బాలెనో, హ్యుందాయ్ ఎలైట్ ఐ20 లకు పోటీగా MG3 ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

బ్రిటీష్ కార్ల తయారీ సంస్థ తమ తొలి మోడల్‌గా ఎమ్‌జి3 అనే ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం.

By Anil

బ్రిటీష్‌కు చెందిన కార్ల తయారీ దిగ్గజం ఎమ్‌జి మోటార్స్(MG Motors) మరియు చైనా ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ SAIC సంయుక్తంగా 2019 నాటికి ఇండియన్ మార్కెట్లో కార్యకలాపాలు ప్రారంభంచడానికి సిద్దమయ్యాయి.

బ్రిటీష్ కార్ల తయారీ సంస్థ తమ తొలి మోడల్‌గా ఎమ్‌జి3 అనే ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం.

MG3 ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

ఎమ్‌జి3 ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ప్రస్తుతం విపణిలో ఉన్న మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఎలైట్ ఐఆ20, వోక్స్‌వ్యాగన్ పోలో మరియు హోండా జాజ్ వంటి ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కార్లకు గట్టి పోటీనివ్వనుంది. ఇదే సెగ్మెంట్లో ఉన్న అన్ని మోడళ్లు కూడా మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. అందుకోసం ఎమ్‌జి మోటార్స్ తమ తొలి కారును ఈ సెగ్మెంట్లోకి విడుదల చేయనుంది.

Recommended Video

Tata Nexon Review: Specs
MG3 ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

ఎమ్‌జి3 కారును పూర్తిగా ఇండియాలోనే ఉత్పత్తి చేయనుంది. అయితే డిజైన్ మరియు డెవలప్‌మెంట్ పనులన్నీ కూడా మోటార్స్ యూరోపియన్ ప్లాంట్లలో జరగనున్నాయి. ఎమ్‌జి మోటార్స్ అనుభంద సంస్థ ఎస్ఎఐసి గుజరాత్‌లోని హలోల్ జనరల్ మోటార్స్ ప్లాంటును కొనుగోలు చేసింది. కాబట్టి వీటి కార్ల తయారీ ఇక్కడే జరగనుంది.

MG3 ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

ఎమ్‌జి3 హ్యాచ్‌బ్యాక్ ముందువైపున అత్యంత పదునైన డిజైన్ లక్షణాలు ఉన్నాయి. షార్ప్ హెడ్ ల్యాంప్స్, ఎల్-ఆకారంలో ఉన్న ఎల్ఇడి పగటి పూట వెలిగే లైట్లు, కండలు తిరిగిన ఆకారంలో ఉన్న ఫ్రంట్ బంపర్ ఉన్నాయి. దీంతో కారు ఓవరాల్ డిజైన్ స్పోర్టివ్ లక్షణాలను కలిగి ఉంటుంది.

MG3 ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

ఇంటీరియర్ పరంగా దీనికి పోటీగా ఉన్న ఉత్పత్తులతో పోల్చుకుంటే చాలా కామన్‌గానే ఉంటుంది. సాంకేతికంగా ఇందులో 1.5-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ రానుంది. ఇది గరిష్టంగా 104బిహెచ్‌పి పవర్ మరియు 137ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు.

MG3 ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎమ్‌జి మోటార్స్ భాగస్వామ్యంతో ఇండియాలో కార్యకలాపాలు ప్రారంభించే విషయాన్ని ఎస్‌ఎఐసి ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం విపణిలో ఉన్న మారుతి, హ్యుందాయ్ మరియు వోక్స్‌వ్యాగన్ సంస్థలకు విభిన్నమైన ఉత్పత్తులను విడుదల చేసే ప్రణాళికల్లో ఈ రెండు కొత్త సంస్థలు ఉన్నాయి. ఇందుకు నిదర్శనం ఎమ్‌జి3 ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ నిదర్శనం.

Most Read Articles

English summary
Read In Telugu: MG Motors’ Premium Hatchback To Rival Maruti Baleno And Hyundai Elite i20 In India
Story first published: Wednesday, August 9, 2017, 18:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X