నవంబరులో విడుదలకు సిద్దమైన కొత్త కార్లు: పూర్తి వివరాలు...

గత రెండు నెలలో వ్యవధిలో ఎన్నో స్పెషల్ ఎడిషన్ మరియు ఫేస్‌లిఫ్ట్ మోడళ్లు మార్కెట్లోకి లాంచ్ అయ్యాయి. వచ్చే నెలలో మరిన్ని కొత్త కార్లు విడుదల కానున్నాయి.

By Anil

పండుగ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఇండియన్ మార్కెట్లోకి కొన్ని కొత్త కార్లు విడుదలయ్యాయి. వాటిలో టాటా నెక్సాన్, స్కోడా వారి తొలి 7-సీటర్ ఎస్‌యూవీ కొడియాక్ మరియు మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ వంటి అతి ప్రదానమైన మోడళ్లు లాంచ్ అయ్యాయి.

కొత్త కార్లు

గత రెండు నెలలో వ్యవధిలో వీటితో పాటు ఎన్నో స్పెషల్ ఎడిషన్ మరియు ఫేస్‌లిఫ్ట్ మోడళ్లు మార్కెట్లోకి లాంచ్ అయ్యాయి. వచ్చే నెలలో మరిన్ని కొత్త కార్లు విడుదల కానున్నాయి. అయితే, ఇప్పటి వరకు విడుదలైన వాటిలో మీకు ఏవీ నచ్చకపోతే ఈ స్టోరీలో ఉన్న కార్ల మీద ఓ లుక్కేసుకోండి...

Recommended Video

[Telugu] Skoda kodiaq Launched In India - DriveSpark
కొత్త కార్లు

రెనో క్యాప్చర్

ఇండియన్స్‌కు డస్టర్ ద్వారా ఎస్‌యూవీ రుచి చూపించిన రెనో ఇప్పుడు ప్రీమియమ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి సరికొత్త మోడల్‌ను లాంచ్ చేయడానికి సర్వం సిద్దం చేసుకుంది. డస్టర్ పై స్థానాన్ని భర్తీ చేయనున్న రెనో క్యాప్చర్ విపణిలో ఉన్న హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా ఎక్స్‌యూవీ500, టాటా హెక్సా మరియు జీప్ కంపాస్ లోని పెట్రోల్ మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

కొత్త కార్లు

రెనో క్యాప్చర్ సాంకేతికంగా డస్టర్ లోని అవే ఇంజన్ వేరియంట్లలో రానుంది. క్యాప్చర్ లోని 1.5-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 105బిహెచ్‌పి పవర్ మరియు 142ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మరియు ఇందులోని శక్తివంతమైన 1.5-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ 109బిహెచ్‌పి పవర్ మరియు 240ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

కొత్త కార్లు

పెట్రోల్ వెర్షన్ క్యాప్తర్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు డీజల్ వెర్షన్ క్యాప్చర్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ చాయిస్‌లలో లభించనుంది.

  • విడుదల : నవంబర్ 6, 2017
  • ధరల శ్రేణి అంచనా: రూ. 10-14 లక్షల మధ్య
  • కొత్త కార్లు

    ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

    ఇండియన్ ఎస్‌యూవీ మార్కెట్లోకి డస్టర్ తరువాత వచ్చిన మోడల్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్. అమెరికా దిగ్గజం పోర్డ్ తమ ఎకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని విభిన్న ఇంజన్, విభిన్న ట్రాన్స్‌మిషన మరియు రకరకాల వేరింట్ల ఆప్షన్స్‌లో ఎంచుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే, విపరీతమైన పోటీ ఎదుర్కోవడంలో విఫలమవుతూ వచ్చింది. అందుకోసం భారీ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ మార్పులతో ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీని ఫేస్‌లిఫ్ట్ రూపంలో సిద్దం చేసింది.

    Trending On DriveSpark Telugu:

    మృదువైన పక్షి ఢీ కొంటె ఫతనమవుతున్న విమానాలు: దీని వెనకున్న మర్మం ఏమిటి?

    ప్లేన్ క్రాష్‌కు కారణమయ్యే కామన్ అండ్ మెయిన్ రీజన్స్

    కొత్త కార్లు

    ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీలో ఇది వరకే ఉన్న 1.5-లీటర్ డీజల్ మరియు 1.0-లీటర్ బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్‌లతో పాటు ఫోర్డ్ వారి సరికొత్త మూడు సిలిండర్ల 1.5-లీటర్ పెట్రోల్ డ్రాగన్ సిరీస్ ఇంజన్‌ను కూడా రానుంది. 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్, అదే విధంగా 1.5-లీటర్ డీజల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో లభించనుంది.

    కొత్త కార్లు

    ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్‍‌‌లో సాంకేతికం అప్‌డేట్స్‌తో పాటు అధునాతిన ప్రీమియమ్ ఇంటీరియర్ ఫీచర్లను అందిస్తోంది.

    • విడుదల తేదీ: నవంబర్ 8, 2017
    • ధర అంచనా: రూ. 7 నుండి 9.5 లక్షల మధ్య
    • కొత్త కార్లు

      మారుతి సుజుకి సెలెరియో ఎక్స్

      ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన తొలి ఆటోమేటిక్ కారు మారుతి సుజుకి సెలెరియో. సెలెరియో ఆటోమేటిక్ భారతీయులకు తొలిసారిగా ఆటోమేటిక్ డ్రైవ్ అనుభవాన్ని కల్పించింది. దీని తరువాత ఎన్నో మోడళ్లలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పరిచయం అయ్యింది. బడ్జెట్ ఫ్రెండ్లీ హ్యాచ్‌బ్యాక్ సెలెరియో కారును ఇప్పుడు సెలెరియో ఎక్స్ ఎడిషన్‌లో విడుదలకు సిద్దం చేసింది.

      కొత్త కార్లు

      క్రాసోవర్ వెర్షన్‌గా చెప్పుకునే మారుతి సెలెరియో ఎక్స్ స్పోర్టివ్ డిజైన్ శైలిలో విడుదల కానుంది. రీడిజైన్ చేయబడిన బంపర్లు, హనీ కాంబ్ మెష్ ఫ్రంట్ గ్రిల్, అధిక గాలిని గ్రహించేందుకు పెద్ద పరిమాణంలో ఉన్న ఎయిర్ ఇంటికేటర్ వంటివి ఇందులో ప్రధాన మార్పులుగా రానున్నాయి.

      కొత్త కార్లు

      మారుతి సుజుకి తమ 1.0-లీటర్ కెపాసిటి గల అదే మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌ను సెలెరియో ఎక్స్ మోడల్‌లో 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో అందివ్వనుంది.

      • విడుదల అంచనా: నవంబర్ 2017 చివరి నాటికి
      • ధర అంచనా: రూ. 4.5 నుండి 5.5 లక్షల మధ్య
      • కొత్త కార్లు

        డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

        నవంబర్ 2017లో హ్యాచ్‌బ్యాక్, ఎస్‌యూవీల మిశ్రమంలో కొత్త కార్లు విడుదల కానున్నాయి. బాడీ స్టైల్, బడ్జెట్ రేంజ్ కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈ మూడు మోడళ్లు కీలకపాత్ర పోషించనున్నాయి. వీటితో పాటు కార్ల తయారీ సంస్థలు సంత్సరాంతపు ఆఫర్లు సిద్దమవుతున్న నేపథ్యంలో కొత్త కార్లను ఎంచుకోవడానికి మరో సందర్భం రానుందని చెప్పవచ్చు.

Most Read Articles

English summary
Read In Telugu: New Car Launches In November 2017: Launch Date, Specifications, Images And Expected Price
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X