హ్యుందాయ్ వెర్నా బ్రోచర్ లీక్: ఫీచర్లు మరియు ఇంజన్ వివరాలు వివరంగా

Written By:

హ్యుందాయ్ నుండి అతి త్వరలో విడుదల కానున్న వెర్నా బ్రోచర్ లీక్ అయ్యింది. దక్షిణ కొరియా ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మరియు భారత దేశపు రెండవ బెస్ట్ సెల్లింగ్ కార్ల కంపెనీ హ్యుందాయ్ మోటార్స్ తమ ఐదవ తరానికి చెందిన సరికొత్త వెర్నా కారును విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

జనరేషన్ హ్యుందాయ్ వెర్నా

హ్యుందాయ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లో ఉన్న మిడ్ సైజ్ సెడాన్ సెగ్మెంట్లోకి తమ ఆల్ న్యూ వెర్నా సెడాన్ కారును ఆగష్టు 22, 2017 న విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో వెర్నా బ్రోచర్ రహస్యంగా లీక్ అయ్యింది.

Recommended Video - Watch Now!
2018 Hyundai Verna Indian Model Unveiled | In Telugu - DriveSpark తెలుగు
జనరేషన్ హ్యుందాయ్ వెర్నా

లీకైన బ్రోచర్ ఆధారంగా వెర్నాలోని వేరియంట్లు, ఇంటీరియర్ ఫీచర్లు, భద్రత ఫీచర్లు, ఇంజన్ మరియు ఇతర వివరాల గురించి వివరంగా నేటి కథనంలో...

ఐదవ తరానికి చెందిన హ్యుందాయ్ వెర్నా నాలుగు విభిన్న వేరియంట్లలో లభించనుంది. అవి, ఇ, ఇఎక్స్, ఎస్ఎక్స్ మరియు ఎస్ఎక్స్(ఒ).

జనరేషన్ హ్యుందాయ్ వెర్నా

సరికొత్త వెర్నా ఫ్రంట్ డిజైన్‌లో క్యాస్కేడ్ డిజైన్ క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, పొజిషనింగ్ ల్యాంప్స్, కార్నరింగ్ ల్యాంప్స్ మరియు క్రోమ్ అంచు బార్డర్ ఉన్న ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి.

జనరేషన్ హ్యుందాయ్ వెర్నా

వెర్నా సెడాన్ రియర్ డిజైన్‌లో అధునాతన ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్‌కు చోటు దక్కింది. బాడీ టాప్ చివరిలో షార్క్ ఫిన్ యాంటెన్నా, డిక్కీ మీద క్రోమ్ బెల్ట్ లైన్, క్రోమ్ మెటల్‌తో అందించిన వెర్నా మరియు వేరియంట్ పేరును గుర్తించవచ్చు. నూతన వెర్నాలో 16-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

జనరేషన్ హ్యుందాయ్ వెర్నా

హ్యుందాయ్ వెర్నాలోని టాప్ ఎండ్ వేరియంట్ ఎస్ఎక్స్(ఒ) లో వెటిలేటెడ్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్, జరిపే వీలున్న ఫ్రంట్ సీట్ మరియు వెనుక సీటుకు మధ్యలో ఆర్మ్ రెస్ట్, ముందు మరియు వెనుకవైపు యుఎస్‌బి ఛార్జర్లు, సన్ రూఫ్ మరియు వెనుక సీటు ప్రయాణికులకు ఏ/సి వెంట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

జనరేషన్ హ్యుందాయ్ వెర్నా

ఎస్ఎక్స్(ఒ) మరియు ఎస్ఎక్స్ వేరియంట్స్ ఇంటీరియర్‌లో 7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు, ఇది ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు మిర్రర్ లింక్ అప్లికేషన్లను సపోర్ట్ చేస్తుంది. అయితే వెర్నాలోని ఇఎక్స్ వేరియంట్ అర్కామిస్ సౌండ్ సిస్టమ్ గల 5-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలిగి ఉంది.

జనరేషన్ హ్యుందాయ్ వెర్నా

భద్రత పరంగా హ్యుందాయ్ వెర్నాలోని అన్ని వేరియంట్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఫీచర్లను తప్పనిసరిగా అందించింది. ఎస్ఎక్స్(ఒ) వేరియంట్లో ఆరు ఎయిర్ బ్యాగులతో పాటు, సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్లు, ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు, పార్కింగ్ సెన్సార్లు గల రియర్ వ్యూవ్ పార్కింగ్ కెమెరా వంటి అదనపు ఫీచర్లున్నాయి.

జనరేషన్ హ్యుందాయ్ వెర్నా

హ్యుందాయ్ వెర్నా పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ వేరియంట్లలో లభించనుంది. ఇందులోని 1.6-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ 121బిహెచ్‌పి పవర్ మరియు 151ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

జనరేషన్ హ్యుందాయ్ వెర్నా

అదే విధంగా వెర్నా లోని 1.6-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ 126బిహెచ్‌పి పవర్ మరియు 260ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్‌లు కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో లభించనున్నాయి.

జనరేషన్ హ్యుందాయ్ వెర్నా

హ్యుందాయ్ వెర్నాలోని ఇ మరియు ఇఎక్స్ వేరియంట్లు 15-అంగుళాల స్టీల్ వీల్స్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల ఇఎక్స్ వేరియంట్ 15-అంగుళాల అల్లాయ్ వీల్స్ అదే విధంగా ఎస్ఎక్స్ మరియు ఎస్ఎక్స్(ఒ) టాప్ ఎండ్ వేరియంట్లలో 16-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

జనరేషన్ హ్యుందాయ్ వెర్నా

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హ్యుందాయ్ తమ సరికొత్త ఐదవ తరానికి చెందిన వెర్నా సెడాన్ కారును పరిచయం చేయడానికి సర్వం సిద్దం చేసుకుంది. హ్యుందాయ్ వారి అధునాతన ఫ్లూయిడిక్ స్కల్ప్‌చర్ 2.0 డిజైన్ ఫిలాసఫీ ఆదారంగా వస్తున్న వెర్నా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతి సియాజ్, హోండా సిటి, వోక్స్‌వ్యాగన్ వెంటో మరియు స్కోడా ర్యాపిడ్ వంటి మిడ్ సైజ్ సెడాన్ కార్ల నోరు మూయించనుంది.

English summary
Read In Telugu: Next-Gen Hyundai Verna Brochure Leaked Ahead Of Launch
Story first published: Wednesday, August 16, 2017, 17:51 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark