4 కోట్లు విలువైన ఈ కారు ధర కేవలం 30 బిట్‌కాయిన్లు మాత్రమే

By Anil

30 బిట్‌కాయిన్‌లకే నాలుగు కోట్ల ఖరీదైన మెక్‌లారెన్ కారును విక్రయిస్తున్నారంటే పావళాకు నాలుగు చాక్లెట్లు దొరికినంత ఆనందంగా ఉంటుంది కదూ... అయితే, బిట్‌‌కాయిన్ గురించి తెలియని వారికి ఇదో పెద్ద ప్రశ్న. నిజమే! అసలు బిట్ కాయిన్ అంటే ఏమిటి...? బిట్‌కాయిన్‌తో మెక్‌లారెన్ కారును ఎలా కొనుగోలు చేయవచ్చు...? ఇలాంటి వివరాలు మీ కోసం...

బిట్‌కాయిన్ అంటే ఏమిటి

ప్రపంచ వ్యాప్తంగా ఆమోదించబడుతున్న అత్యధిక విలువ గల బిట్‌కాయిన్ క్రిప్టో కరెన్సీకి ఇప్పుడు ఊహించని ఆదరణ లభిస్తోంది. ఈ బిట్‌కాయిన్ హవా ఇప్పుడు ఆటోమొబైల్ ప్రపంచంలోకి కూడా పాకింది.

Recommended Video - Watch Now!
This McLaren 720S Costs Only 30 Bitcoins While Others Cost $285,000
బిట్‌కాయిన్ అంటే ఏమిటి

క్రైగ్స్‌లిస్ట్ సంస్థ మెక్‌లారెన్ 720ఎస్ అజోరస్ ఆరేంజ్ కలర్ సూపర్ కారును కేవలం 30 బిట్‌‌కాయిన్ల ధరతో అమ్మకానికి ఉంచింది. 2010 ఏడాదిలో ఓ వ్యక్తి సుమారుగా 10,000 బిట్‌కాయిన్‌లు వెచ్చించి రెండు పిజ్జాలు కొనుగోలు చేశాడు. దీంతో పోల్చుకుంటే ఈ 30 బిట్‌కాయిన్‌ల డీల్ చాలా బెస్ట్ అని చెప్పవచ్చు.

బిట్‌కాయిన్ అంటే ఏమిటి

మెక్‌లారెన్ బేస్ మోడల్ 720ఎస్ ధర 2,85,000 అమెరికన్ డాలర్లు, ఇండియన్ కరెన్సీ దీని విలువ 1.8 కోట్ల రుపాయలు. ఒక వేళ దీనిని ఈ మెక్‌లారెన్ 720ఎస్ కారును దిగుమతి చేసుకుంటే అన్ని పన్నులతో కలుపుకుని దీని ఆన్ రోడ్ ధర రూ. 4 కోట్లుగా ఉంటుంది.

బిట్‌కాయిన్ అంటే ఏమిటి

డాలరుతో పోల్చుకుంటే రుపాయి విలువ చాలా తక్కువ, అదే బిట్‌కాయిన్‌తో పోల్చుకుంటే డాలరు విలువ...? అత్యంత దారుణంగా ఉంది. ఎందుకంటే ఒక్క బిట్‌కాయిన్ ధర అక్షరాలా 14,634.80 అమెరికన్ డాలర్లు, అంటే 9.5 లక్షల ఇండియన్ కరెన్సీతో సమానం(డిసెంబర్ 15, 2017 నాటికి ఒక్క బిట్‌కాయిన్ విలువ 17,367.80 డాలర్లు).

బిట్‌కాయిన్ అంటే ఏమిటి

మెక్‌లారెన్ విక్రయదారుని ప్రకటన మేరకు, "కేవలం బిట్‌కాయిన్ రూపంలో పేమెంట్ జరిపే వారికి మాత్రమే అతి కొద్ది దూరం తిరిగిన తన కారును అమ్మకానికి ఉంచినట్లు తెలిపాడు". వేయార్న్, ల్యాంబోర్గిని మరియు ఫెరారి కార్లతో పోల్చుకుంటే మెక్‌లారెన్ బెస్ట్ సూపర్ కారు అని చెప్పుకొచ్చాడు.

బిట్‌కాయిన్ అంటే ఏమిటి

ఈ డీల్‌కు ఒప్పుకొని బిట్‌కాయిన్‌‌లో 0.00001 వ వంతు మొత్తాన్ని అడ్వాన్స్‍‌గా చెల్లిస్తే, తానే స్వయంగా కస్టమర్‌ను కలుస్తానని తెలిపాడు. మెక్‌లారెన్ పర్ఫామెన్స్‌ వెర్షన్‌లో అజోరస్ కాలిపర్లు, ఫ్రంట్ లిఫ్ట్, హీటెడ్ సీట్లు, స్పోర్ట్స్ ఎగ్జాస్ట్, గొరిల్లా గ్లాస్ రూఫ్ మరియు మెక్‌లారెన్ ట్రాక్ టెలిమెట్రి వంటి ఫీచర్లు ఉన్నట్లు ఈ కారు ఓనర్ వెల్లడించాడు.

బిట్‌కాయిన్ అంటే ఏమిటి

ఏదేమైనప్పటికీ, ఇప్పటి వరకు క్రైగ్స్‌లిస్ట్ ప్రకటనలోని వివరాలను మాత్రమే చూశాము. అయితే, ఈ కారు ఓనర్ ఖచ్చితంగా బిట్‌కాయిన్‌లకు తన కారును విక్రయిస్తాడో లేదో తుది నిర్ణయం ఆయనదే..

బిట్‌కాయిన్ అంటే ఏమిటి

ఎంతో మందిలో తీవ్ర సందేహాలను నింపిన బిట్ కాయిన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ కోసం...

బిట్‌కాయిన్ అంటే ఏమిటి ?

బిట్‌కాయిన్ అంటే ఏమిటి

బిట్‌కాయిన్ అనే కరెన్సీ ఏ దేశానికి చెందినది కాదు. ఏ సంస్థ పరిధిలోకి రాదు. దీనిని ఎవరు సృష్టించారో కూడా తెలియని అత్యంత విలువైన అంతర్జాతీయ కరెన్సీ బిట్‌కాయిన్. దీనికి భౌతిక రూపం అంటూ ఏమీ ఉండదు. ఒక బిట్‌కాయిన్ కొన్ని ఆంగ్ల అక్షర,అంకెల సమూహంతో కూడిన నెంబర్.

బిట్‌కాయిన్ అంటే ఏమిటి

దీని సృష్టికర్త ఎవరో ఇప్పటికీ తెలియదు. అయితే, బిట్‌కాయిన్‌లోని ఒక యూనిట్ విలువను సతోషి నకటమో గా కొలుస్తారు. దీని విలువ మిలియన్‌లో వందవ వంతు. భారీ వ్యవస్థగా ఏర్పడిన కంప్యూటర్ల ద్వారా గణిత సమీకరణాలతో బిట్‌కాయిన్‌లు సృష్టిస్తారు. బిట్‌కాయిన్‌లు కేవలం పరిమిత సంఖ్య వరకు ఉత్పత్తయ్యే విధంగా సెట్ చేశారు.

బిట్‌కాయిన్ అంటే ఏమిటి

బిట్‌కాయిన్‌లు కంప్యూటర్ ద్వారా ఒక నిర్ధిష్ట కాలంలో అరుదుగా తయారవుతాయి. ఈ ప్రక్రియను మైనింగ్ అంటారు. బిట్‌కాయిన్‌ల సంఖ్య 2.1 కోట్లకు మించకుండా ఉండే విధంగా ఈ వ్యవస్థను రూపొందించారు. ఇప్పటి వరకు 1.67 కోట్ల బిట్‌కాయిన్‌లు అందుహబాటులోకి వచ్చాయి.

బిట్‌కాయిన్ అంటే ఏమిటి

వీటికి భౌతిక రూపం ఉండదు కాబట్టి, ఎక్స్‌చ్ఛేంజి ద్వారా డాలర్లను వెచ్చించి ప్రత్యేకమైన ఆన్‌లైన్ ఎక్స్‌చ్ఛేంజ్ కేంద్రాల ద్వారా బిట్‌కాయిన్‌లను కొనుగోలు చేయవచ్చు. ఇప్పటి వరకు ఎన్ని బిట్‌కాయిన్‌లు ఉన్నాయి, ఎవరెవరి వద్ద ఎన్ని ఉన్నాయి, ఒక్క బిట్‌కాయిన్ విలువ ఎంత వంటి వివరాలు బిట్‌కాయిన్ యూజర్లందరికీ అందుబాటులో ఉండేలా బిట్‌కాయిన్ వ్యవస్థను నిర్మించారు.

బిట్‌కాయిన్ అంటే ఏమిటి

ఇది పూర్తిగా ఆన్‌లైన్ ఆధారిత క్రిప్టోకరెన్సీ కావడంతో ఇంట్లో డబ్బుకు దొంగల భయం ఉన్నట్లు ఈ కరెన్సీ ఉన్నవారికి హ్యాకర్ల భయం ఎక్కువ. ఇప్పటి వరకు హ్యాకింగ్ ద్వారా రెండు అతి పెద్ద బిట్‌కాయిన్ దోపిడీలు జరిగాయి. దీంతో బిట్‌కాయిన్ యూజర్ల కొన్ని లక్షల డాలర్లు నష్టపోయారు.

Most Read Articles

English summary
Read In Telugu: This McLaren 720S Costs Only 30 Bitcoins While Others Cost $285,000
Story first published: Friday, December 15, 2017, 17:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X