సింగల్ ఛార్జింగ్‌తో 547కిమీలు నడిచే కారు: సెప్టెంబర్‌లో ఆవిష్కరించనున్న నిస్సాన్

Written By:

జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం తమ లీఫ్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారును అతి త్వరలో ఆవిష్కరించనుంది. అయితే, ఆవిష్కరణకు ముందే ఈ లీఫ్ ఎలక్ట్రిక్ కారు ఫోటోలు లీకయ్యాయి.

నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ కారు రహస్య ఫోటోలు జపాన్‌లోని నిస్సాన్ ఒప్పామా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంటులో తీసినవి. ఇంటర్నెట్లో సందడి చేస్తున్న ఈ ఫోటోలలోని లీఫ్ డిజైన్‍‌ను పరిశీలిస్తే కేవలం ఎక్ట్సీరియర్ మాత్రమే గుర్తించగలం.

నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ కారు

రెండవ తరానికి చెందిన ఈ లీఫ్ ఎలక్ట్రిక్ కారును మరింత ఏరోడైనమిక్ డిజైన్ లక్షణాలతో రూపొందించడం జరిగింది. దీంతో సింగల్ ఛార్జింగ్‌తో గరిష్టంగా 547కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని నిస్సాన్ పేర్కొంది.

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ కారు

టెస్లా కంపెనీ తరహాలో నిస్సాన్ తమ లీఫ్ కారులో విభిన్న బ్యాటరీ ఆప్షన్స్ అందిస్తోంది. అదే విధంగా కొత్త అభివృద్ది చేసిన బ్యాటరీలను కూడా ఎంచుకోవచ్చు.

నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ కారు

నిస్సాన్ సెకండ్ జనరేషన్ లీఫ్ ఎలక్ట్రిక్ కారులో నిస్సాన్ వారి ప్రొ పైలట్ పార్క్ టెక్నాలజీ కలదు. ఈ టెక్నాలజీ కెమెరాలు మరియు సెన్సార్ల ద్వారా యాక్సిలరేటర్, బ్రేక్ మరియు స్టీరింగ్‌లను నియంత్రిస్తూ తనంతట తానుగా కారును పార్క్ చేస్తుంది. నిస్సాన్ వారి సింగల్ లేన్ సెమి-అటానమస్ ఫీచర్‌లో భాగంగా ఈ ఫీచర్ అందిస్తున్నారు.

నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ కారు

త్వరలో విడుదల కానున్న లీఫ్ ఎలక్ట్రిక్ కారు నిస్సాన్ వారి అత్యాధునిక అటానమస్ కారు. మరియు నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా లీఫ్ ఎలక్ట్రిక్ కారును డిజైన్ చేశారు.

నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ కారు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సరికొత్త లీఫ్ ఎలక్ట్రిక్ కారు సెప్టెంబర్ 6, 2017 న ప్రదర్శనకు రానుంది. 2018 నాటికి నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ కార్లు రోడ్డెక్కనున్నాయి. 2020 నాటికి 20 శాతం ఎలక్ట్రిక్ కార్లను విక్రయించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది.

English summary
Read In Telugu: New Nissan Leaf Images Leaked Ahead Of Debut
Story first published: Thursday, August 10, 2017, 11:13 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark