విపరీతమైన బుకింగ్స్ దిశగా హ్యుందాయ్ వెర్నా

Written By:

హ్యుందాయ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి ఆగష్టు 2017 న తమ సరికొత్త వెర్నా సెడాన్ కారును విడుదల చేసింది. డిజైన్ మార్పులతో, సరికొత్త ఫీచర్ల జోడింపుతో విడుదలైన వెర్నాకు ఊహించని స్పందన లభిస్తోంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
హ్యుందాయ్ వెర్నా సేల్స్

ఎంతో కాలంగా అప్‌డేట్ చేయకపోవడంతో, అవుట్‌డేటెడ్ వెర్షన్‌గా ముద్ర వేసుకున్న మునుపటి వెర్నా ఆశించిన విక్రయాలు జరపలేదు. ఈ తరుణంలో భారీ మార్పులు చేసి ఐదవ తరం వెర్నా సెడాన్‌ను విడుదల చేసింది.

Recommended Video
Toyota Etios Safety Experiential Drive in Bengaluru | In Telugu - DriveSpark తెలుగు
హ్యుందాయ్ వెర్నా సేల్స్

మరి న్యూ జనరేషన్ హ్యుందాయ్ వెర్నాకు ఆశించిన స్పందన లభిస్తోందా... అంటే నిజమనే చెప్పాలి. నూతన వెర్నా మీద కస్టమర్ల నుండి విపరీతమైన స్పందన లభిస్తున్నట్లు హ్యుందాయ్ వెల్లడించింది. సరిగ్గా విడుదలైనప్పటి నుండి 7,000 లకు పైగా బుకింగ్స్ మరియు 70,000 లకు వైగా ఎంక్వైరీలు వచ్చినట్లు వివరించింది.

హ్యుందాయ్ వెర్నా సేల్స్

వెర్నా మీద నమోదైన బుకింగ్స్ గురించి హ్యుందాయ్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ మరియు సిఇఒ వైకె. కూ మాట్లాడుతూ," ఐదవ తరానికి చెందిన వెర్నాను విడుదల చేసిన తొలి వారంలోనే భారీ బుకింగ్స్ నమోదయ్యాయి. ప్రస్తుతం ఇండియన్ మిడ్ సైజ్ సెడాన్ సెగ్మెంట్లో హ్యుందాయ్ వెర్నా ఖచ్చితంగా డబ్బుకు తగ్గ విలువలను కలిగి ఉంది. ప్రత్యేక కస్టమర్లను వెర్నా ఆధునిక డిజైన్‌ కట్టిపడేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు."

హ్యుందాయ్ వెర్నా సేల్స్

సెడాన్ సెగ్మెంట్లో సరికొత్త హ్యుందాయ్ వెర్నా ట్రెండ్ సెట్టర్ మరియు గేమ్ చేంజర్ అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి పోటీగా ఉన్న మరే ఇతర మోడళ్లతో పోల్చుకున్నప్పటికీ వెర్నాకే అధిక మార్కులు పడతాయి. ఈ నేపథ్యంలోనే వెర్నా మీద ఒక్కసారిగా భారీగా సేల్స్ నమోదయయ్యా. దీపావళి లోపే 10,000 కస్టమర్లకు వెర్నా కార్లను డెలివరీ ఇవ్వనుంది.

హ్యుందాయ్ వెర్నా సేల్స్

హ్యుందాయ్ వెర్నా 1.6-లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో పాటు 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తోంది.

హ్యుందాయ్ వెర్నా సేల్స్

సరికొత్త హ్యుందాయ్ వెర్నా సెడాన్ విపణిలో ఉన్న హోండా సిటి, మారుతి సుజుకి సియాజ్, వోక్స్‌వ్యాగన్ వెంటో మరియు స్కోడా ర్యాపిడ్ వంటి సెడాన్ కార్లకు గట్టి పోటీనివ్వనుంది.

హ్యుందాయ్ వెర్నాలోని వివిధ రకాల వేరియంట్లు మరియు ఫీచర్ల గురించి ప్రత్యేక కథనం....

హ్యుందాయ్ వెర్నా సేల్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హ్యుందాయ్ వెర్నా కేవలం నెల రోజుల వ్యవధిలోపే 7,000 బుకింగ్స్ నమోదు చేసుకోవడం గొప్ప మార్పే. మార్కెట్ లీడర్‌గా నిలిచే అవకాశాలు ఉన్న హ్యుందాయ్ వెర్నా మీద డిమాండ్ ఫ్యూచర్‌లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాదిలో మిగిలిన నాలుగు నెలలు కూడా మొత్తం పండుగ వాతావారణాన్ని కలిగి ఉండటంతో వెర్నా సేల్స్ విరివిగా పెరగనున్నాయి.

English summary
Read In Telugu: Newly Launched Hyundai Verna Receives Tremendous Response
Story first published: Friday, September 1, 2017, 14:40 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark