ఏడు రెట్లు ఎక్కువ ధర ఉన్న వ్రాంగ్లర్‌తో పోటీపడుతున్న థార్

Written By:

అమెరికు చెందిన జీప్ దేశీయంగా వ్రాంగ్లర్ ఎస్‌యూవీని విడుదల చేసింది. దీని ధర భారత దేశపు మహీంద్రా థార్ ఎస్‌యూవీ కన్నా ఏడు రెట్లు ఎక్కువ. అయితే ఓ మోడిఫికేషన్స్ సంస్థ ధర విషయాన్ని ప్రక్కన పెట్టి వ్రాంగ్లర్‌ను పోలిన శైలిలో అచ్చం జీప్ వ్రాంగ్లర్ అనుభవాన్ని పొందే విధంగా మహీంద్రా థార్ జీపును మోడిఫై చేసింది. మోడిఫైడ్ మహీంద్రా థార్ కు చెందిన ఫోటోలు మరియు పూర్తి వివరాలు వివరంగా....

మోడిఫైడ్ మహీంద్రా థార్

దేశీయంగా ఆఫ్ రోడింగ్ ప్రియులకు కొదవేలేదు, జీప్ వ్రాంగ్లర్ గురించి తెలిసిన ప్రతి ఆఫ్ రోడింగ్ ఔత్సాహికుడు ఎలాగైనా కొనుగోలు చేయాలని కోరుకుంటాడు. కాని ధర విషయానికి వస్తే వారి ఇష్టాన్ని చంపుకుంటున్నారు. మీరు కూడా వ్రాంగ్లర్ ఎస్‌యూవీ ప్రేమికులయితే ఈ కథనం మీ కోసమే...

మోడిఫైడ్ మహీంద్రా థార్

రెడ్ ఫాక్స్ ఆటోకేర్ అనే మోడిఫికేషన్ సంస్థ అచ్చం జీప్ వ్రాంగ్లర్ ఎస్‌యూవీని పోలి ఉండే విధంగా మహీంద్రా థార్ ఎస్‌యూవీని మోడిఫై చేసింది. వ్రాంగ్లర్ కొనలేకపోయామని నిరాశ చెందే వారికి ఇది శుభవార్త అని చెప్పచ్చు ఎందుకంటే వ్రాంగ్లర్ ఎస్‌యూవీ ధర మహీంద్రా థార్ ఎస్‌యూవీ కన్నా ఏడు రెట్లు ఎక్కువగా ఉంటుంది కాబట్టి.

మోడిఫైడ్ మహీంద్రా థార్

జీప్ వ్రాంగ్లర్ వాహనానికి చెందిన ఎక్ట్సీరియర్ విఢి భాగాలను సేకరించి శుభ్రంగా థార్ ఎస్‌యూవీని మోడిఫై చేశారు. అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, డోర్ హ్యాండిల్స్, ఇంధన ట్యాంకు మూత, మరియు టెయిల్ లైట్ సెక్షన్ వంటి వాటిని వ్రాంగ్లర్ నుండి సేకరించారు. ముందు వైపు అద్దం క్రింది భాగాన అంటిచిన లోగో కూడా జీప్ నుండి సేకరించినదే.

మోడిఫైడ్ మహీంద్రా థార్

విండ్‌స్క్రీన్ (ముందు వైపు అద్దం)ను జీప్ నుండి కొనుగోలు చేసిన వ్రాంగ్లర్ ఎస్‌యూవీ నుండి తొలగించి మోడిఫైడ్ మహీంద్రా థార్‌లో అందివ్వడం జరిగింది.

మోడిఫైడ్ మహీంద్రా థార్

పెద్ద పరిమాణంలో ఉన్న వీల్ ఆర్చెస్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, వ్రాంగ్లర్ నుండి గ్రహించిన ముందు మరియు వెనుక వైపు బంపర్లు, మ్యాక్సీ టైర్లు, యాక్సిలరీ లైట్లు అదే విధంగా ధృడమైన రూఫ్ టాప్ వంటి వాటిని ఈ మోడిఫైడ్ థార్ ఎస్‌యూవీలో గుర్తించవచ్చు.

మోడిఫైడ్ మహీంద్రా థార్

మోడిఫైడ్ థార్ ఇంటీరియర్ విషయానికి వస్తే, మునుపటి థార్ లోని సీట్ల కన్నా అత్యంత సౌకర్యవంతమైన సీటింగ్ వ్యవస్థను మరియు వ్రాంగ్లర్ లో నుండి సేకరించిన మ్యూజిక్ సిస్టమ్ ఇందులో కల్పించడం జరిగింది.

మోడిఫైడ్ మహీంద్రా థార్

మీకు ఇలాంటి మోడిఫైడ్ థార్ ఎస్‌యూవీ కావాలా.... ? సుమారుగా రూ. 5 లక్షలు వెచ్చిస్తే తొమ్మిది నెలల కాలంలో పూర్తి స్థాయిలో జీప్ వ్రాంగ్లర్ శైలిలో మోడిఫై చేసిన థార్‌ను పొందగలరు.

మోడిఫైడ్ మహీంద్రా థార్

మహీంద్రా అండ్ మహీంద్రా థార్ ఎస్‌యూవీ స్వయంగా మోడిఫై చేసి థార్ డేబ్రేక్ ఎడిషన్ పేరుతో అందిస్తోంది. థార్ బ్రేక్ ఎడిషన్ కన్నా తక్కువ ధరలోనే రెడ్ ఫాక్స్ ఆటోకేర్ మోడిఫికేషన్ సంస్థ వ్రాంగ్లర్ శైలిలో థార్ ను మోడిఫై చేస్తోంది.

మోడిఫైడ్ మహీంద్రా థార్

ఎస్‌యూవీ కొనే ఆలోచనలో ఉన్నారా....? అయితే ఓ సారి ఈ ఎస్‌యూవీని చూడండి..!!

 
English summary
This Modified Mahindra Thar Is An Affordable Wrangler You Can Own
Story first published: Wednesday, February 22, 2017, 13:21 [IST]
Please Wait while comments are loading...

Latest Photos