2017 మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ విడుదల: ధర, ఇంజన్ మరియు స్పెసిఫికేషన్ల కోసం

Written By:

జర్మీనికి చెందిన దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియన్ మార్కెట్లోకి 2017 ఇ-క్లాస్ సెడాన్ కారును విడుదల చేసింది. దీని ప్రారంభ ధర వేరియంట్ ధర రూ. 56.15 లక్షలు ఎక్స్ షోరూమ్ (ముంబాయ్‌)గా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
ఇ-క్లాస్ ధరల వివరాలు

ఇ-క్లాస్ ధరల వివరాలు

ఐదవ తరానికి చెందిన మెర్సిడెస్ ఇ-క్లాస్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంధన వేరియంట్లలో అందుబాటులో ఉంది.

  • మెర్సిడెస్ బెంజ్ ఇ200 ధర రూ. 56.15 లక్షలు
  • మెర్సిడెస్ బెంజ్ ఇ350డి ధర రూ. 69.47 లక్షలు
రెండు ధరలు ఎక్స్ షోరూమ్ (ముంబాయ్‌)గా ఉన్నాయి.
2017 మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ స్పెసికేషన్స్

2017 మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ స్పెసికేషన్స్

సరికొత్త మెర్సిడెస్ ఇ-క్లాస్ లోని రెండు పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లలలో మూడు విభిన్నమైన డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి, కంఫర్ట్, స్పోర్ట్ మరియు స్పోర్ట్ ప్లస్. మెర్సిడెస్ సరికొత్త ఇ-క్లాస్ వేరియంట్లలో అధునాతన అడ్జెస్టబుల్ ఎయిర్ సస్పన్షన్ సిస్టమ అందించింది. దీని ద్వారా కస్టమర్లు కారులో ఉన్నపుడు సస్పెన్షన్ సిస్టమ్ యొక్క ఎత్తును నచ్చిన రీతిలో అడ్జెస్ట్ చేసుకోవచ్చు. గుంతలమయమైన రహదారుల్లో కూడా చక్కగా డ్రైవ్ చేయవచ్చు.

2017 మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ పెట్రోల్ వేరియంట్ వివరాలు

2017 మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ పెట్రోల్ వేరియంట్ వివరాలు

2017 మెర్సిడెస్ ఇ200 వేరియంట్లో 2.0-లీటర్ సామర్థ్యం గల టర్బో ఛార్జ్‌డ్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 181బిహెచ్‌పి పవర్ మరియు 300ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

2017 మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్

2017 మెర్సిడెస్ ఇ200 వేరియంట్ కేవలం 8.4 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 240కిలోమీటర్లుగా ఉంది.

2017 మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ డీజల్ వేరియంట్ వివరాలు

2017 మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ డీజల్ వేరియంట్ వివరాలు

2017 మెర్సిడెస్ ఇ-క్లాస్ ఇ350డి వేరియంట్లో 3.0-లీటర్ సామర్థ్యం గల వి6 డీజల్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 254బిహెచ్‌పి పవర్ మరియు 620ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

2017 మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్

ఇ-క్లాస్ ఇ350డి వేరియంట్ కేవలం 6.6 సెకండ్ల కాల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 250కిలోమీటర్లుగా ఉంది.

2017 మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్

మెర్సిడెస్ ఇండియా ప్రస్తుతం ఈ ఇ-క్లాస్ లోని లాంగ్ వీల్ బేస్ మోడళ్లను మాత్రమే విపణిలో అందుబాటులో ఉంచింది. కొలతల పరంగా,

  • పొడవు - 5,065ఎమ్ఎమ్
  • వెడల్పు - 1,860ఎమ్ఎమ్
  • ఎత్తు - 1,467ఎమ్ఎమ్
  • వీల్ బేస్ - 3,079ఎమ్ఎమ్
2017 మెర్సిడెస్ ఇ-క్లాస్ డిజైన్

2017 మెర్సిడెస్ ఇ-క్లాస్ డిజైన్

నూతన ఇ-క్లాస్ వేరియంట్ చూడటానికి ఎస్-క్లాస్ మరియు సి-క్లాస్ లను పోలి ఉంది. ముందు వైపున పదునైన, అగ్రెసివ్ చూపులతో కూడిన డిజైన్ కలదు. ఇకానిక్ మెర్సిడెస్ లోగోను ఫ్రంట్ గ్రిల్ మధ్యలో అందించారు. పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల ఇముడింపుతో ఉన్న హెడ్ ల్యాంప్స్ గుర్తించవచ్చు.

2017 మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్

ఇ-క్లాస్ రియర్ డిజైన్ విషయానికి వస్తే, ఎంతో కాలంగా కొనసాగిస్తూ వస్తోన్న కోణీయాకృతిని గమనించవచ్చు. వెనుక వైపున కూడా ఎల్ఇడి టెయిల్ లైట్లను అందివ్వడం జరిగింది. ముందు వైపున హెడ్ ల్యాంప్‌ను, వెనుక వైపు టెయిల్ లైట్లను కలుపుతూ ఉన్న క్యారెక్టర్ లైన్‌ను గుర్తించవచ్చు. ఇందులో 17-అంగుళాల 10-స్పోక్ అల్లాయ్ వీల్స్ కలవు.

2017 మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్

ఇ-క్లాస్ ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే, 12.3-అంగుళాల పరిమాణం గల తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్న సెంటర్ కన్సోల్ కలదు. దీనికి 13-స్పీకర్లు మరియు 560డబ్ల్యూ బ్రూమ్‌స్టర్ సౌండ్ సిస్టమ్ కలదు.

2017 మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్

అంతే కాకుండా 64 రంగుల ఆంబియంట్ లైటింగ్ సిస్టమ్, ప్యానరోమిక్ సన్ రూఫ్ మరియు టచ్ ప్యాడ్ స్టీరింగ్ వీల్ కలదు.

 సేఫ్టీ ఫీచర్లు

సేఫ్టీ ఫీచర్లు

మెర్సిడెస్ బెంజ్ ఈ ఇ-క్లాస్ లో భద్రత పరంగా, ఏడు ఎయిర్ బ్యాగులు, మెర్సిడెస్ ప్రి సేఫ్, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, యాక్టివ్ పార్కింగ్ అసిస్ట్, అడాప్టివ్ బ్రేక్ లైట్లు, 360 డిగ్రీ కెమెరా సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

 

English summary
2017 Mercedes E-Class Launched In India; Prices Start At Rs 56.15 Lakh
Story first published: Tuesday, February 28, 2017, 16:43 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark