సంచలనాత్మక విక్రయాలతో సరికొత్త రికార్డు సృష్టించిన వితారా బ్రిజా

Written By:

మారుతి సుజుకి మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. చిన్న కార్లు మరియు సెడాన్ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్‌గా ఉన్న మారుతికి ఎస్‌యూవీ సెగ్మెంట్లో అస్సలు రాణించలేకపోయింది. అయితే, 2016 మార్చిలో విడుదలైన వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యూవీ ఏడాదిలోపే అంచనాలను తారుమారు చేసింది.

మారుతి వితారా బ్రిజా

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ప్రతి నెలా అత్యుత్తమ విక్రయాలు సాధిస్తూ టాప్ బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో స్థానం దక్కించుకుంటూ వచ్చిన వితారా బ్రిజా ఇప్పుడు మారుతికి మరో అరుదైన మైలురాయిని సాధించి పెట్టింది.

మారుతి వితారా బ్రిజా

మారుతి సుజుకి వితారా బ్రిజా ఎస్‌యూవీ వాహనాన్ని విడుదల చేసిన కేవలం 20 నెలల వ్యవధిలోనే 2 లక్షల సేల్స్ సాధించింది. గడిచిన 20 నెలల కాలంలో ప్రతి నెలా సగటున 10,000 యూనిట్ల వితారా బ్రిజా ఎస్‌యూవీలను మారుతి విక్రయించింది.

మారుతి వితారా బ్రిజా

ప్రస్తుతం ఇండియన్ ఎస్‌యూవీ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడుపోతున్న మోడల్ వితారా బ్రిజా. దేశీయ విక్రయాల్లో 1 లక్ష యూనిట్ల సేల్స్ అందుకోవడానికి సంవత్సరం కన్నా తక్కువ సమయం పట్టిందంటే దీనికి విపణిలో ఎలాంటి డిమాండ్ ఉందో చెప్పకనే తెలిసిపోతుంది.

మారుతి వితారా బ్రిజా

దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల సంస్థ మారుతి సుజుకి జూలై 2017లో అధిక సంఖ్యలో వితారా బ్రిజాలను విక్రయించింది. ఒక్క జూలై 2017 లోనే దేశవ్యాప్తంగా 15,243 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇదే సెగ్మెంట్లో ఉన్న టాటా, ఫోర్డ్ మరియు హోండా దిగ్గజాలను వెనక్కి నెట్టింది.

మారుతి వితారా బ్రిజా

సాంకేతికంగా మారుతి వితారా బ్రిజా సింగల్ డీజల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తోంది. బ్రిజాలోని శక్తివంతమైన 1.3-లీటర్ కెపాసిటి గల డిడిఐఎస్ డీజల్ ఇంజన్ గరిష్టంగా 90బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం కలదు.

మారుతి వితారా బ్రిజా

ఎస్‌యూవీ సెగ్మెంట్లో అధిపత్యం చెలాయిస్తున్న మహీంద్రా అండ్ మహీంద్రా నుండి గట్టి పోటీని ఎదుర్కుని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్‌ను ఎస్‌యూవీ విపణిలోకి పైకి తీసుకురావడంలో వితారా బ్రిజా కీలకపాత్ర పోషిస్తోందని చెప్పవచ్చు. సింగల్ డీజల్ ఇంజన్ ఆప్షన్ మరియు కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తోనే లభిస్తున్నప్పటికీ అద్వితీయమైన ఆదరణ లభిస్తోంది.

మారుతి వితారా బ్రిజా

ప్రస్తుతం మారుతి వితారా బ్రిజా ప్రారంభ వేరియంట్ ధర రూ. 7.24 లక్షలు, మధ్య వేరియంట్ విడిఐ ధర రూ. 7.77 లక్షలు మరియు టాప్ వేరియంట్ జడ్‌డిఐ ప్లస్ ధర రూ. 9.69 లక్షలు. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(హైదరాబాద్)గా ఉన్నాయి.

మారుతి వితారా బ్రిజా

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

దేశీయ మార్కెట్లో మారుతి వితారా బ్రిజా ఖచ్చితంగా ఒక బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ అని చెప్పవచ్చు. భారీగా వృద్ది చెందుతున్న సేల్స్ దీనికొక సాక్ష్యం. సంచలనాత్మక విక్రయాలతో మరే ఎస్‌యూవీకి సాధ్యం కాని రికార్డులను నెలకొల్పుతోంది. రానున్న కాలంలో బ్రిజా సేల్స్ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది.

English summary
Read In Telugu: Maruti Vitara Brezza Sets A New Benchmark

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark