స్విఫ్ట్ లాంచ్ డేట్స్ ప్రకటించిన మారుతి

స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను నెక్ట్స్ జనరేషన్ వెర్షన్‌లో 2018 ప్రారంభంలో విడుదలకు మారుతి సన్నాహాలు ప్రారంభించింది.

By Anil

భారతదేశపు దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ పాత డిజైర్‌ను కొత్త తరం డిజైర్‌ వెర్షన్‌లో విడుదల చేసి భారీ సక్సెస్ అందుకుంది. అయితే, స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను నెక్ట్స్ జనరేషన్ వెర్షన్‌లో 2018 ప్రారంభంలో విడుదలకు మారుతి సన్నాహాలు ప్రారంభించింది.

మారుతి స్విఫ్ట్

మారుతి సరికొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేయడానికి ముందే, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ఆవిష్కరించనుంది. ఇప్పుడు ఇండియా మొత్తం ఎదురుచూస్తున్న కారు మారుతి స్విఫ్ట్.

Recommended Video

Mahindra KUV100 NXT Launched In India | In Telugu - DriveSpark తెలుగు
మారుతి స్విఫ్ట్

తరువాత తరం స్విఫ్ట్ జనరేషన్ హ్యాచ్‌బ్యాక్‌ను డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌ను అభివృద్ది చేసిన నూతన హార్టెక్‌ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించారు. సరికొత్త ఫ్లాట్‌ఫామ్ మీద తక్కువ బరువుతో ఎక్కువ ధృడమైన స్టీల్‌తో స్విఫ్ట్‌ను అభివృద్ది చేశారు. దీంతో మునుపటి స్విఫ్ట్‌తో పోల్చితే దీని బరువు 50కిలోల వరకు తక్కువగా ఉంది.

మారుతి స్విఫ్ట్

బరువు తగ్గడంతో నూతన స్విఫ్ట్ త్వరితంగా స్పందించడే కాకుండా, ఇంధన సామర్థ్యం కూడా ఎక్కువగా కలిగి ఉంది. డిజైన్ పరంగా చూస్తే స్విఫ్ట్ ఓల్డ్‌ వెర్షన్‌నే పోలి ఉంటుంది. అయితే అన్ని యాంగిల్స్‌లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.

మారుతి స్విఫ్ట్

ఇండియాలో విడుదల కానున్న తరువాత తరం స్విఫ్ట్‌లో సాంకేతికంగా 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్‌లతో రానున్నాయి. ఇవి వరుసగా 82బిహెచ్‌పి పవర్ మరియు 75బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తాయి.

Trending On DriveSpark Telugu:

ఇక మీదట 100సీసీ టూ వీలర్ మీద డబుల్ రైడింగ్ బ్యాన్

కొత్త కారును సర్వీసింగ్ కోసం ఇస్తే, కార్ వాష్ చేసి పంపేసిన షోరూమ్ నిర్వాహకులు: మారుతి డీలర్ల నయా మోసం!!

మారుతి స్విఫ్ట్

మారుతి సుజుకి తొలిసారిగా తమ స్విఫ్ట్‌లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పరిచయం చేయనుంది. పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు అన్ని వేరియంట్లలో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‍‌బాక్స్ స్టాండర్డ్‌గా రానుంది.

మారుతి స్విఫ్ట్

నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఇంటీరియర్ మొత్తం స్పోర్టివ్ శైలిలో రానుంది. సరికొత్త స్టీరింగ్ వీల్, ట్విన్ పోడ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఆపిల్ కార్ ప్లే సపోర్ట్ చేయగల టచ్ స్కీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ వంటివి రానున్నాయి.

మారుతి స్విఫ్ట్

ఎక్ట్సీరియర్ చూడటానికి స్లిమ్ముగా కనిపించినా, విశాలమైన క్యాబిన్ స్పేస్ మరియు అధిక బూట్ స్పేస్ ఇందులో సాధ్యమయ్యింది. హ్యాచ్‌‌బ్యాక్ సెగ్మెంట్లో పోటీ ఉన్నప్పటికీ పాత తరం స్విఫ్ట్ కారే నెట్టుకొస్తోంది. అయితే, కొత్త తరం స్విఫ్ట్ పూర్తి స్థాయిలో విడుదలైతే పోటీని ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదు.

మారుతి స్విఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

యావత్ భారతదేశం మొత్తం ఎదురుచూస్తున్న కారు ఏదైనా ఉందంటే అది మారుతి స్విఫ్ట్ కారే!! నిజమే, మారుతి తమ పాత డిజైర్‍‌ను కొత్త వెర్షన్‌లో లాంచ్ చేయడంతో భారీ విక్రయాల దిశగా దూసుకెళ్తోంది. కాబట్టి భారతదేశపు బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కారుగా పేరుగాంచిన స్విఫ్ట్ న్యూ వెర్షన్‌లో విడుదలైతే స్విఫ్ట్ ప్రేమికులకు పండుగే...

సరికొత్త స్విఫ్ట్ మార్కెట్లో ఉన్న బాలెనో క్రింది స్థానాన్ని భర్తీ చేయనుంది. ఇది హ్యుందాయ్ ఎలైట్ ఐ20, వోక్స్‌వ్యాగన్ పోలో మరియు ఫోర్డ్ ఫిగో కార్లకు గట్టి పోటీనివ్వనుంది.

34 లక్షల విలువైన విజయ్ మాల్యా లగ్జరీ కార్లు రూ. 1.4 లక్షలకే!

పాక్-చైనా దుందుడుకు చర్యలకు ముగింపు ఖాయం!

లారీల వెనుక హార్న్ OK ప్లీజ్ వ్రాయడం వెనకున్న ఆంతర్యం ఏమిటి?

Most Read Articles

English summary
Read In Telugu: New Maruti Swift India Launch Details Revealed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X