నెక్ట్స్ జనరేషన్ హోండా అమేజ్ విడుదల వివరాలు

Written By:

నెక్ట్స్ జనరేషన్ అమేజ్ కాంపాక్ట్ సెడాన్ మోడల్ అభివృద్ది దాదాపుగా పూర్తి కావచ్చింది. జపాన్‌ కంపెనీ హోండా మోటార్స్ వారి తొలి ఆల్ న్యూ మోడల్ అమేజ్‌ను ఇప్పటికే దేశీయంగా విక్రయాల్లో ఉన్న అమేజ్‌ను తరువాత తరం మోడల్‌గా విడుదల చేయనుంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
హోండా నెక్ట్స్ జనరేషన్ అమేజ్

హోండా మోటార్స్ సరికొత్త అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కారును వచ్చే ఏడాది ఢిల్లీలో జరగనున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించనుంది. గతంలో థాయిలాండ్‌లో ఆవిష్కరించిన ఫస్ట్ జనరేషన్ అమేజ్‌లా కాకుండా, ప్రపంచ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని దీని ఆవిష్కరించనుంది.

హోండా నెక్ట్స్ జనరేషన్ అమేజ్

హోండా ఆమేజ్ కాంపాక్ట్ సెడాన్‌తో పాటు హెచ్ఆర్-వి ఎస్‌యూవీని కూడా వచ్చే ఇండియన్ ఆటో ఎక్స్-పో వేదిక మీద ప్రదర్శించనుంది.

హోండా నెక్ట్స్ జనరేషన్ అమేజ్

సరికొత్త అమేజ్ 1.5-లీటర్ డీజల్ ఇంజన్ మరియు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లలో కూడా రానుంది. తాజాగా మారుతి విడుదల చేసిన న్యూ డిజైర్ లోని ఆటోమేటిక్ గేర్‌బాక్స్ డీజల్ వేరియంట్ విక్రయాలను పరిశీలిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని అమేజ్ డీజల్ ఏఎమ్‌టి విడుదలపై వ్యూహాత్మకంగా వ్యవహరించనుంది.

హోండా నెక్ట్స్ జనరేషన్ అమేజ్

నూతన డిజైర్ లోని పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు 22కిమీలు మరియు డీజల్ వేరియంట్ లీటర్‌కు 28.4కిమీల మైలేజ్ ఇస్తుంది. దీంతో అమేజ్ కాంపాక్ట్ సెడాన్‌లో మైలేజ్ మరింత మెరుగుపరచనుంది.

హోండా నెక్ట్స్ జనరేషన్ అమేజ్

క్యాబిన్ స్పేస్ పెంచేందుకు అమేజ్ కొలతలను పెంచనుంది. అయినప్పటికీ దీని పొడవు నాలుగు మీటర్లలోపే రూపొందిస్తోంది. బ్రియో హ్యాచ్‌బ్యాక్, మొబీలియో మరియు బిఆర్-వి లను డెవలప్‌ చేసిన వేదిక ఆధారంగా అమేజ్‌ను మళ్లీ అభివృద్ది చేయనుంది హోండా.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లో ఖరీదైన వాహనాలను విక్రయించడం మీద దృష్టిపెట్టింది కాబట్టి హోండా నుండి ఎంచుకోదగ్గ చిన్న కార్లు లేవు. అయితే డిజైర్‌కు పోటీగా కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లోకి విడుడల చేసిన అమేజ్ నిర్ధిష్టమైన అమ్మకాలు సాధిస్తోంది. నెలకు రమారమి 2,000 యూనిట్లను విక్రయిస్తోంది. ప్రస్తుతం కొన్ని మార్కెట్లకు మాత్రమే పరిమితమైన అమేజ్ ప్రపంచ మార్కెట్ కోసం రూపొందిస్తోంది.

English summary
Read In Telugu New-Generation Honda Amaze India Launch Details Revealed
Story first published: Wednesday, June 28, 2017, 10:31 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark