతి స్విఫ్ట్ లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్‌లో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే అప్లికేషన్లను సపోర్ట్ చేయగల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. అడ్వర్టైజ్‌మెంట్‌లో నూతన మరియు ప్రత్యేకమైన ఫీచర్లను అందిస్తున్నట్లు సూచిస్తున్నాయి.

మారుతి స్విఫ్ట్ లిమిటెడ్ ఎడిషన్

మారుతి సుజుకి అధికారిక వెబ్‌సైట్ ఆధారంగా మారుతి స్విఫ్ట్ లిమిటెడ్ ఎడిషన్ పెట్రోల్ ధర రూ.5,44,793 లు మరియు డీజల్ వేరియంట్ ధర రూ. 6,39,662 లు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

మారుతి స్విఫ్ట్ లిమిటెడ్ ఎడిషన్

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ అతి త్వరలో కొత్త తరం స్విఫ్ట్‌ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదలకు సిద్దం చేసింది. దీనిని ఫిబ్రవరి 7, 2018 నుండి ప్రారంభం కానున్న ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించనుంది.

మారుతి స్విఫ్ట్ లిమిటెడ్ ఎడిషన్

సంవత్సరాంతం మరియు పాత వెర్షన్ అని ముద్ర వేసుకున్న ప్రస్తుత స్విఫ్ట్‌ మోడల్‌ను విక్రయించుకునేందుకు లిమిటెడ్ ఎడిషన్ పేరుతో మారుతి ప్రయత్నిస్తోందని చెప్పవచ్చు. మరిన్ని వివరాలకు మీకు సమీపంలోని మారుతి డీలర్‌ను సంప్రదించగలరు.

English summary
Read In Telugu: Maruti Swift Limited Edition launched
Story first published: Tuesday, November 21, 2017, 19:51 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark