పస్సాట్ విడుదలను ఖాయం చేసిన వోక్స్‌వ్యాగన్

Written By:

జర్మన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ సరికొత్త 2017 పస్సాట్ కారును ఇండియన్ మార్కెట్లోకి విడు్దల చేయడాన్ని అధికారికంగా ప్రకటించింది. గతంలో, కంపెనీ తమ ఔరంగాబాద్‌లోని ప్రొడక్షన్ ప్లాంటులో పస్సాట్ లగ్జరీ సెడాన్ ఉత్పత్తిని ప్రారంభించింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
వోక్స్‌వ్యాగన్ పస్సాట్

తాజాగా అందిన సమాచారం మేరకు, వోక్స్‌వ్యాగన్ తమ ఎనిమిదవ తరానికి చెందిన పస్సాట్ లగ్జరీ సెడాన్‌ను అక్టోబర్ 10, 2017 న విడుదల చేయనున్నట్లు తెలిసింది. చివరి తరం పస్సాట్ ‌ను వోక్స్‌వ్యాగన్ 2014లో డిస్కంటిన్యూ చేసింది.

వోక్స్‌వ్యాగన్ పస్సాట్

వోక్స్‌వ్యాగన్ వారి నూతన ఎమ్‌క్యూబి ఫ్లెక్సిబుల్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా తమ సెడాన్‌గా పస్సాట్‌ను అభివృద్ది చేసింది. ఇదే ఫ్లాట్‌ఫామ్ మీద టిగువాన్ ఎస్‌యూవీ, స్కోడా ఆక్టావియా, కొడియాక్ మరియు సూపర్బ్ కార్లను కూడా అభివృద్ది చేశారు. లగ్జరీ సెడాన్‌ను పస్సాట్ సరికొత్త నిర్వచనాన్ని తీసుకురానుంది.

వోక్స్‌వ్యాగన్ పస్సాట్

వోక్స్‌వ్యాగన్ పస్సాట్‌లో సరికొత్త పగటిపూట వెలిగే ఎల్ఇడి లైట్లు, హెడ్ లైట్లు, ఫాగ్ ల్యాంప్స్, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్, కండలు తిరిగిన ఆకృతిలో ఉన్న ముందు మరియు వెనుక వైపు బంపర్లు ఉన్నాయి. వీటితో పాటు, ఎగ్జాస్ట్ పైపు అంచు మరియు విండో అంచుల వద్ద ప్రీమియమ్ ఫీల్ కలిగించే క్రోమ్ పట్టీలు ఉన్నాయి.

Recommended Video
Volkswagen Tiguan Review In Telugu - DriveSpark తెలుగు
వోక్స్‌వ్యాగన్ పస్సాట్

2017 వోక్స్‌వ్యాగన్ పస్సాట్‌లో సాంకేతికంగా 2-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 174బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. మునుపటి పస్సాట్‌తో పోల్చుకుంటే ఇందులో అధిక వీల్ కలదు. దీంతో విశాలమైన క్యాబిన్ స్పేస్ సాధ్యమయ్యింది.

వోక్స్‌వ్యాగన్ పస్సాట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

వోక్స్‌వ్యాగన్ కార్లు ఖరీదైనవే అయినప్పటికీ, వాటికి ఉన్న కస్టమర్లు ఏ మాత్రం తగ్గడం లేదు. 2014లో మార్కెట్‌కు దూరమైన పస్సాట్ ఇప్పుడు 2017 ఎడిషన్‌తో మళ్లీ విడుదలవ్వడానికి సిద్దమవుతోంది. ఇది పూర్తి స్థాయిలో విడుదలైతే స్కోడా సూపర్బ్, టయోటా క్యామ్రీ మరియు హోండా అకార్డ్ వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది. రూ. 30 లక్షల అంచనా ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.

English summary
Read In Telugu: new volkswagen passat india launch date revealed
Story first published: Wednesday, September 27, 2017, 11:25 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark