ఇండియాలో విడుదలకు సిద్దమైన మిత్సుబిషి ఎక్స్‌పాండర్ బ్రోచర్ లీక్

Written By:

జపాన్ వాహన తయారీ దిగ్గజం మిత్సుబిషి తమ అతి చిన్న ఎమ్‌పీవీ వాహనం ఎక్స్‌పాండర్‌ను ఆష్కరించడానికి సర్వం సిద్దం చేసుకుంది. ప్రపంచ ఆవిష్కరణకు ముందే, మిత్సుబిషి ఎక్స్‌పాండర్ బ్రోచర్ రహస్యంగా లీక్ అయ్యింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
మిత్సుబిషి ఎక్స్‌పాండర్ బ్రోచర్ లీక్

ఎక్స్‌పాండర్(Xpander) గా పిలువబడే ఎమ్‌పీవీని వచ్చే ఆగష్టులో జరగనున్న గైకిండో ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఆటో షో వేదిక మీద ప్రదర్శించనుంది. మిత్సుబిషి షీల్డ్ డిజైన్ భాష ఆధారంగా దీనిని రూపొందించారు.

Recommended Video
2017 Datsun redi-GO 1.0 Litre Review | In Telugu - DriveSpark తెలుగు
మిత్సుబిషి ఎక్స్‌పాండర్ బ్రోచర్ లీక్

బ్రోచర్ ప్రకారం, మిత్సుబిషి ఎక్స్‌పాండర్‌లో పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, డ్యూయల్ టోన్ బ్లాక్-బీజి ఇంటీరియర్ ఉన్నాయి.

మిత్సుబిషి ఎక్స్‌పాండర్ బ్రోచర్ లీక్

ఎక్స్‌పాండర్ ఇంటీరియర్‌లో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, కలర్ ఎమ్‌ఐడి(మోల్డెడ్ ఇంటర్ కనెక్ట్ డివైజ్). అంతే కాకుండా, కీ లెస్ ఎంట్రీ మరియు వెహికల్ ఆఫ్ చేసిన తరువాత కూడా 30 సెకండ్ల పాటు హెడ్ ల్యాంప్స్ ఆన్‌లో ఉంటాయి.

మిత్సుబిషి ఎక్స్‌పాండర్ బ్రోచర్ లీక్

మిత్సుబిషి ఎక్స్‌పాండర్ సాంకేతికంగా 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న ఎమ్‌ఐవిఇసి నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. 103బిహెచ్‌పి పవర్ మరియు 141ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో వస్తోంది.

మిత్సుబిషి ఎక్స్‌పాండర్ బ్రోచర్ లీక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఈ ఏడాది చివరి నాటికి మిత్సుబిషి ఎక్స్‌పాండర్ ఇండోనేషియా మార్కెట్లో విడుదల కానుంది. వచ్చే ఏడాది ప్రారంభం నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన మార్కెట్లోకి విడుదల చేయనుంది. దేశీయంగా విడుదలైతే, విపణిలో ఉన్న మారుతి సుజుకి ఎర్టిగా మరియు రెనో లాజీ లకు గట్టిపోటీనివ్వనుంది.

English summary
Read In Telugu: Mitsubishi Xpander Brochure Leaked Ahead Of Debut
Story first published: Wednesday, August 2, 2017, 10:40 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark