తరువాత తరం గ్రాండ్ వితారాలో ఆఫ్ రోడింగ్ లక్షణాలు లేవంటున్న సుజుకి

Written By:

జపాన్ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం సుజుకి యొక్క గ్రాండ్ వితారా వాహనం ఆఫ్ రోడింగ్ వెహికల్‌గా మంచి ప్రాచుర్యం పొందింది. అయితే సుజుకి తమ అంతర్జాతీయ నిర్మాణ వేదిక మీద నెక్ట్స్ జనరేషన్ గ్రాండ్ వితారా ను పూర్తిగా రహదారి అవసరాల కోసం అభివృద్ది చేస్తోంది. అంటే ఇందులో ఆఫ్ రోడింగ్ లక్షణాలను అందివ్వడం లేదని స్పష్టం చేస్తోంది.

మారుతి సుజుకి గ్రాండ్ వితారా

ప్రపంచ వ్యాప్తంగా క్రాసోవర్ వాహనాల మీద డిమాండ్ అధికమవుతున్న నేపథ్యంలో సుజుకి కూడా తమ గ్రాండ్ వితారా ను క్రాసోవర్ తరహాలో ఆన్ రోడ్ లక్షణాలతో అభివృద్ది చేయడానికి సిద్దమవుతోంది.

మారుతి సుజుకి గ్రాండ్ వితారా

ఓషియానియా మరియు లాటిన్ అమెరికా సుజుకి జనరల్ మేనేజర్ టకనోరి సుజుకి కార్అడ్వైస్ అనే పత్రికతో మాట్లాడుతూ, సుజుకి ఇప్పుడు నెక్ట్స్ జనరేషన్ గ్రాండ్ వితారాను అభివృద్ది చేస్తున్నట్లు తెలిపాడు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మృదువైన క్రాసోవర్ వాహనాలకు డిమాండ్ పెరిగిందని ఈ సందర్బంగా తెలియజేసాడు.

మారుతి సుజుకి గ్రాండ్ వితారా

సుజుకి మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న గ్రాండ్ వితారాలో ఎక్కువ ఇంటీరియర్ స్పేస్ తో పాటు మరింత శక్తివంతమైన వాహనంగా అభివృద్ది చేయనుందని, అయితే ఇది నిజమైన ఆఫ్ రోడింగ్ వాహనంలా లేదా గ్రాండ్ వితారా స్టైల్లోనే క్రాసోవర్ తరహాలో వస్తుందా అనేది స్పష్టం చేయలేకపోతున్నాని చెప్పుకొచ్చాడు.

మారుతి సుజుకి గ్రాండ్ వితారా

రహదారి అవసరాలను మాత్రమే దృష్టిలో ఉంచుకుని, ఆఫ్ రోడింగ్ లక్షణాలు లేకుండా డిజైన్ మరియు పనితీరు పరంగా క్రాసోవర్ బాటలో ఉండేట్లు సుజుకి యొక్క ఆధునిక అంతర్జాతీయ అర్కిటెక్చర్ వేదిక మీద నెక్ట్స్ జనరేషన్ గ్రాండ్ వితారాను అభివృద్ది చేయనుంది.

మారుతి సుజుకి గ్రాండ్ వితారా

కాబట్టి నెక్ట్స్ జనరేషన్ గ్రాండ్ వితారా ప్రస్తుతం లభిస్తున్న మోడల్ శైలిలోనే, అవే శరీర మరియు ఇంజన్ భాగాలతో రూపుదిద్దుకోనుంది. తక్కువ శరీర బరువుతో నిర్మించడం మీద దృష్టిసారిస్తోంది. అయితే వాలు మరియు మెట్ట తలం మీద ఆఫ్ రోడింగ్ వెహికల్‌ పనితీరు ప్రదర్శించలేదు.

మారుతి సుజుకి గ్రాండ్ వితారా

ప్రస్తుతం దేశీయంగా అందుబాటులో ఉన్న గ్రాండ్ వితారా 2393సీసీ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంది. ఇది గరిష్టంగా 163.5బిహెచ్‌పి పవర్ మరియు 225టార్క్ ఉత్పత్తి చేయును.

మారుతి సుజుకి గ్రాండ్ వితారా

మీ నగరంలో మారుతి సుజుకి లోని అన్ని మోడళ్లతో పాటు గ్రాండ్ వితారా ధరలను తెలుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి....

 

English summary
Next-Gen Suzuki Grand Vitara To Lose Off-Road Capabilities; Confirms Suzuki
Story first published: Friday, January 20, 2017, 10:57 [IST]
Please Wait while comments are loading...

Latest Photos