మళ్లీ పట్టుబడింది: మారుతి నుండి వస్తోన్న మరో అప్‌డేటెడ్ మోడల్

ఎమ్‌పీవీ సెగ్మెంట్లో పాశ్చాత్య కంపెనీల కార్లు మారుతి ఎర్టిగా వాహనానికి గట్టి పోటీనిస్తున్నాయి. ఈ తరుణంలో ఎర్టిగా ఎమ్‌పీవీని సరికొత్త వెర్షన్‌లో వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ చేయడానికి ఏర్పాట్లు చకాచకా

By Anil

మారుతి సుజుకి గత రెండేళ్ల కాలంలో విడుదల చేసిన మోడళ్లతో వరుస విజయాలు అందుకుంది. ప్రతి సెగ్మెంట్లో తానే లీడర్‌గా రాణించేందుకు మారుతి వేస్తున్న ఒక్కొక్క ఎత్తుగడ ఫలిస్తోంది.

అయితే, ఎమ్‌పీవీ సెగ్మెంట్లో పాశ్చాత్య కంపెనీల కార్లు మారుతి ఎర్టిగా వాహనానికి గట్టి పోటీనిస్తున్నాయి. ఈ తరుణంలో ఎర్టిగా ఎమ్‌పీవీని సరికొత్త వెర్షన్‌లో వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ చేయడానికి ఏర్పాట్లు చకాచకా పూర్తి చేస్తోంది.

మారుతి సుజుకి ఎర్టిగా

మారుతి సుజుకి తమ ఎర్టిగా ఫ్యామిలీ ఎమ్‌పీవీలో భారీ మార్పులు చేర్పులు చేసి పోటీదారులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా కస్టమర్లకు ఏకైక ఎంపికగా నిలిచేందుకు డెవలప్ చేస్తోంది. అందులో భాగంగా, మారుతి సుజుకి బృందం గత కొన్ని రోజుల నుండి ఎర్టిగా వాహనాన్ని పూర్తిగా నలుపు రంగు పేపర్‌తో కప్పేసి రహదారి పరీక్షలు నిర్వహిస్తోంది.

Recommended Video

[Telugu] Suzuki Intruder 150 Launched In India
మారుతి సుజుకి ఎర్టిగా

రహస్యంగా లీకైన ఫోటోలను పరిశీలిస్తే, రెగ్యులర్ వెర్షన్ ఎర్టిగాతో పోల్చుకుంటే కొలతల పరంగా నెక్ట్స్ జనరేషన్ ఎర్టిగా పెద్దదిగా ఉంటుంది. ఇంటీరియర్‌లోని చివరి వరుస సీటును రీడిజైన్ చేసి మరింత సౌకర్యవంతంగా మార్చుతున్నట్లు తెలుస్తోంది.

మారుతి సుజుకి ఎర్టిగా

సరికొత్త అల్లాయ్ వీల్స్, న్యూ రియర్ డిజైన్, టెయిల్ ల్యాంప్ క్లస్టర్ పూర్తిగా కొత్తవి. న్యూ జనరేషన్ ఎర్టిగాను సుజుకి వారి హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ మీద అభివృద్ది చేస్తోంది. ఇదే ఫ్లాట్‌ఫామ్ మీద నూతన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ మరియు కొత్త తరం డిజైర్ కాంపాక్ట్ సెడాన్ అభివృద్ది చేయబడ్డాయి.

మారుతి సుజుకి ఎర్టిగా

ఇంటీరియర్‌లో న్యూ డిజైర్‌లో పరిచయం చేసిన అధునాతన టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు బ్లూటూత్ కనెక్టివిటి వంటి ఫీచర్లు రానున్నాయి. వీటితో పాటు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ మరియు పగటి పూట వెలిగే లైట్లు మరియు ఎల్ఇడి లైట్లు రానున్నాయి.

మారుతి సుజుకి ఎర్టిగా

సాంకేతికంగా మారుతి నెక్ట్స్ జనరేషన్ ఎర్టిగా ప్రస్తుతం లభించే అవే 1.4-లీటర్ పెట్రోల్ ఇంజన్ రానుంది. అయితే, 1.5-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ స్థానంలోకి 1.3-లీటర్ డీజల్ ఇంజన్ వచ్చే అవకాశం ఉంది. అప్ కమింగ్ ఎర్టిగాలో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రానున్నాయి.

Most Read Articles

English summary
Read In Telugu: Next-Generation Maruti Ertiga MPV Spotted Testing In India
Story first published: Thursday, November 16, 2017, 19:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X