2017 పుంటో హ్యాచ్‌బ్యాక్‌ను ఆర్గో పేరుతో తీసుకొస్తున్న ఫియట్

Written By:

ఫియట్ కొన్ని టీజర్ల ద్వారా తమ నెక్ట్స్ జనరేషన్ పుంటో హ్యాచ్‌బ్యాక్‌ను రివీల్ చేసింది. అయితే ఈ 2017 పుంటోను ఆర్గో పేరుతో మళ్లీ పరిచయం చేయనుంది. ఫియట్ ఆర్గో హ్యాచ్‌బ్యాక్ గురించి మరింత సమాచారం.

ఆర్గో పేరుతో 2017 ఫియట్ పుంటో

సరికొత్త పుంటో హ్యాచ్‌బ్యాక్‌ను బ్రెజిల్‌లో ఫియట్ అభివృద్ది చేసింది. దీనిని ప్రత్యేకించి లాటిన్ అమెరికా మార్కెట్ కోసం న్యూ డిజైన్‌లో అభివృద్ది చేసినట్లు తెలిసింది. అయితే ఇండియన్ మార్కెట్లో కూడా దీని ఎంట్రీ ఉండనుంది.

ఆర్గో పేరుతో 2017 ఫియట్ పుంటో

ఇటాలీకి చెందిన ఫియట్ ఇదే ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా ఓ చిన్న క్రాసోవర్ కారును కూడా అభివృద్ది చేయనున్నట్లు సమాచారం.

ఆర్గో పేరుతో 2017 ఫియట్ పుంటో

గ్రీకు పురాణాల నుండి సేకరించిన జాసన్ మరియు ఆర్గోనాట్స్ ఆధారంగా నూతన పుంటోకు ఆర్గో అనే పేరును పెట్టారు. ఈ మోడల్ ఆట్రాక్టివ్, ఎసెన్ష్ మరియు స్పోర్టింగ్ అనే మూడు వేరియంట్లలో లభించనుంది.

ఆర్గో పేరుతో 2017 ఫియట్ పుంటో

ఫోటోల ప్రకారం, ఆర్గో ముందు వైపు డిజైన్‌లో ఉన్న ఎరుపు రంగు బంపర్, 17-అంగుళాల చక్రాలు మరియు పెద్ద ఎగ్జాస్ట్ పైపు ఆధారంగా ఇది ఆర్గో స్పోర్ట్ వెర్షన్ అని తెలుస్తోంది.

ఆర్గో పేరుతో 2017 ఫియట్ పుంటో

సాంకేతికంగా ఆల్ న్యూ పుంటో (ఆర్గో)లోని స్పోర్టింగ్ వేరియంట్లో ఇ.టార్క్ అనే కంపెనీ నుండి సేకరించిన 137బిహెచ్‌పి గరిష్ట పవర్ ఉత్పత్తి చేయగల 1.8-లీటర్ సామర్థ్యం గల ఇంజన్ కలదు.

ఆర్గో పేరుతో 2017 ఫియట్ పుంటో

స్టాండర్డ్ వేరియంట్లలో ఫైర్‌ఫ్లై నుండి సేకరించిన 76బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల 1.0-లీటర్ ఇంజన్ మరియు 17.5బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం ఉన్న నాలుగు సిలిండర్ల 1.3-లీటర్ ఇంజన్ వేరియంట్లు ఉన్నాయి.

ఆర్గో పేరుతో 2017 ఫియట్ పుంటో

ఫియట్ ఈ ఆర్గోలో మందంపాటి ప్లాస్టిక్ ఎక్ట్సీరియర్ సొబగులు అందించింది. కారుకు అన్ని వైపులా ఉన్న ఆర్చెస్, సైడ్ స్కర్ట్స్, మరియు రియర్ బంపర్ల మీద ప్లాస్టిక్ క్లాడింగ్ కలదు.

పుంటో ఆర్గో బాడీ మీద ముందు వైపున్న హెడ్ లైట్లు మరియు వెనుక వైపున్న టెయిల్ లైట్లను కలుపుతూ, డోర్ హ్యాండిల్స్ మీదుగా పోయే ధృడమైన షోల్డర్ లైన్లు కలవు.

బ్లాక్ కలర్ బాడీతో ఉన్న ఆర్గో ఫోటోల ద్వారా దీని డిజైన్ సొబగులను గుర్తించడం కాస్త కష్టతరంగా మారిందని చెప్పవచ్చు. మిర్రర్లు, రియర్ టెయిల్ గేట్ స్పాయిలర్ వంటివి కాంట్రాస్టింగ్ ఫినిషింగ్‌లో ఉన్నాయి. ముందువైపు క్రింది భాగంలో ఉన్న గ్రిల్ అబర్త్ నుండి సేకరించినది.

Read more on: #ఫియట్ #fiat
English summary
Read In Telugu About 2017 Fiat Punto (Argo) Revealed In New Images
Story first published: Thursday, May 18, 2017, 11:56 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark