విడుదలకు సిద్దమవుతున్న సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్

Written By:

జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం సుజుకి సరికొత్త స్విఫ్ట్ స్పోర్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును అతి త్వరలో జరగనున్న 2017 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షో వేదిక మీద ఆవిష్కరించనుంది. సెప్టెంబర్ 12, 2017 నుండి ప్రాంక్‌ఫర్ట్ మోటార్ షో ప్రారంభం కానుంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్

ప్రపంచ విపణిలో భారీగా అంచనాలు పెంచుతున్న స్విఫ్ట్ స్పోర్ట్ హ్యాచ్‌బ్యాక్ బ్రోచర్ ఒకటి లీక్ అయ్యింది. బ్రోచర్ ఫోటోలు ఇంటర్నెట్ వేదికగా వైరల్ అవుతున్నాయి. స్విఫ్ట్ సాంకేతిక వివరాల మరియు ధరలు బ్రోచర్ ద్వారా బయటకొచ్చాయి.

Recommended Video
2017 Skoda Octavia RS Launched In India | In Telugu - DriveSpark తెలుగు
సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్

మూడవ తరానికి చెందిన స్విఫ్ట్ స్పోర్ట్ 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో లభించే ఇది 138బిహెచ్‌పి పవర్ మరియు 230ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్

మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో లభించే స్విఫ్ట్ బరువు 970కిలోలు మరియు ఆటోమేటిక్ స్విఫ్ట్ వేరియంట్ బరువు 990కిలోలుగా ఉంది. జెసి08 వారి ఆధ్యర్యంలో జరిగిన మైలేజ్ పరీక్షల్లో స్విఫ్ట్ స్పోర్ట్ మ్యాన్యువల్ వేరియంట్ మైలేజ్ 16.4కిమీ/లీ మరియు స్విఫ్ట్ స్పోర్ట్ ఆటోమేటిక్ మైలేజ్ 16.2కిమీ/లీ.

సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్

స్పోర్టివ్ బాడీ కిట్ ద్వారా థర్డ్ జనరేషన్ స్విఫ్ట్ స్పోర్ట్ ఎక్ట్సీరియర్ విభిన్న స్టైలింగ్ ఎలిమెంట్ల కలిగి ఉంది. స్విఫ్ట్ స్పోర్ట్ ముందు వైపు పెద్ద పరిమణంలో ఉన్న ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేయబడిన బంపర్ కలవు. అయితే, హెడ్ ల్యాంప్ మరియు టెయిల్ ల్యాంప్ డిజైన్‌లో ఎలాంటి మార్పులు లేవు.

సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్

సరికొత్త స్విఫ్ట్ స్పోర్ట్ వెనుక వైపున ఫాక్స్ డిఫ్యూసర్, క్రోమ్ టిప్ గల డ్యూయల్ ఎగ్జాస్ట్ సెటప్ ఉంది. స్విఫ్ట్ ఇంటీరియర్‌లో బకెట్ టైప్ సీట్లు, స్టెయిన్ లెస్ స్టీల్ పెడల్స్, లెథర్ తొడుగు గల స్టీరింగ్ వీల్, డ్యాష్ బోర్డ్ మరియు ఇంస్ట్రుమెంట్ క్లస్టమర్ మీద ఎరుపు రంగు సొబగులు ఉన్నాయి. ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ మొత్తం ఎన్నో స్పోర్టివ్ లక్షణాలను కలిగి ఉంది.

సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

స్విఫ్ట్ రెగ్యులర్ వెర్షన్ మోడల్‌తో పోల్చితే వ్యత్యాసం కనబరిచేందుకు సరికొత్త స్విఫ్ట్ స్పోర్ట్ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్‌లో భారీ మార్పులు చేస్తోంది. మారుతి సుజుకి సరికొత్త స్విఫ్ట్ ను 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ఆవిష్కరించి, అనంతరం విపణిలోకి విడుదల చేయనుంది.

English summary
Read In Telugu: New Suzuki Swift Sport Brochure Leaked; Technical Specifications Revealed
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark