మొబిల్1 2017 దక్షిణ్ డేర్ ర్యాలీ అప్‌డేట్స్: అదే జోరు మీదున్న సామ్రాట్ యాదవ్!

Written By:

మొబిల్1 2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ రెండవ రోజు విజవంతంగా పూర్తి చేసుకుంది. ర్యాలీ ప్రతినిధులు రెండవ రోజు ర్యాలీలో పాల్గొన్నవారందరికీ సూపర్ స్పెషల్ స్టేజ్ నిర్వహించారు. గత ఏడాది నుండి ఈ సూపర్ స్పెషల్ స్టేజ్ నిర్వహించడాన్ని ప్రారంభించారు.

ర్యాలీలో పాల్గొనే డ్రైవర్లకు ఇదొక కఠిన పరీక్ష అని చెప్పవచ్చు. డ్రైవర్లు మరియు రైడర్ల నెపుణ్యాన్ని పరీక్షించడానికి దీనిని నిర్వహిస్తున్నారు. జూలై 18, 2017 న చిత్రదుర్గలో ర్యాలీ రెండవ రోజు ఈ సూపర్ స్పెషల్ స్టేజ్ ర్యాలీని 2017 ఎడిషన్ దక్షిణ్ డేర్ ర్యాలీలో భాగంగా రెండు కిలోమీటర్ల పాటు నిర్వహించారు.

2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ

తొలి రోజు ఆధిక్యంలో కొనసాగిన, సామ్రాట్ యాదవ్ మరియు ఎస్ఎన్ నిజామి రెండవ రోజు కూడా తమ ఆధిక్యాన్ని కొనసాగించారు. సెకండ్ డే ర్యాలీ మొత్తాన్ని 4 గంటల, 55 నిమిషాల 04 సెకండ్ల వ్యవధిలో తమ మారుతి సుజుకి జిప్సీ ద్వారా చేధించారు.

2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ

ర్యాలీలో రెండవ రోజు అల్టిమేట్ కార్స్ కెటగిరీలో 4 గంటల 58 నిమిషాల 13 సెకండ్ల వ్యవధిలో మారుతి సుజుకి టీమ్ నుండి సూరేశ్ రాణా మరియు కో-డ్రైవర్ అశ్విన్ నాయక్ తమ గ్రాండ్ వితారా వెహికల్‌తో ర్యాలీ పూర్తి చేసి రెండవ స్థానంలో నిలిచారు. వీరికో చేరువలోనే 4:59:50 సెకండ్ల కాలంలో సందీప్ శర్మ మరియు కరణ్ ఆర్య జిప్సీ ద్వారా డే 2 ర్యాలీ పూర్తి చేసి మూడవ స్థానంలో నిలిచారు.

2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ

ర్యాలీలలో కార్లతో పోల్చుకుంటే మోటార్ సైకిళ్లు చాలా వేగంగా ఉంటాయి. అల్టిమేట్ బైక్స్ కెటగిరీలో 03 గంటల 10 నిమిషాల 41 సెకండ్ల వ్యవధిలో డే 2 నిర్ణయించిన దూరాన్ని చేధించి టి నటరాజ్ మొదటి స్థానంలో నిలిచాడు.

2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ

03:11:23 సమయంలో ర్యాలీలో స్టేజ్ 2 పూర్తి చేసి అబ్దుల్ వహీద్ ద్వితీయ స్థానంలో నిలిచాడు. సంజయ్ కుమార్ 03:11:30 సమయంతో తొలి రోజు ఆధిక్యాన్ని కోల్పోయి రెండవ రోజు తృతీయ స్థానానికి చేరుకున్నాడు.

2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ

రెండవ రోజు ర్యాలీ ముగిసిన అనంతరం సమ్రాట్ యాదవ్ మాట్లాడుతూ," ర్యాలీలో పోటీ రోజురోజుకీ పెరుగుతూ, కఠినమవుతోంది. సూపర్ స్పెషల్ స్టేజ్ కండక్ట్ చేయడం ద్వారా తరువాత ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి కావాల్సిన రైడింగ్ స్కిల్స్ పెంచుకోవడానికి తోడ్పడిందని పేర్కొన్నాడు.

2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ

2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీలోని మూడవ స్టే జూలై 19, 2017 న ఐనమంగళ నుండి బెల్గాం దిశగా సాగింది. నేటి ర్యాలీ వివరాలు రేపటి దక్షిణ్ డేర్ ర్యాలీ అప్‌డేట్స్ కథనంలో... అంత వరకు మరిన్ని ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి...

English summary
Read In Telugu: 2017 Maruti Suzuki Dakshin Dare: Day 2 - Samrat Yadav Leads In Ultimate Cars And T Natraj In Bikes
Story first published: Wednesday, July 19, 2017, 17:08 [IST]
Please Wait while comments are loading...

Latest Photos