మారుతి ఎర్టిగా కు పోటీగా ఎక్స్‌పాండర్ ఎమ్‌పివిని ఆవిష్కరించిన మిత్సుబిషి

Written By:

మిత్సుబిషి ఎక్స్‌పాండర్ ఎమ్‌పివి వాహనాన్ని ఇండోనేషియాలో ఆవిష్కరించింది. ప్రస్తుతానికి నెక్ట్స్ జనరేషన్ ఎమ్‌పివి అని పిలుస్తన్న మిత్సుబిషి ఇంకా దీని పేరును ఖరారు చేయలేదు. 2017 ఆగష్టు 10 నుండి 20 వరకు జరగనున్న గైకిండో ఇండోనేషియా ఇంటర్నేషనల్‌ ఆటో షో వేదిక మీద మిత్సబిషి ఈ 7-సీటర్ ఎమ్‌పివిని ప్రదర్శించనుంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
మిత్సుబిషి ఎక్స్‌పాండర్‌ ఎమ్‌పివి

మిత్సుబిషి రూపొందించిన ఈ ఎమ్‌పివి దేశీయంగా ఉన్న మారుతి సుజుకి ఎర్టిగా మరియు రెనో లాజీ ఎమ్‌పివి వాహనాలకు గట్టిపోటీనివ్వనుంది. 1.5-లీటర్ ఇంజన్ వేరియంట్లో 7-సీటింగ్ కెపాసిటీతో ఎక్స్‌పాండర్‌గా పేరుతో రానున్న దేశీయంగా విపణిలోకి విడుదలయ్యే అవకాశం ఉంది.

Recommended Video
Volkswagen Tiguan Review In Telugu - DriveSpark తెలుగు
మిత్సుబిషి ఎక్స్‌పాండర్‌ ఎమ్‌పివి

మిత్సుబిషి ప్రతినిధులు పేర్కొంటున్న నెక్ట్స్ జనరేషన్ ఎమ్‌పివిని డిజైన్‌లో డైనమిక్ షీల్డ్ డిజైన్ భాషలో రూపొందించారు. ఫ్రంట్ డిజైన్‌లో ప్రత్యేకించి పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, హెడ్ ల్యాంప్స్ మరియు ఫాగ్ ల్యాంప్స్‌ను గుర్తించగలరు.

మిత్సుబిషి ఎక్స్‌పాండర్‌ను ఎస్‌యూవీ మరియు ఎమ్‌పివి లక్షణాలతో ఆవిష్కరించింది. ప్రక్కవైపు డిజైన్‌లో వెనుక వైపు టెయిల్ ల్యాంప్స్ నుండి డోర్ హ్యాండిల్స్ మీదుగా ఉన్న ఆకర్షణీయమైన క్యారెక్టర్ లైన్స్ ఎమ్‌పివికి చక్కటి రూపాన్ని తీసుకొచ్చాయి.

మిత్సుబిషి ఎక్స్‌పాండర్‌ ఎమ్‌పివి

ఎక్స్‌పాండర్ రియర్ డిజైన్‌లో పాత తరానికి చెందిన పజేరో స్పోర్ట్‌ తరహాలోని టెయిల్ లైట్స్ అందివ్వడం జరిగింది. ఢిఫ్యూసర్ మరియు రిఫ్లెక్టర్ జోడింపుతో కూడిన రియర్ బంపర్‌ను చాలా సింపుల్‌గా రూపొందించారు.

ఎక్స్‌పాండర్ ఇంటీరియర్‌లో ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, మూడు స్పోక్స్ స్టీరింగ్ వీల్, ఏ/సి వెంట్స్, మరియు బీజీ మరియు గ్రే డ్యూయల్ టోన్ కలర్ థీమ్ ఇంటీరియర్‌తో రానుంది.

మిత్సుబిషి ఎక్స్‌పాండర్‌ ఎమ్‌పివి

మిత్సుబిషి ఎక్స్‌పాండర్ 1.5-లీటర్ కెపాసిటి గల MIVEC ఇంజన్‌తో రానుంది(పెట్రోల్ లేదా డీజల్ అనేద ఇంకా స్పష్టం కాలేదు). ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు, ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‍‌బాక్స్‌లో వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు కీలెస్ ఎంట్రీ మరియు ఇంజన్ ఆన్ చేశాక 30 సెకండ్ల పాటు హెడ్ ల్యాంప్స్ అన్‌లోనే ఉండే విధంగా సిస్టమ్ కూడా అందివ్వనుంది.

మిత్సుబిషి ఎక్స్‌పాండర్‌ ఎమ్‌పివి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హ్యాచ్‌బ్యాక్(ఉదా: స్విఫ్ట్ తరహా కార్లు) మరియు సెడాన్(ఉదా: సిటి మరియు వెర్నా తరహా కార్లు) లతో పోల్చితే ఎస్‌యూవీ తరహా ఉత్పత్తులకు దేశీయంగా డిమాండ్ పెరుగుతోంది. ఇందులో కూడా అధిక పవర్ ఉత్పత్తి చేసే ఎస్‌యూవీలతో పాటు ఎక్కువ మంది ప్రయాణించే కెపాసిటి గల ఎమ్‌పివిల మార్కెట్‌కు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జపాన్ దిగ్గజం మిత్సుబిషి ఎక్స్‌పాండర్ ఎర్టిగా మరియు లాజీ ఎమ్‌పివిలకు గట్టి పోటీనివ్వనుంది.

English summary
Read In Telugu: Mitsubishi Unveils New-Generation Expander MPV
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark