TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
అన్ని కార్ల మీద మూడు నుండి ఐదేళ్లకు పొడగించిన వారంటీ: మారుతి సుజుకి
భారతదేశపు అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సరికొత్త వారంటీ ప్లాన్లను పరిచయం చేసింది. ఈ వారంటీ ఆఫర్లు మారుతి లైనప్‌లోని రెగ్యులర్ మరియు నెక్సా షోరూమ్‌లలో లభించే అన్ని మోడళ్లకు వర్తిస్తాయి.
ప్రస్తుతం మారుతి సుజుకి విక్రయించే అన్ని కార్లకు రెండేళ్లు లేదా 40,000 కిలోమీటర్ల తప్పనిసరి వారంటీ వర్తిస్తోంది. అయితే, ఇక మీదట మీరు ఎంచుకునే ప్లాన్ ప్రకార ఈ వారంటీ పెరగనుంది.
మారుతి సుజుకి పొడగించబడిన వారంటీ ప్లాన్స్
గోల్డ్: మూడేళ్లు లేదా 60,000 కిలోమీటర్లు
ప్లాటినమ్: మూడవ మరియు నాలుగవ సంవత్సరం లేదా 80,000 కిలోమీటర్లు
రాయల్ ప్లాటినమ్: మూడు, నాలుగు మరియు ఐదవ సంవత్సరం లేదా 1,00,000 కిలోమీటర్లు
కొనసాగించబడిన వారంటీ ప్లాన్ క్రింద మారుతి సుజుకి కస్టమర్లు తమ కార్లలో హై-ప్రెజర్ పంప్, కంప్రెసర్, ఇసిఎమ్, టర్బోఛార్జర్ అసెంబ్లీ, ఎంచుకోదగిన ఇంజన్ పార్ట్స్, స్టీరింగ్ వీల్, సస్పెన్షన్ విడిభాగాలు మరియు ఇతర పార్ట్స్‌ను మార్చుకోవచ్చు.
ఈ పొడగించబడిన వారంటీ క్రింద ఏయే విడి భాగాలకు వారంటీ వర్తిస్తుందో... ఏ భాగాలను మారుస్తారో వంటి వివరాలను మారుతి సుజుకి అరెనా మరియు నెక్సా వెబ్‌సైట్లను సందర్శించి పూర్తి వివరాలు పొందగలరు.
పొడగించిన వారంటీ ప్లాన్లు అయిన గోల్డ్, ప్లాటినమ్ మరియు రాయల్ ప్లాటినమ్ ప్యాకేజీలు మారుతి సుజుకి అరెనా మరియు మారుతి సుజుకి నెక్సా షోరూమ్‌లలో విక్రయించే అన్ని కార్ల మీద వర్తిస్తాయి. అయితే నెక్సాలో అమ్ముడయ్యే కార్లలో గోల్డ్ వారంటీ ప్యాకేజీ లభించడం లేదు.
మారుతి సుజుకి నెక్సా షోరూమ్ ద్వారా బాలెనో హ్యాచ్‌బ్యాక్, సియాజ్ సెడాన్, ఇగ్నిస్ హ్యాచ్‌బ్యాక్ మరియు ఎస్-క్రాస్ క్రాసోవర్ కార్లను విక్రయిస్తోంది. మిగతా అన్ని కార్లను మారుతి వారి రెగ్యులర్ షోరూమ్‌లైన మారుతి సుజుకి అరెనా విక్రయ కేంద్రాలలో లభిస్తున్నాయి.
Trending On DriveSpark Telugu:
సుజుకి నుండి వస్తున్న 150సీసీ బైక్ ఇదే... మరిన్ని ఫోటోలు మరియు కంప్లీట్ డిటైల్స్
డిసెంబర్ 1 నుండి అన్ని ఫోర్ వీలర్లకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి
వెహికల్ సెఫ్టీలో కేంద్రం మరో ముందడగు: మరింత సురక్షితమవుతున్న ఇండియన్ కార్లు