న్యూ వెర్నా వచ్చేస్తోందోచ్! విడుదల వివరాలు వెల్లడించిన హ్యుందాయ్

Written By:

హ్యుందాయ్ తమ వెర్నా కారుకు అనేక మార్పులు చేర్పులు నిర్వహించి, సరికొత్త నెక్ట్స్ జనరేషన్ వెర్నాను ఇండియన్ మార్కెట్లో విడుదలకు సిద్దం చేసింది. ఆగష్టు 22, 2017 నాడు సరికొత్త వెర్నాను విపణిలోకి చేయనుంది. నెక్ట్స్ జనరేషన్ వెర్నా ఇంజన్ మరియు ఇతర సాంకేతిక వివరాలును హ్యుందాయ్ వెల్లడించింది.

సరికొత్త హ్యుందాయ్ వెర్నా

హ్యుందాయ్ తమ వెర్నాలో ఎలాంటి మార్పులు అలాగే విక్రయిస్తూ వచ్చింది. దీనిని అవకాశంగా మార్చుకున్న సిటి మరియు సియాజ్ సెడాన్ కార్లు మంచి ఫలితాలను సాధించాయి. ఒక రకంగా చెప్పాలంటే స్కోడా ర్యాపిడ్ సెడాన్ కూడా వెర్నాను విక్రయాల పరంగా వెనక్కి నెట్టింది.

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
సరికొత్త హ్యుందాయ్ వెర్నా

అయితే హ్యుందాయ్ వెర్నాతో పూర్వవైభవాన్ని తెచ్చుకోవడానికి ఐదవ తరానికి చెందిన వెర్నాను పూర్తి స్థాయిలో విడుదలకు సిద్దం చేసింది. ఫీచర్లు మరియు పై పై మెరుగులతోనే కాదు, బాడీ మొత్తాన్ని రీడిజైన్ చేసి, అధిక ధృడత్వం గల స్టీల్‌తో, ప్రమాదం జరిగినపుడు వీలైనంత వరకు తట్టుకునే విధంగా కె2 ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా నెక్ట్స్ జనరేషన్ వెర్నాను నిర్మించింది.

సరికొత్త హ్యుందాయ్ వెర్నా

మలుపుల్లో కారు బాడీ రోల్ అవకుండా ముందు వైపున నూతన సస్పెన్షన్ సిస్టమ్ అందివ్వడం జరిగింది. వెనుక ప్యాసింజర్ల సౌకర్యం మరియు సౌలభ్యం కోసం మోడిఫై చేయసిన సస్పెన్షన్ వ్యవస్థను కారు వెనుక వైపున అందించారు. నాయిస్, వైబ్రేషన్ మరియు హార్ష్‌నెస్(NVH) లెవల్స్ పూర్తిగా తగ్గిపోయాయి.

సరికొత్త హ్యుందాయ్ వెర్నా

సాంకేతికంగా నెక్ట్స్ జనరేషన్ వెర్నా రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభించనుంది. అవి, 1.6-లీటర్ పెట్రోల్ మరియు 1.6-లీటర్ డీజల్, ఇందులోని పెట్రోల్ ఇంజన్ 121.3బిహెచ్‌పి పవర్ మరియు డీజల్ ఇంజన్ 126.2బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తాయి. అత్యుత్తమ మైలేజ్ ఇవ్వగవలిగే వీటిని 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లతో ఎంచుకోవచ్చు.

సరికొత్త హ్యుందాయ్ వెర్నా

ఎక్ట్సీయర్ డిజైన్ విషయానికి వస్తే, ముందు వైపున హెక్సాగోనల్ ఫ్రంట్ గ్రిల్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి. హ్యుందాయ్ చివరిసారిగా విపణిలోకి తెచ్చిన ఎలంట్రా కారుకు ప్రతిరూపంగా ఉంది.

సరికొత్త హ్యుందాయ్ వెర్నా

ఇంటీరియర్ ఫీచర్ల పరంగానే పోటీలో వెనుక పడిపోయిందని అందరికీ తెలిసిందే, మార్కెట్లో వెర్నా ప్రస్థానాన్ని తిరిగికొనసాగించేందుకు ఎన్నో క్లాస్ లీడింగ్ ఇంటీరియర్ ఫీచర్లను అందివ్వనున్నట్లు తెలిసింది. అందులో 7-అంగుళాల పరిమాణం ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ తప్పనిసరిగా రానుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న హ్యుందాయ్ డీలర్లు ఈ అప్ కమింగ్ వెర్నా మీద బుకింగ్స్ ప్రారంభించారు.

సరికొత్త హ్యుందాయ్ వెర్నా

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హ్యుందాయ్ మోటార్స్ ఎట్టకేలకు ఐదవ తరానికి చెందిన వెర్నా సెడాన్‌ను ఆవిష్కరించింది. ఇది పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే, మారుతి సుజుకి సియాజ్, హోండా సిటి, స్కోడా ర్యాపిడ్ మరియు వోక్స్‌వ్యాగన్ వెంటో కార్లకు గట్టి పోటీనివ్వనుంది.

English summary
Read In Telugu: Hyundai Unveils Next-Gen Verna In India; Launch Date Revealed
Story first published: Saturday, August 5, 2017, 11:37 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark