దుమ్ములేపుతున్న మారుతి డిజైర్ సేల్స్: ఒక్క నెలలో 30 వేలకు పైగా

మారుతి సుజుకి డిజైర్ సెడాన్ భారీ విక్రయాలతో భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది.

By Anil

మారుతి సుజుకి డిజైర్ సెడాన్ కారును న్యూ జనరేషన్‍‌లో మే 2017 న విపణిలోకి విడుదల చేసింది. ఇప్పుడు భారీ విక్రయాలతో భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కారుగా మొదటి స్థానంలో నిలిచింది.

మారుతి సుజుకి డిజైర్ సేల్స్

మారుతి డిజైర్ కాంపాక్ట్ సెడాన్ కారులో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో విక్రయాలు చాలా వరకు తగ్గిపోయాయి. ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో తొలి రెండు మూడు స్థానాల్లో నిలిచే డిజైర్ ఒకానొక దశలో ఐదవ స్థానానికి పడిపోయింది. ఈ క్రమంలో మారుతి సరికొత్త అప్‌డేటెడ్ 2017 డిజైర్‌ను విపణిలోకి విడుదల చేసింది.

Recommended Video

Toyota Etios Safety Experiential Drive in Bengaluru | In Telugu - DriveSpark తెలుగు
మారుతి సుజుకి డిజైర్ సేల్స్

విడుదల చేసిన నాటి నుండి డిజైర్ కు కస్టమర్ల నుండి భారీ స్పందన లభించింది. అనతి కాలంలో బుకింగ్స్ విపరీతంగా పెరగడంతో డిమాండ్‌కు సరిపడా కార్లను ఉత్పత్తి చేయలేక వెయింటింగ్ పీరియడ్ ప్రకటించింది. అయినప్పటికీ డిజైర్ కారునే కస్టమర్లు అధికంగా ఎంచుకున్నారు.

మారుతి సుజుకి డిజైర్ సేల్స్

గడిచిన ఆగష్టు నెలలో 30,934 యూనిట్లు అమ్ముడైన డిజైర్ కాంపాక్ట్ సెడాన్ భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కారుగా తొలి స్థానంలో నిలిచింది. ఇదే జాబితాలో వరుసగా ఉన్న ఆల్టో, బాలెనో, వితారా బ్రిజా, వ్యాగన్ ఆర్ మరియు స్విఫ్ట్ కార్లన్నింటిని వెనక్కి నెట్టేసింది.

మారుతి సుజుకి డిజైర్ సేల్స్

మునుపటి డిజైర్‌తో పోల్చుకుంటే చూడటానికి కాస్త అటు ఇటుగా ఒకేలా ఉంటుంది. అయితే పూర్తి స్థాయిలో రీడిజైన్ చేశారు. దీంతో ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ పరంగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. తేలిక పాటు బరువుతో, అధిక మైలేజ్ సాధ్యమయ్యే విధంగా సుజుకి గ్లోబల్ కాంపాక్ట్ సెడాన్ కార్ ఫ్లాట్‌ఫామ్ మీద సరికొత్త నిర్మించారు.

మారుతి సుజుకి డిజైర్ సేల్స్

సాంకేతికంగా న్యూ మారుతి డిజైర్ 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభ్యమవుతోంది. రెండింటిని 5-స్పీడ్ మ్యాన్యువల్‌తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

మారుతి సుజుకి డిజైర్ సేల్స్

మారుతి డిజైర్ పెట్రోల్ మైలేజ్ 22కిలోమీటర్లు మరియు డీజల్ వేరియంట్ మైలేజ్ 28.4 కిలోమీటర్లుగా ఉంది. మారుతి డిజైర్ పెట్రోల్ ధరల శ్రేణి రూ. 5.45 నుండి రూ. 8.41 లక్షల మధ్య అదే విధంగా డిజైర్ డీజల్ ధరల శ్రేణి రూ. 6.45 నుండి 9.41 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా లభిస్తోంది.

Most Read Articles

English summary
Read In Telugu: New maruti dzire clocks 30934 units august 2017 and becomes india’s best selling car.
Story first published: Friday, September 8, 2017, 15:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X