మారుతి సుజుకి గోప్యంగా ఉంచిన 2017 స్విఫ్ట్ డిజైర్ మైలేజ్ వివరాలు లీక్

మైలేజ్‌కు మారు పేరు మారుతి సుజుకి కార్లు, మైలేజ్ మీద దృష్టి పెట్టే మారుతి సుజుకి అతి త్వరలో సరికొత్త 2017 స్విఫ్ట్ డిజైర్ కారును అభివృద్ది చేసింది. అయితే దీని మైలేజ్ వివరాలు లీకయ్యాయి.

By Anil

మారుతి సుజుకి ఈ ఏడాది తమ నెక్ట్స్ జనరేషన్ 2017 స్విప్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌ను విడుదలకు సిద్దం చేస్తోంది. 2017 సంవత్సరం తొలిసగంలోనే విడుదల కానున్న దీని గురించి అనేక వార్తా వేదికలు వివిధ రకాల శబ్దాలు చేస్తున్నాయి. ఇప్పుడు మారుతి కార్లలో అతి ముఖ్యమైన అంశం మైలేజ్. మారుతి గోప్యంగా ఉంచిన 2017 స్విఫ్ట్ డిజైర్‌ మైలేజ్ వివరాలు లీకయ్యాయి.

2017 స్విఫ్ట్ డిజైర్ మైలేజ్ వివరాలు లీక్

మునుపటి మోడళ్లతో పోల్చుకుంటే భారీగా మైలేజ్ పెరింగిందనే వార్తలు ఇంటర్నెట్లో గుప్పుమంటున్నాయి, ఈ అప్‌కమింగ్ స్విప్ట్ డిజైర్ మైలేజ్, డిజైన్ మరియు పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి...

2017 స్విఫ్ట్ డిజైర్ మైలేజ్ వివరాలు లీక్

విడుదలకు ముందే, కార్లు డీలర్ల వద్దకు చేరడానికి ముందే... మారుతి డీలర్లు స్విఫ్ట్ డిజైర్ మీద ముందస్తు బుకింగ్స్ ప్రారంభించారు. ఎంచుకోదగ్గ డీలర్ల వద్ద రూ, 11,000ల బుకింగ్ మొత్తంతో కారును బుక్ చేసుకోవచ్చు.

2017 స్విఫ్ట్ డిజైర్ మైలేజ్ వివరాలు లీక్

స్విఫ్ట్ డిజైర్ విషయంలో లీక్ అనే అంశం డిజైన్ నుండే మొదలైంది. భారత్ మొత్తం ఆశ్చర్యపోయే విధంగా స్విఫ్ట్ డిజైర్‌ బ్రాండ్ ఇమే‌జ్ పెంచుతూ తర్వాత తరం స్విఫ్ట్ డిజైర్‌ డిజైన్‌లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.

2017 స్విఫ్ట్ డిజైర్ మైలేజ్ వివరాలు లీక్

ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ సంభందిత డిజైన్ అంశాలు మే 16, 2017 న పూర్తి స్థాయిలో విడుదల కానుంది. అదే రోజున మారుతి ఈ 2017 స్విఫ్ట్ డిజైర్‌ను విడుదల చేయనుంది.

2017 స్విఫ్ట్ డిజైర్ మైలేజ్ వివరాలు లీక్

మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ డిజైర్‌కు చెందిన అతి ముఖ్యమైన డిజైన్ అంశాలను వెల్లడిస్తుందా...? లేదా మారుతి మే 16 దీనిని విడుదల చేస్తుందా అనే విశయం గురించి మారుతి నుండి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

2017 స్విఫ్ట్ డిజైర్ మైలేజ్ వివరాలు లీక్

డిజైన్ మరియు 2017 స్విఫ్ట్ డిజైర్‌కు చెందిన రహస్య విషయాలను అటుంచితే, ఇండియన్ మార్కెట్ షాక్‌కు గురయ్యే డిజైన్ వివరాలు లీకయ్యాయి.

2017 స్విఫ్ట్ డిజైర్ మైలేజ్ వివరాలు లీక్

తాజా రిపోర్ట్ ప్రకారం, భారత దేశపు అధిక మైలేజ్ ఇవ్వగల కారుగా 2017 స్విఫ్ట్ డిజైర్ మొదటి స్థానంలో నిలవనుంది.

2017 స్విఫ్ట్ డిజైర్ మైలేజ్ వివరాలు లీక్

సరికొత్త 2017 స్విఫ్ట్ డిజైర్ డీజల్ వేరియంట్ లీటర్‌కు 28.40 కిలోమీటర్ల ఇస్తుందనే గ్యారంటీ మారుతి ఇవ్వనుంది.

2017 స్విఫ్ట్ డిజైర్ మైలేజ్ వివరాలు లీక్

డీజల్ తరహాలో మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ డిజైర్ లోని పెట్రోల్ వేరియంట్ గరిష్టంగా లీటర్‌కు 22 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనుంది.

2017 స్విఫ్ట్ డిజైర్ మైలేజ్ వివరాలు లీక్

ఎంట్రీ లెవల్ కార్ల తరహాలో భారీ విక్రయాలు సాధిస్తున్న స్విఫ్ట్ డిజైర్ ఇండియన్ మార్కెట్లోకి 2008లో తొలిసారిగా పరిచయం చేశారు.

2017 స్విఫ్ట్ డిజైర్ మైలేజ్ వివరాలు లీక్

2012లో డిజైనింగ్ నిపుణులు దీని పొడవును తగ్గించి సబ్-ఫోర్ మీటర్ కాంపాక్ట్ సెడాన్‍‌గా అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పటి వరకు మారుతి సుజుకి 13 లక్షల యూనిట్లను విక్రయించింది.

2017 స్విఫ్ట్ డిజైర్ మైలేజ్ వివరాలు లీక్

ఇవాళ్టి కథనంలో 2017 స్విఫ్ట్ డిజైర్‌లో మారుతి అందిస్తున్న నూతన ఫీచర్లను తెలుసుకుందాం రండి.... సరికొత్త డిజైర్ మునుపటి డిజైర్‌తో పోల్చుకుంటే 40ఎమ్ఎమ్ వెడల్పు మరియు 20ఎమ్ఎమ్ పొడవైన వీల్ బేస్ కలిగి ఉంది.

2017 స్విఫ్ట్ డిజైర్ మైలేజ్ వివరాలు లీక్

స్విఫ్ట్ డిజైర్ బ్రాండ్ పేరుకు మరింత బలాన్ని చేకూర్చే విధంగా ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ ఊహించని రీతిలో కారులోని అన్ని భాగాలు మార్పుకు గురయ్యాయి. కొలతల నుండి ప్రాథమిక విడి భాగాల వరకు అప్ కమింగ్ స్విఫ్ట్ డిజైర్‌లో గుర్తించవచ్చు.

2017 స్విఫ్ట్ డిజైర్ మైలేజ్ వివరాలు లీక్

ఫ్రంట్ డిజైన్‌లో ప్రధానంగా గుర్తించదగినది ఫ్రంట్ గ్రిల్. ఫోర్డ్ మోటార్స్ తమ ఉత్పత్తుల్లో ఇలాంటి ఫ్రంట్ గ్రిల్ అందిస్తుంది. మారుతి సుజుకి మొదటి సారిగా ఇలాంటి విభిన్నమైన గ్రిల్‌ను డిజైర్ ద్వారా పరిచయం చేస్తోంది.

2017 స్విఫ్ట్ డిజైర్ మైలేజ్ వివరాలు లీక్

ఫ్రంట్ గ్రిల్ మధ్యలో అడ్డంగా ఉన్న పొడవాటి క్రోమ్ గీతలున్నాయి. వాటికి మధ్యలో సుజుకి లోగో అందివ్వడం జరిగింది. ముందువైపు ఉన్న విశాలమైన ఆకృతిలో స్వెఫ్ట్ బ్యాక్ హెడ్ లైట్లు మరియు పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు ఉన్నాయి.

2017 స్విఫ్ట్ డిజైర్ మైలేజ్ వివరాలు లీక్

ప్రీమియమ్ కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్‌ను సొంతం చేసుకోనున్న ఇందులో క్రోమ్ సొబగులకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ క్రోమ్ తొడుగులున్న గొట్టాలు కూడా ఉన్నాయి.

2017 స్విఫ్ట్ డిజైర్ మైలేజ్ వివరాలు లీక్

2017 స్విఫ్ట్ డిజైర్ రియర్ డిజైన్ గమనిస్తే, అద్బుతమైన పొడవు మరియు వెడల్పును గమనించవచ్చు. సియాజ్ సెడాన్ కారులోని రియర్ డిజైన్ ఆధారంగా స్విఫ్ట్ డిజైర్ రియర్ డిజైన్ తీర్చిదిద్దడం జరిగింది.

2017 స్విఫ్ట్ డిజైర్ మైలేజ్ వివరాలు లీక్

వెనుక వైపు డిజైన్‌కు మారుతి అధిక ప్రాధాన్యతనిచ్చిందని చెప్పాలి. పెద్ద పరిమాణంలో ఉన్న టైయిల్ లైట్లు కలవు, ఈ రెండింటిని కలుపుతూ డిక్కీ మీదుగా క్రోమ్ పట్టీని అందివ్వడం జరిగింది.

2017 స్విఫ్ట్ డిజైర్ మైలేజ్ వివరాలు లీక్

మారుతి సుజుకి ఈ నూతన స్విఫ్ట్ డిజైర్‌లో తమ మునుపటి 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న కె-సిరీస్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ సామర్థ్యం ఉన్న డిడిఐఎస్ డీజల్ ఇంజన్ వేరియంట్లను అందిస్తోంది.

2017 స్విఫ్ట్ డిజైర్ మైలేజ్ వివరాలు లీక్

ప్రస్తుతం ఉన్న మారుతి డిజైర్ పెట్రోల్ వేరియంట్ బరువు 965 కిలోలు మరియు డీజల్ వేరియంట్ బరువు 1070 కిలోలుగా ఉన్నాయి.

2017 స్విఫ్ట్ డిజైర్ మైలేజ్ వివరాలు లీక్

మారుతి సుజుకి తక్కువ బరువుతో కార్లను నిర్మించేందుకు హార్టెక్ (HEARTECT) వేదిక అభివృద్ది చేసింది. ఈ వేదిక మీద అభివృద్ది చేసిన బాలెనో పెట్రోల్ వేరియంట్ బరువు 890కిలోలు మరియు 985కిలోలుగా ఉంది.

2017 స్విఫ్ట్ డిజైర్ మైలేజ్ వివరాలు లీక్

HEARTECT వేదిక ఆధారంగా మారుతి సరికొత్త 2017 స్విఫ్ట్ డిజైర్‌ను అభివృద్ది చేసింది. కాబట్టి మునుపటి మోడళ్ల కన్నా ఈ నూతన పెట్రోల్ వేరియంట్ 85కిలోలు మరియు డీజల్ వేరియంట్ 105కిలోలు తక్కువ బరువుతో తయారయ్యాయి.

2017 స్విఫ్ట్ డిజైర్ మైలేజ్ వివరాలు లీక్

ప్రస్తుతం ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అన్ని కార్లలో ప్రధానమైపోయింది. బాలెనో మరియు వితారా బ్రిజాలలో ఉన్న 7-అంగుళాల పరిమాణం ఉన్న తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది.

2017 స్విఫ్ట్ డిజైర్ మైలేజ్ వివరాలు లీక్

ఇందులో అందించిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు మిర్రర్ లింక్ వంటి అప్లికేషన్లను సపోర్ట్ చేస్తుంది.

2017 స్విఫ్ట్ డిజైర్ మైలేజ్ వివరాలు లీక్

2017 స్విఫ్ట్ డిజైర్‌ ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్, అత్యుత్తమ స్టోరేజ్ స్పేస్ మరియు వెనుక సీట్లలో కూర్చున్న ప్యాసింజర్ల కోసం ఏ/సి వెంట్‌లు వంటి ఫీచర్లతో రానుంది.

2017 స్విఫ్ట్ డిజైర్ మైలేజ్ వివరాలు లీక్

భద్రత పరంగా మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ డిజైర్‌లోని అన్ని వేరియంట్లు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులతో స్టాండర్డ్‌గా అందివ్వనుంది.

2017 స్విఫ్ట్ డిజైర్ మైలేజ్ వివరాలు లీక్

అంతే కాకుండా ఇందులో యాంటిలాక్ బ్రేక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ మరియు సీట్ బెట్ ప్రి-టెన్షనర్లు వంటి ఫీచర్లను తప్పనిసరిగా అందివ్వనుంది.

2017 స్విఫ్ట్ డిజైర్ మైలేజ్ వివరాలు లీక్

మారుతి సుజుకి తమ 2017 స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ ధరలను మే 16, 2017 న వెల్లడించనుంది.

2017 స్విఫ్ట్ డిజైర్ మైలేజ్ వివరాలు లీక్

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న స్విఫ్ట్ డిజైర్ పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 5.35 లక్షలుగా ఉంది.

2017 స్విఫ్ట్ డిజైర్ మైలేజ్ వివరాలు లీక్

డీజల్ వేరియంట్ స్విఫ్ట్ డిజైర్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 6.16 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులో ఉంది.

2017 స్విఫ్ట్ డిజైర్ మైలేజ్ వివరాలు లీక్

2017 స్విఫ్ట్ డిజైర్ పెట్రోల్ అంచనాగా రూ. 5.40 లక్షలు మరియు డీజల్ వేరియంట్ రూ. 6.20 లక్షల ప్రారంభ ధరలతో విడుదలయ్యే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Read In Telugu New Maruti Dzire Mileage Figures Leaked
Story first published: Friday, May 5, 2017, 18:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X