2018 మారుతి స్విఫ్ట్ లాంచ్ మరియు ప్రొడక్షన్ వివరాలు

Written By:

మారుతి సుజుకి భారీ అంచనాలతో విడుదలకు సిద్దం చేసిన తరువాత తరం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ఆవిష్కరణకు సిద్దమైంది.

2018 మారుతి స్విఫ్ట్

తాజాగా అందిన రిపోర్ట్స్ ప్రకారం, మారుతి సుజుకి తమ నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును డిసెంబర్ 1, 2017 నుండి ఉత్పత్తి చేయనుంది. గుజరాత్‌లోని మారుతి ప్రొడక్షన్ ప్లాంటులో తయారీ చేయనుంది.

Recommended Video - Watch Now!
[Telugu] Tata Nexon Review: Specs
2018 మారుతి స్విఫ్ట్

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతి స్విఫ్ట్ హర్యాణాలోని మానేసర్ ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి అవుతోంది. ఈ ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 2,50,000 యూనిట్లుగా ఉంది. మారుతి సుజుకి స్విఫ్ట్ ప్రొడక్షన్‌ను హర్యాణా ప్లాంటు నుండి బాలెనో కార్లు ఉత్పత్తి చేస్తున్న గుజరాత్ ప్లాంటుకు మార్చాలని నిర్ణయించుకుంది.

2018 మారుతి స్విఫ్ట్

ఇటీవల విడుదలైన సరికొత్త మారుతి డిజైర్‌కు భారీ డిమాండ్ లభిస్తోంది. విడుదలైన కేవలం ఐదు నెలలలోపే లక్ష యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. ఈ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ మీద వెయిటింగ్ పీరియడ్ మూడు నుండి నాలుగు నెలల పాటు ఉంది. కొత్త తరం స్విఫ్ట్ విడుదలైతే ఇదే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది.

2018 మారుతి స్విఫ్ట్

మారుతి సుజుకి ఈ ఏడాది ప్రారంభంలో గుజరాత్ ప్లాంటులో ప్రొడక్షన్ ప్రారంభించింది. రెండవ ప్లాంటు నుండి ప్రొడక్షన్‌ను 2018 లేదా 2019 నుండి ప్రారంభం కానుంది. ఈ నూతన ప్లాంటు యొక్క వార్షిక ఉత్పత్తి సామర్థ్యం మరో 2,50,000 యూనిట్లుగా ఉండనుంది.

2018 మారుతి స్విఫ్ట్

మారుతి సుజుకి పాత స్విఫ్ట్ డిజైన్‌నే పోలి ఉన్నప్పటికీ భారీ మార్పులకు గురయ్యింది. నూతన స్విఫ్ట్ ఫ్రంట్ మరియు రియర్ డిజైన్‌ పూర్తిగా మారిపోయింది. స్విఫ్ట్ మోడల్‌ను అప్‌డేటెడ్ లుక్‌లో అందించేందుకు కారు మొత్తాన్ని ఫ్యూచరిస్టిక్ డిజైన్ లక్షణాలతో రూపొందించారు.

Trending On DriveSpark Telugu:

ఫలించిన ఎనిమేదళ్ల నిరీక్షణ: చేసిన తప్పుకు కస్టమర్‌కు పరిహారం చెల్లించిన మారుతి

కార్ వాష్ చేసి, సర్వీస్ మొత్తం చేసినట్లు మోసగించిన మారుతి సుజుకి

కనీవిని ఎరుగుని సేల్స్: మారుతికి ముచ్చెమటలు పట్టిస్తున్న డిజైర్

2018 మారుతి స్విఫ్ట్

సాంకేతికంగా నూతన స్విఫ్ట్‌లో 1.2-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ మరియు 1.3-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్‌తో రానుంది. రెండు ఇంజన్‌లు కూడా మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో లభించనున్నాయి.

2018 మారుతి స్విఫ్ట్

ప్రస్తుతం ఉన్న న్యూ డిజైన్ ఇంటీరియర్‌ తరహాలో స్విఫ్ట్ ఇంటీరియర్‌లో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అధునాతన ఫీచర్లు మరియు ప్రీమియమ్ ఫీల్ కలిగించే అప్‌హోల్‌స్ట్రే అందివ్వనుంది.

2018 మారుతి స్విఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లో నూతన స్విఫ్ట్ ఎంతగానో ఎదురు చూస్తున్న మోడల్ అని చెప్పవచ్చు. కొత్త తరం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉంది. నూతన స్విఫ్ట్ తన వారసత్వ గౌరవాన్ని యథావిధిగా కొనసాగించనుంది. 2018 నుండి స్విఫ్ట్ మారుతికి మరో పెద్ద సాధించిపెట్టనుంది. ప్రస్తుతం ఉన్న హ్యాచ్‌బ్యాక్ కార్లతో పోల్చుకుంటే నూతన స్విఫ్ట్ ఎంపిక ఎంతో ఉత్తమం అని చెప్పవచ్చు.

English summary
Read In Telugu: New Maruti Swift India Launch In 2018; Production Starts From December

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark