డీజల్ కార్ల కన్నా పెట్రోల్ కార్లు అత్యంత ప్రమాదకరమైవి: అధ్యయనం

Written By:

పెట్రోల్ కార్ల కన్నా ఆధునికి డీజల్ కార్లు పర్యావరణానికి ఎంతో మంచివని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనం ప్రకారం, పెట్రోల్ కార్లే ప్రస్తుతం ఉన్న కొత్త డీజల్ కార్ల కన్నా ఎక్కువ ఉద్గారాలను విడుదల చేస్తాయని తేలింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
కొత్త డీజల్ కార్లు పర్యావరణానికి మంచివే

కొత్త డీజల్ కార్లు పెట్రోల్ కార్లతో పోల్చుకుంటే తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తాయని కెనడాలోని యూనివర్సిటి డి మోంట్రియల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్యాట్రిక్ హయేస్ పేర్కొన్నాడు. " డీజల్ కార్ల నుండి వచ్చే కాలుష్యాలు మన కంటికి కనిపిస్తాయి కాబట్టి, డీజల్ కార్లను కాలుష్యకారకాలుగా పరిగణిస్తున్నాము. అయితే పెట్రోల్ కార్లు కంటికి కనింపించని ప్రమాదకరమైన కాలుష్యాన్ని వాతావరణంలోకి విడుదల చేస్తాయని ఆయన చెప్పుకొచ్చాడు."

కొత్త డీజల్ కార్లు పర్యావరణానికి మంచివే

అధ్యయనంలో భాగంగా చేసిన పరిశోధనల్లో డీజల్ కార్లు విడుదల చేసే కర్బన సమ్మేళన (PM) ఉద్గారాలు పొగగొట్టం ద్వారా వాతావరణంలోకి విడుదలవుతాయి. ఇందులో బ్లాక్ కార్బన్, ప్రాథమిక అర్గానిక్ ఏరోసిల్ (POA) మరియు ఏరోసిల్ (SOA) ఉంటాయి.

కొత్త డీజల్ కార్లు పర్యావరణానికి మంచివే

డీజల్ కార్లు విడుదల చేసే ఉద్గారాల్లో ప్రమాదకరమైన రియాక్టివ్ ఆక్సిజన్ కణాలు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల కణజాలం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఈ మధ్య కాలంలో యూరప్ మరియు దక్షిణ అమెరికాలో విడుదలవుతున్న కొత్త డీజల్ కార్లలో డీజల్ కణాల ఫిల్టర్ల (DPF)ను ఏర్పాటుచేయాలని ప్రొఫెసర్ తెలిపాడు.

కొత్త డీజల్ కార్లు పర్యావరణానికి మంచివే

పరిశోధకుల మేరకు, డీజల్ కణాలను గాలిలోకి విడుదల చేయకుండా ఫిల్టర్ చేసే పరికరాలను ఏర్పాటు చేయడంతో డీజల్ కార్ల ఉద్గారాలను దాదాపుగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. డీజల్ కార్లతో పోల్చుకుంటే పెట్రోల్ కార్లు 22 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద పది రెట్లు ఎక్కువ కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తున్నట్లు గుర్తించారు.

కొత్త డీజల్ కార్లు పర్యావరణానికి మంచివే

అదే విధంగా వాతావరణ ఉష్టోగ్రత మైనస్ 7 డిగ్రీల సెల్సియస్ ఉన్నపుడు డీజల్ కార్లతో పోల్చుకుంటే పెట్రోల్ కార్లు 62 రెట్ల కన్నా ఎక్కువగా ఉద్గారాలను విడుదల చేస్తాయని గుర్తించడం జరిగింది. తక్కువ ఉష్ణోగ్రతలో పొల్యూషన్ పెరగడానికి ప్రధానం కారణం కోల్డ్-స్టార్ట్ ఎఫెక్ట్ అని తేల్చారు.

కొత్త డీజల్ కార్లు పర్యావరణానికి మంచివే

వాతావరణం చల్లగా ఉన్నపుడు పెట్రోల్ ఇంజన్ అంత శక్తివంతమైనది కాదు. ఇందుకు కారణం ఇంజన్ వేడిగా లేకపోతే క్యాటలిటిక్ కన్వర్టర్ ఆన్ అవ్వదు. తద్వారా పవర్ లాస్ అధికంగా జరిగి ఆశించిన శక్తి చక్రాలకు చేరదు. అంతే కాకుండా కాలం చెల్లిన డీజల్ కార్లు పర్యావరణానికి హానికారకమైన నైట్రోజన్ ఆక్సైడ్‌ను విడుదల చేస్తుంది. ఇది ఆమ్ల వర్షానికి (Acid Rain) దారితీస్తుంది.

కొత్త డీజల్ కార్లు పర్యావరణానికి మేలు చేయాలంటే డీజల్ కణాల ఫిల్టర్లను అమర్చుకోవడం తప్పనిసరని పరిశోధకులు వెల్లడించారు.

కొత్త డీజల్ కార్లు పర్యావరణానికి మంచివే

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

పాత డీజల్ ఇంజన్‌లతో పోల్చితే ఆధునిక డీజల్ ఇంజన్‌లు సాంకేతికంగా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కలిగి ఉన్నాయి. అయితే మెయింటెనెన్స్ ఖర్చు తక్కువగా ఉండటం చేత ఎక్కవ మంది పెట్రోల్ కార్లనే ఎంచుకుంటున్నారు. మొత్తానికి సుదీర్ఘంగా సాగిన పరిశోధనల ప్రకారం పెట్రోల్ కార్ల కన్నా కొత్త డీజల్ కార్లు పర్యావరణానికి మేలు మరియు ఇవి తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తాయని తేలింది.

English summary
Read In Telugu: Study Reveals New Diesel Cars Are Better For Environment
Story first published: Monday, July 17, 2017, 10:36 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark