సరికొత్త 2017 స్విఫ్ట్ డిజైర్ లోని వి ట్రిమ్ వేరియంట్ వివరాలు...

Written By:

మారుతి సుజుకి అతి త్వరలో తమ మూడవ తరానికి చెందిన 2017 స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ కారును విడుదల చేయడానికి సిద్దం అయ్యింది. ఈ తరుణంలో స్విఫ్ట్ డిజైర్‌లోని నూతన వి ట్రిమ్ వేరియంట్ డీలర్ల వద్దకు చేరింది. దీని గురించి మరిన్ని వివరాలు...

To Follow DriveSpark On Facebook, Click The Like Button
మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ డిజైర్ వి ట్రిమ్

భారత దేశపు అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ కారును మే 16, 2017 న మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నద్దం అవుతోంది.

మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ డిజైర్ వి ట్రిమ్

ఇప్పటికే తొలి విడతగా 2017 న్యూ మోడల్ స్విఫ్ట్ డిజైర్ కార్లను డీలర్ల వద్దకు చేర్చేసింది. అయితే వీటిలో వి ట్రిమ్ అనే వేరియంట్ మీడియా కంటపడింది. విడిఐ మరియు విఎక్స్ఐ ట్రిమ్ శ్రేణిలో ఇది మధ్య స్థాయి వేరియంట్ అని తెలిసింది.

మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ డిజైర్ వి ట్రిమ్

మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ డిజైర్ వి వేరియంట్లోని ఫ్రంట్ డిజైన్‌లోని ఫ్రంట్ గ్రిల్ మరియు ఫాగ్ ల్యాంప్స్‌కు చుట్టూ క్రోమ్ సొబగులు అందివ్వడం జరిగింది.

మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ డిజైర్ వి ట్రిమ్

బాడీకి అందించిన పెయింట్‌నే కారు యొక్క అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్ మీద అందించారు. టెయిల్ లైట్ల అమరికలో ఎల్ఇడి పైలట్ లైట్లను గుర్తించవచ్చు.

మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ డిజైర్ వి ట్రిమ్

2017 స్విఫ్ట్ డిజైర్ లోని వి వేరియంట్లో రియర్ పార్కింగ్ సెన్సార్లు లేవు,ఎల్ఇడి హెడ్ లైట్లు మరియు పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లను టాప్ రేంజ్ వేరియంట్లో అందివ్వడం జరిగింది.

మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ డిజైర్ వి ట్రిమ్

2017 స్విఫ్ట్ డిజైర్ విడిఐ మరియు విఎక్స్ఐ లలో బ్లూటూత్ సపోర్ట్ గల 2-డిఐఎన్ ఆడియో సిస్టమ్, రియర్ ఎ/సి వెంట్స్, మ్యాన్యువల్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ ఆధారిత కంట్రోల్స్ మరియు ఎలక్ట్రిక్ ద్వారా అడ్జెస్టు చేసుకునే సదుపాయం ఉన్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్లు కలవు.

మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ డిజైర్ వి ట్రిమ్

సరికొత్త 2017 స్విఫ్ట్ డిజైర్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంధన వేరియంట్లు గల 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ డిజైర్ వి ట్రిమ్

అన్ని వేరియంట్లలో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అదే విధంగా వి మరియు అంతకన్నా ఎక్కువ రేంజ్‌లో ఉన్న వేరియంట్లలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌లను మారుతి సుజుకి ఆఫర్ చేస్తోంది.

మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ డిజైర్ వి ట్రిమ్

ఈ నూతన మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ డిజైర్ సుమారుగా రూ. 5.35 లక్షల నుండి 8.57 లక్షలు ఎక్స్-షోరూమ్ ధరల శ్రేణిలో విడుదలయ్యే అవకాశం ఉంది.

మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ డిజైర్ వి ట్రిమ్

ప్రస్తుతం విపణిలో ఉన్న హ్యుందాయ్ ఎక్సెంట్, టాటా టిగోర్, ఫోర్డ్ ఆస్పైర్, హోండా ఆమేజ్ మరియు వోక్స్‌వ్యాగన్ అమియో వంటి కాంపాక్ట్ సెడాన్ కార్లకు గట్టి పోటీనివ్వనుంది.

English summary
Read In Telugu 2017 Maruti Suzuki Dzire V Trim Spotted At Dealership
Story first published: Saturday, May 13, 2017, 11:26 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark