20 లక్షల సేల్స్ సాధించిన మారుతి వ్యాగన్ఆర్: ప్రస్థానం... నేపథ్యం...

Written By:

సుమారుగా 1999 కాలంలో మారుతి సుజుకి టాల్ బాయ్ డిజైన్‌తో చిన్న హ్యాచ్‌బ్యాక్‍ కారును విడుదల చేయడానికి నిశ్చయించుకుంది. విశాలమైన క్యాబిన్ స్పేస్ ప్రతి భారతీయుడిని ఆకట్టుకునేలా ఓ హ్యాచ్‌బ్యాక్‌ను ప్రవేశపెట్టాలనుకుంది. అప్పటికే, హ్యుందాయ్ మోటార్స్ విపణిలోకి విడుదల చేసిన శాంట్రోలో మారుతి ఇవ్వాలనుకున్న అన్ని ఫీచర్లు ఉన్నాయి. దీంతో మారుతికి పోటీ మరింత పెరిగింది.

మారుతి వ్యాగన్ఆర్

అయినా వెనక్కి తగ్గని మారుతి 1999 డిసెంబర్ లో వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ కారును లాంచ్ చేసేసింది. ఇప్పుటి వరకు నాలుగు విభిన్న ఫేస్‌లిఫ్ట్‌లలో విడుదలవుతూ, ఇంకా ఇండియన్ మార్కెట్లో భారీ అమ్మకాలు సాధిస్తోంది. ప్రస్తుతం 2013 లో విడుదలైన వ్యాగన్ ఆర్ విక్రయాల్లో ఉంది.

మారుతి వ్యాగన్ఆర్

తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, ఇప్పటి వరకు 20 లక్షలకు పైగా అమ్ముడైన కార్ల జాబితాలో మారుతి ఆల్టో మరియు మారుతి 800 తరువాత మారుతి వ్యాగన్ ఆర్ మూడవ బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. ఒకటి కాదు,రెండు కాదు ఏకంగా 20 లక్షల వ్యాగన్ఆర్ కార్లు ఇండియన్ రోడ్ల మీద పరుగులు పెడుతున్నాయి.

మారుతి వ్యాగన్ఆర్

ఇండియాలో ప్రతి నెలా వచ్చే టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో మారుతి వ్యాగన్ఆర్ కారు తప్పనిసరిగా ఉంటుంది. కొన్ని సంవత్సరాల నుండి ఇదే రిపీట్ అవుతోంది. సులభంగా డ్రైవ్ చేయడం, ఒడిదుడుకులు లేని మెయింటెనెన్స్, సౌకర్యం, అత్యుత్తమ మైలేజ్, అత్యంత సరసమైన ధర వంటి ఎన్నో అంశాల పరంగా వ్యాగన్ఆర్ ఇప్పటికీ బెస్ట్ ఛాయిస్‌గా నిలిచింది.

Recommended Video - Watch Now!
Tata Nexon Review: Specs
మారుతి వ్యాగన్ఆర్

గత రెండు మూడేళ్ల నుండి రూరల్ మరియు సెమీ రూరల్ మార్కెట్లో వ్యాగన్ఆర్ మీద ఆసక్తి తగ్గడంతో, చాలా తక్కువ సేల్స్ సాధించింది. అయితే, ఏప్రిల్ నుండి ఆగష్టు 2017 మధ్య కాలంలో జరిగిన విక్రయాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చుకుంటే ఆల్టో మరియు వ్యాగన్ఆర్ సేల్స్ 28 శాతం పెరిగాయి.

మారుతి వ్యాగన్ఆర్

"2015 ఏడాదిలో తొలిసారి కారు కొనే వారు 35 శాతం వరకు వ్యాగన్ఆర్‌ను ఎంచుకున్నారు. ఆ తర్వాత 2016-17 ఏడాదిలో ఈ సంఖ్య 46-47 శాతం పెరిగింది. ఈ వృద్దిని పరిశీలిస్తే, వ్యాగన్ఆర్ బ్రాండ్ విలువ గణనీయంగా పెరుగుతోందని", మారుతి సుజుకి సేల్స్ మరియు మార్కెటింగ్ సీనియర్ ఎక్జ్సిక్యూటివ్ డైరక్టర్ ఆర్ఎస్ కల్సి పేర్కొన్నాడు.

మారుతి వ్యాగన్ఆర్

మారుతున్న మార్కెట్ అవకాశాలకు, కొత్త కస్టమర్ల అభిరుచులకు మరియు పోటీకి అనుగుణంగా మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేస్తూ వచ్చింది. డిజైన్ మార్పులు, గ్రాఫిక్స్, మరియు ఇంటీరియర్ సవరణతో పాటు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, వివిధ రకాల ఇంధన ఆప్షన్స్, మరియు ఆటోగేర్‌షిఫ్ట్ వంటి ఫీచర్లను సందర్భానుసారంగా జోడించింది.

మారుతి వ్యాగన్ఆర్

మారుతి వ్యాగన్ఆర్ పాపులర్ ప్యాసింజర్ కార్ల శ్రేణిలోని కస్టమర్లకే కాదు, కమర్షియల్ వెహికల్ ఎంచుకునే కస్టమర్లకు కూడా వ్యాగన్ఆర్ బెస్ట్ ఛాయిస్ అని మొత్త కార్ల విక్రయాల్లో 5 శాతం వాటాను సొంతం చేసుకుని మరీ నిరూపించుకుంది.

మారుతి వ్యాగన్ఆర్

మారుతి సుజుకి ఐదవ వ్యాగన్ఆర్ శైలిలో 2019 నాటికి భారీ మార్పులతో విడుదల చేయనుంది. ప్రస్తుతం వ్యాగన్ఆర్ పెట్రోల్ మరియు సిఎన్‌జి ఇంజన్ వేరియంట్లలో లభిస్తోంది.

మారుతి వ్యాగన్ఆర్ లోని శక్తివంతమైన 1.0-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ 67బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ టార్క్, అదే విధంగా సిఎన్‌జి వేరియంట్ గరిష్టంగా 58బిహెచ్‌పి పవర్ మరియు 77ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మారుతి వ్యాగన్ఆర్

మారుతి సుజుకి ఐదవ వ్యాగన్ఆర్ శైలిలో 2019 నాటికి భారీ మార్పులతో విడుదల చేయనుంది. ప్రస్తుతం వ్యాగన్ఆర్ పెట్రోల్ మరియు సిఎన్‌జి ఇంజన్ వేరియంట్లలో లభిస్తోంది. మారుతి వ్యాగన్ఆర్ లోని శక్తివంతమైన 1.0-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ 67బిహెచ్‌పి పవర్ మరియు 90న్ఎమ్ టార్క్, అదే విధంగా సిఎన్‌జి వేరియంట్ గరిష్టంగా 58బిహెచ్‌పి పవర్ మరియు 77ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మారుతి వ్యాగన్ఆర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి వ్యాగన్ సిటి మరియు పల్లె ప్రాంత అవసరాలకు అత్యంత అనువైన కారుగా నిరూపించబడింది. తొలిసారి కారు కొనేవారి, ఫ్యామిలీ అవసరాల కోసం, బడ్జెట్ ఫ్రెండ్లీ విశాలవంతమైన క్యాబిన్ వంటివి కోరుకునే వారికి ఇది అత్యుత్తమ ఎంపిక.

దీనికి తోడు, వ్యాగన్ఆర్ కార్లకు రీసేల్ వ్యాల్యూ కూడా చాలా బాగుంది. దేశవ్యాప్తంగా విసృతమైన డీలర్‌షిప్ నెట్‌వర్క్ పరంగా చూస్తే వ్యాగన్ఆర్ బెస్ట్ ఛాయిస్.

English summary
Read In Telugu: Maruti Suzuki's Third Vehicle Reaches A Significant Milestone After Alto And 800
Story first published: Saturday, September 23, 2017, 12:08 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark