30 లక్షల ప్రారంభ ధరతో పజేరో స్పోర్ట్ సెలక్ట్ ప్లస్ ఎస్‌యూవీ విడుదల

Written By:

జపాన్ దిగ్గజ ప్యాసింజర్ కార్లు మరియు ఎస్‌యూవీల తయారీ సంస్థ మిత్సుబిషి ఇండియా విభాగం దేశీయ విపణిలోకి తమ పజేరో స్పోర్ట్ ప్రీమియమ్ ఎస్‌యూవీని సెలక్ట్ ప్లస్ వేరియంట్లో విడుదల చేసింది. రెండు ట్రాన్స్‌మిషన్ డ్రైవ్‌లతో ఇది అందుబాటులో ఉంది.

మిత్సుబిషి పజేరో స్పోర్ట్ సెలక్ట్ ప్లస్ ఎస్‌యూవీ

స్టాండర్డ్ వేరియంట్ పజేరో స్పోర్ట్ వేరియంట్‌తో పోల్చుకుంటే ఈ రెండు కొత్త వేరియంట్లు ఎక్ట్సీరియర్ బాడీ కలర్‌లో మార్పులను సంతరించుకుంది.

  • పజేరో స్పోర్ట్ సెలక్ట్ ప్లస్ టూ-వీల్ డ్రైవ్ వేరియంట్ ధర రూ. 30.53 లక్షలు
  • పజేరో స్పోర్ట్ సెలక్ట్ ప్లస్ ఫోర్-వీల్ డ్రైవ్ వేరియంట్ ధర రూ. 30.95 లక్షలు
రెండు ధరలు ఎక్స్-షోరూమ్ ముంబాయ్‌గా ఇవ్వబడ్డాయి.
మిత్సుబిషి పజేరో స్పోర్ట్ సెలక్ట్ ప్లస్ ఎస్‌యూవీ

పజేరో స్పోర్ట్ వేరియంట్లలోని అన్నింటితో పోల్చితే సెలక్ట్ ప్లస్ వేరియంట్ అత్యంత ఆకర్షణీయంగా ఉంది. బ్లాక్ కలర్‌లో ఉన్న రూఫ్ టాప్, బ్లాక్ అల్లాయ్ వీల్స్, మరియు వీల్ ఆర్చెస్, ముందు వైపు బ్లాక్ బంపర్ గార్డ్ కలదు. డోర్ హ్యాండిల్స్ మరియు అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్లకు క్రోమ్ తొడుగులు అందివ్వడం జరిగింది.

మిత్సుబిషి పజేరో స్పోర్ట్ సెలక్ట్ ప్లస్ ఎస్‌యూవీ

మిత్సుబిషి పజోరే స్పోర్ట్ లోని సెలక్ట్ ప్లస్ వేరియంట్లో అందించిన ఫీచర్ల విషయానికి వస్తే, క్రూయిజ్ కంట్రోల్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, హెచ్ఐడి హెడ్ లైట్లు, ఎలక్ట్రిక్ పవర్ ద్వారా అడ్జెస్టు చేసుకునే వీలున్న ఓఆర్‌విఎమ్స్, మరియు డివిడి ప్లేయర్ వంటివి ఉన్నాయి.

మిత్సుబిషి పజేరో స్పోర్ట్ సెలక్ట్ ప్లస్ ఎస్‌యూవీ

సాంకేతికంగా మిత్సుబిషి ఈ పజేరో స్పోర్ట్ సెలక్ట్ ప్లస్ ఎస్‌యూవీలో 2.5-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ అందించింది. ఇది గరిష్టంగా 178బిహెచ్‌పి పవర్ మరియు ఫోర్ డ్రైవ్‌లో 400ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా టూ-వీల్ డ్రైవ్‌లో 350ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు.

మిత్సుబిషి పజేరో స్పోర్ట్ సెలక్ట్ ప్లస్ ఎస్‌యూవీ

ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే, టూ వీల్ డ్రైవ్ ఉన్న పజేరో స్పోర్ట్ సెలక్ట్ ప్లస్ వేరియంట్లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్లో మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అందివ్వడం జరిగింది.

మిత్సుబిషి పజేరో స్పోర్ట్ సెలక్ట్ ప్లస్ ఎస్‌యూవీ

రూ. 84 కోట్ల ఖరీదైన ఈ రోల్స్ రాయిస్ కారులోని గడియారం కూడా చేతితో తయారు చేసిందే!

English summary
Read In Telugu Mitsubishi Pajero Sport Select Plus Launched In India; Priced At Rs 30.53 Lakh Onward
Story first published: Tuesday, May 30, 2017, 12:52 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark