సరికొత్త మిత్సుబిషి పజేరో స్పోర్ట్ విడుదల వివరాలు

Written By:

జపాన్‌ దిగ్గజం మిత్సుబిషి తమ సరికొత్త పజేరో స్పోర్ట్ ఎస్‌యూవీని విడుదలకు సిద్దం చేస్తునట్లు రిపోర్ట్ చెపుతున్నాయి. వచ్చే ఏడాది వేసవి కాలంలో దీని విడుదల ఉంటుందని తెలుస్తోంది.

మిత్సుబిషి పజేరో స్పోర్ట్ ఇండియా విడుదల

అంతర్జాతీయ మార్కెట్లలో క్యుఎక్స్ మరియు క్యుఇ పేరుతో ఉన్న దీనిని ల్యాడర్ ఫ్రేమ్ ఛాసిస్ మరియు ట్రిటాన్ పికప్ ట్రక్కు ఆధారంగా రూపొందించడం జరిగింది. ముందువైపు నుంచే ఫంకీ లుక్‌లో ఉన్న ఇది కండలు తిరిగిన రూపాన్ని కలిగి ఉంది.

మిత్సుబిషి పజేరో స్పోర్ట్ ఇండియా విడుదల

మిత్సుబిషి పజేరో స్పోర్ట్ ఎస్‌యూవీ అత్యధిక ఎత్తులో ఉన్న బానెట్ కలిగి ఉంది. డైనమిక్ షీల్డ్ అనే పేరుతో పిలువబడే క్రోమ్ బ్యాండ్ ఫ్రంట్ గ్రిల్ రేడియర్ ముందు అందివ్వడం జరిగింది. లోతు ఎక్కువగా ఉన్న నీటిలో ప్రయాణిస్తున్నపుడు అద్దం మీదకు నీరు చిమ్మడాన్ని ఈ ఫ్రంట్ గ్రిల్ నివారిస్తుందని మిత్సుబిషి తెలిపింది.

మిత్సుబిషి పజేరో స్పోర్ట్ ఇండియా విడుదల

ఇండియన్ మార్కెట్లోకి రానున్న పజేరో స్పోర్ట్ ఎస్‌యూవీలో 2.4-లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల MIVEC టుర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 181బిహెచ్‌పి పవర్ మరియు 430ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

మిత్సుబిషి పజేరో స్పోర్ట్ ఇండియా విడుదల

మిత్సుబిషి తమ పజేరో స్పోర్ట్ ఎస్‌యూవీలో అప్‌డేటెడ్ సూపర్ సెలెక్ట్ ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్ అందించింది. అదే విధంగా ఇంటీరియర్‌లో పెద్ద పరిమాణంలో ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఇతర కనెక్టివిటి ఆప్షన్లను పరిచయం చేసింది.

మిత్సుబిషి పజేరో స్పోర్ట్ ఇండియా విడుదల

మిత్సుబిషి పజేరో స్పోర్ట్ విపణిలోకి పూర్తి స్థాయిలో విడుదలైతే, ప్రస్తుతం ఉన్న టయోటా ఫార్చ్యూనర్ మరియు ఫోర్డ్ ఎండీవర్ లకు గట్టిపోటీనివ్వనుంది. ప్రస్తుతం పజేరో మోడళ్లతో పోల్చుకుంటే దీని ధర ఎక్కువగానే ఉండనుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ ప్రీమియమ్ ఎస్‌యూవీ మార్కెట్లో రాణించేందుకు సాయశక్తులా ప్రయణిస్తోంది. అయితే, పజేరో స్పోర్ట్ ఎస్‌యూవీ ఎండీవర్ మరియు ఫార్చ్యూనర్ లను ఎదుర్కోవడం దాని ధర మీద ఆధారపడి ఉంది.

English summary
Read In Telugu New Mitsubishi Pajero Sport India Launch Details Revealed
Story first published: Saturday, June 24, 2017, 17:44 [IST]
Please Wait while comments are loading...

Latest Photos