మెర్సిడెస్‌లో వచ్చి వోక్స్‌వ్యాగన్ వెంటో కారుకు నిప్పటించారు

Written By:

ముంబాయ్‌లో కొంత మంది దుండగులు వ్యక్తి మీదున్న పగను కారు మీద తీర్చుకున్నారు. అర్థం కాలేదు కదూ...!! ముంబాయ్‌లో ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో పార్క్ చేసిన వోక్స్‌వ్యాగన్ మీద కారు మీద మెర్సిడెస్ బెంజ్ ఎమ్ఎల్ ఎస్‌యూవీలో వచ్చిన కొందరు దుండగులు మండే స్వభావమున్న ఇంధనాన్ని కారు మీద చల్లి నిప్పంటించేశారు.

అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో కారును బూడిదపాలు చేశారు(స్టోరీ చివర్లో వీడియో). వివరాల్లోకి వెళితే...

కారుకు నిప్పంటించిన దుండగులు

రోహిత్ మెహ్రా, అతని భార్య ముంబాయ్‌లోని పలావా డాంబివ్యాలీలో నివాసముంటున్నారు. నవంబర్ 14, 2017 రోజు పొద్దుపోయేంత వరకు ఇద్దరూ చండీవ్యాలీలోని శివ ఓం టవర్స్‌లో నివాసముండే తన స్నేహితుల ఇంటికి వెళ్లారు.

కారుకు నిప్పంటించిన దుండగులు

అయితే, ఇద్దరూ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో నిద్రలేచి బయటికొచ్చారు. ఇద్దరూ తమ కారు వద్దకు రాగానే షాక్‌కు గురయ్యారు. అప్పటికే తమ వోక్స్‌వ్యాగన్ వెంటో కారు మంటల్లో ఉంది. సెక్యూరిటీ సిబ్బంది మరియు అగ్నిమాపక పరికరాల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

కారుకు నిప్పంటించిన దుండగులు

అయితే, ఇద్దరూ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో నిద్రలేచి బయటికొచ్చారు. ఇద్దరూ తమ కారు వద్దకు రాగానే షాక్‌కు గురయ్యారు. అప్పటికే తమ వోక్స్‌వ్యాగన్ వెంటో కారు మంటల్లో ఉంది. సెక్యూరిటీ సిబ్బంది మరియు అగ్నిమాపక పరికరాల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

కారుకు నిప్పంటించిన దుండగులు

కారులో మంటలు ఎలా అంటుకున్నాయో తెలుసుకోవడానికి పార్కింగ్ ప్రదేశంలో ఉన్న సీసీటీవి ఫుటేజీని పరిశీలిస్తే, అది అనుకోకుండా జరిగింది కాదు, కావాలని దురుద్దేశ్యంతో చేశారని గుర్తించారు. కొంత మంది దుండగులు మెర్సిడెస్ ఎమ్ఎల్ ఎస్‌యూవీలో వచ్చి తమ కారు మీద ఇంధనాన్ని చల్లి నిప్పంటించడం వీడియోలో రికార్డయ్యింది.

కారుకు నిప్పంటించిన దుండగులు

సీసీటీవీలో ఓ వ్యక్తి ఉదయం 3.37 గంటల ప్రాంతంలో ఇంధనాన్ని తీసుకొచ్చే చిన్న జెర్రీ క్యాన్‌తో కారులో నుండి దిగినట్లు గుర్తించారు. వారే తమ కారుకు నిప్పంటించారని రోహిత్ మెహ్రీ సమీపంలోని సకినాకి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కారుకు నిప్పంటించిన దుండగులు

రోహిత్ మెహ్రా తన స్నేహితుల నివాసం వద్ద ఉన్న పార్కింగ్ ప్రదేశంలో కేవలం గెస్టుగా కారును పార్క్ చేశాడు. నిజానికి, అదే పార్కింగ్ స్పేస్‌లో ప్రతి రోజూ మరొక సిల్వర్ కలర్‌ వోక్స్‌వ్యాగన్ వెంటో ఉండేది.

కారుకు నిప్పంటించిన దుండగులు

అంటే దుండగులు నిప్పంటించాలనుకున్న కారు వేరు, ఆ కారు ఉండాల్సిన చోటు రోహిత్ మెహ్రా తన కారును పార్క్ చేయడంతో, రెండూ ఒకే రంగులో ఉండటం మరియు రెండు కార్లు కూడా వోక్స్‌వ్యాగన్ వెంటోనే కావడం, ఎప్పటిలాగే పార్కింగ్ కోసం రావాల్సిన ఆ కారు రోహిత్ వచ్చిన రోజు రాకపోవడంతో దుండగులు పొరబాటున రోహిత్ కారును కాల్చేశారు.

అయితే, దుండగులు మెర్సిడెస్ బెంజ్ ఎస్‌యూవీలో వచ్చి ఎందుకు వోక్స్‌వ్యాగన్ వెంటో కారును కాల్చాలనుకున్నారు? అసలు ఎవరికి వార్నింగ్ ఇవ్వాలనుకున్నారు? వ్యక్తిని టార్గెట్ చేస్తూ బెదిరించడం కోసం కారును దహించి ఉండవచ్చనే అనుమానాలున్నాయి. ప్రశ్నలకు... అనుమానాలకు సమాధానం దొరకాలంటే ముందు ఆ దుండగులు దొరకాలి...!!

English summary
Read In Telugu: Miscreants in Mercedes SUV which is parked inside a Mumbai society (Video)

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark