భారీగా దిగిరానున్న వితారా బ్రిజా మరియు బాలెనో వెయిటింగ్ పీరియడ్

Written By:

మనసుకు నచ్చిన కారు కొందామంటే వెంటనే డెలివరీ ఇవ్వరని చాలా మంది భాదపడుతుంటారు. డిమాండ్ అధికంగా ఉండటంతో బుక్ చేసుకున్న వారికి వరుసగా డెలివరీ ఇస్తారు. దీంతో బుకింగ్స్ అధికమయ్యి, వెయిటింగ్ పీరియడ్ విపరీతంగా పెరిగిపోతుంది.

ఇండియాలో ప్రస్తుతం వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉన్న కార్లు చూసుకుంటే మారుతి వితారా బ్రిజా మరియు బాలెనో కార్లు ఉన్నాయి. అయితే, మారుతి వీటి మీద వెయిటింగ్ పీరియడ్‌ను దాదాపుగా తగ్గించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏలాగో చూద్దాం రండి...

వితారా బ్రిజా వెయిటింగ్ పీరియడ్

భారత దేశపు అతి పెద్ద ప్యాసింజర్ వాహనాల తయారీ సంస్థ మారుతి సుజుకి గుజరాత్‌లో ఫిబ్రవరి 2017లో ప్రారంభించిన తమ ప్రొడక్షన్ ప్లాంటులో రెండవ షిఫ్టు ద్వారా తయారీని పెంచనుంది.

వితారా బ్రిజా వెయిటింగ్ పీరియడ్

అదనపు షిఫ్టు ద్వారా ఉత్పతిని ప్రారంభిస్తే, తయారీ సామర్థ్యం పెరిగి డిమాండ్‌కు తగ్గ కార్లను సకాలంలో ఉత్పత్తి చేయవచ్చు. ప్రస్తుతం మారుతి వితారా బ్రిజా మరియు బాలెనో కార్ల మీద అధికంగా ఉన్న వెయిటింగ్ పీరియడ్ గణనీయంగా దిగిరానుంది.

Recommended Video - Watch Now!
Tata Nexon Review: Specs
వితారా బ్రిజా వెయిటింగ్ పీరియడ్

మారుతి వితారా బ్రిజా మరియు బాలెనో కార్లలోని వివిధ మోడళ్ల మీద సగటున 20 వారాల వెయిటింగ్ పీరియడ్ ఉంది. అంటే ఇప్పుడు బుక్ చేసుకున్న కస్టమర్లకు 20 వారాల తరువాత డెలివరీ ఇస్తారన్నమాట.

వితారా బ్రిజా వెయిటింగ్ పీరియడ్

గుజరాత్‌ ప్లాంటులో నెలకు 10,000 యూనిట్ల బాలెనో కార్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇదే ప్లాంటులో అదనపు షిఫ్టు ద్వారా ప్రొడక్షన్ స్టార్ట్ అయితే గుర్గావ్ మరియు మానేసర్ ప్లాంట్ల మీద తయారీ భారం తగ్గనుంది.

వితారా బ్రిజా వెయిటింగ్ పీరియడ్

గుజరాత్ ప్లాంటు ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలోపు 1,50,000 బాలెనో కార్లను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో మారుతి ఉంది. గడిచిన ఏప్రిల్-ఆగష్టు 2017 కాలంలో 90,555 యూనిట్ల బాలెనో హ్యాచ్‌హబ్యాక్‌లను తయారు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలోనే బాలెనో విడుదలైనప్పటి నుండి 2 లక్షల సేల్స్ మైలురాయిని దాటింది.

వితారా బ్రిజా వెయిటింగ్ పీరియడ్

మారుతి సుజుకి ప్రస్తుతం తమ వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యూవీని గుర్గావ్ ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తోంది. గడిచిన ఏప్రిల్-ఆగష్టు 2017 మధ్య కాలంలో 60,194 యూనిట్లను విక్రయించింది. బ్రిజా ఎస్‌యూవీ విడుదలైన 17 నెలల కాలంలోనే 1,50,000 యూనిట్ల సేల్స్ సాధించింది.

వితారా బ్రిజా వెయిటింగ్ పీరియడ్

మారుతి సుజుకి ఇండియా సీనియర్ ఎక్జ్సిక్యూటివ్ డైరక్టర్, ఆర్ఎస్ కల్సి మాట్లాడుతూ," అక్టోబర్ నుండి గుజరాత్ ప్లాంటులో రెండవ షిఫ్టు ద్వారా ఉత్పత్తిని ప్రారంభిస్తున్నాము. దీంతో ప్రత్యేకించి బాలెనో మరియు బ్రిజా కార్ల పరంగా గుర్గావ్ మరియు మానేస్ ప్లాంట్ల మీద ఉన్న తయారీ భారం తగ్గనుందని తెలిపాడు."

వితారా బ్రిజా వెయిటింగ్ పీరియడ్

"బ్రిజా మీద రోజు రోజుకీ డిమాండ్ అధికమవుతున్న నేపథ్యంలో దీని మీద వెయిటింగ్ పీరియడ్ అధికంగా ఉంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచినప్పటికీ, బ్రిజా మీద బుకింగ్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. గుజరాత్‌లో అదనంగా బాలెనో ఉత్పత్తి పెంపు మరియు ఇతర మోడళ్ల తయారీని ఆలస్యం చేసి బ్రిజా మీద ఉన్న వెయిటింగ్ పీరియడ్ తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లు", కల్సి చెప్పుకొచ్చాడు.

వితారా బ్రిజా వెయిటింగ్ పీరియడ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి సంస్థ పరిచయం చేసిన పాత మోడళ్లను మినహాయిస్తే, గత రెండేళ్ల కాలంలో పరిచయం చేసిన బాలెనో మరియు వితారా బ్రిజా వెహికల్స్ బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఈ రెండు మోడళ్లకు మార్కెట్లో గట్టి పోటీ ఉన్నప్పటికీ, కస్టమర్లను వీటినే ఎంచుకోవడానికి ఇష్టపడుతున్నారు.

ఫోర్డ్ ఎకోస్పోర్ట్, టాటా నెక్సాన్ మరియు మహీంద్రా టియువి300 వాహనాలు వితారా బ్రిజాకు పోటీగా నిలవగా, హ్యుందాయ్ ఐ20 మరియు హోండా జాజ్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కార్లు మారుతి బాలెనోకు పోటీగా ఉన్నాయి.

English summary
Read In Telugu: Maruti Vitara Brezza And Baleno Waiting Period To Go Down
Story first published: Tuesday, October 3, 2017, 14:03 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark