ఇది మారుతి 800 అంటే నమ్మగలరా...?

Written By:

1984లో ఓ తుఫానులా విపణిలోకి వచ్చి సంచలనాత్మక విజయం సాధించిన మారుతి 800 శకానికి ముగింపు పలుకుతూ ఆల్టో 800 ను ప్రవేశపెట్టింది. అయినప్పటికీ మారుతి 800కు ఫ్యాన్స్ తగ్గలేదు. ఆ కారుకు ఉన్న ఫ్యాన్స్ అలాగే ఉన్నారు.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
కన్వర్టిబుల్ స్పోర్ట్స్ కారులోకి మారుతి 800

అదే విధంగా కన్వర్టిబుల్ కార్ల మార్కెట్ ఇండియాలో అస్సలు లేదు. ఇందుకు కారణం కన్వర్టిబుల్ కార్లను వినియోగించే వాతావరణం లేకపోవడమే. ఓపెన్ టాప్ కార్లను వాడుతున్నపుడు వాతావరణం స్థిరంగా ఉండాలి.

కన్వర్టిబుల్ స్పోర్ట్స్ కారులోకి మారుతి 800

కన్వర్టిబుల్ మరియు పాత మారుతి 800 కలయికలో ఓ కారు కావాలనుకున్నాడు ఢిల్లీకి చెందిన జగ్జీత్ సింగ్. ఆయన ఐడియాకు ప్రతిరూపమే ఈ మోడఫైడ్ మారుతి 800 కన్వర్టిబుల్ స్పోర్ట్స్ కారు. కన్వర్టిబుల్ కార్ల తయారీ కంపెనీలు సైతం ఆశ్చర్యపోయేలా దీనిని మోడిఫై చేశాడు.

కన్వర్టిబుల్ స్పోర్ట్స్ కారులోకి మారుతి 800

జపాన్‌లోని బీట్ కన్వర్టిబుల్ కారు ప్రేరణతో జగ్జీత్ సింగ్ ఈ మారుతి 800 ను మోడిఫై చేశాడు. ముందు వైపున ఫియట్ పాలియో హెడ్ ల్యాంప్స్‌ను చక్కగా ఫ్రంట్ రీడిజైన్ చేయబడిన బంపర్‍‌లో అమర్చాడు. బానెట్ వెనక్కి కాకుండా ముందుకు ఓపెన్ అయ్యేలా మార్చడం జరిగింది.

కన్వర్టిబుల్ స్పోర్ట్స్ కారులోకి మారుతి 800

రియర్ డిజైన్ విషయానికి వస్తే, షెవర్లే స్పార్క్ కారు నుండి సేకరించిన గుండ్రటి ఆకారంలో ఉన్న టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. రెండు టెయిల్ ల్యాంప్స్‌కు మధ్యలో కల్పించిన డోర్ ద్వారా డిక్కీని యాక్సెస్ చేసుకోవచ్చు.

కన్వర్టిబుల్ స్పోర్ట్స్ కారులోకి మారుతి 800

ఇద్దరు మాత్రమే ప్రయాణించడానికి వీలుగా సీటింగ్ లేవుట్ మార్చేయడం జరిగింది. కన్వర్టిబుల్ కారు రూపంలోకి రావాలి కాబట్టి విచ్చుకునే మరియు క్లోజ్ అయ్యే రిట్రాక్టబుల్ రూఫ్ ఇందులో అందించాడు.

కన్వర్టిబుల్ స్పోర్ట్స్ కారులోకి మారుతి 800

ఇంజన్ నుండి వచ్చే ఉద్గారాలు సులభంగా బయటకు వెళ్లేందుకు రెండు ఫ్రీ ఫ్లో ఎగ్జాస్ట్ పైపులను అందివ్వడం జరిగింది. ఒకే వరుస సీటింగ్, రెండు డోర్లు మాత్రమే ఉన్నాయి. యెల్లో కలర్ బాడీ పెయింట్ స్కీమ్‌లో ఉంది.

కన్వర్టిబుల్ స్పోర్ట్స్ కారులోకి మారుతి 800

ఒకప్పటి మారుతి 800 తో పోల్చుకుంటే, మోడిఫికేషన్ తర్వాత అద్బుతమైన రూపంలో కన్వర్టిబుల్ మారుతి 800కు ఎంత తేడా ఉందో చూడండి. ఎలాంటి మారుతి 800 కారైనా ఈ మొత్తం మోడిఫికేషన్‌కు రూ. 3.5 లక్షలు ఖర్చవుతుందని జెఎస్ డిజైన్స్ తెలిపింది.

English summary
Read In Telugu: Modified Maruti 800 Into A Convertible Sports Car
Story first published: Thursday, July 20, 2017, 12:48 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark