మారుతి విడుదల చేయనున్న కొత్త తరం స్విఫ్ట్ ఇదే: రహస్యంగా లీకైన ఫోటోలు

Written By:

ఇండియన్ మార్కెట్లోకి మారుతి సుజుకి నుండి విడుదల కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్న మోడల్ సరికొత్త నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్. డిజైర్ తరహాలో భారీ మార్పులకు గురైన 'తరువాత తరం స్విఫ్ట్' అతి త్వరలో విపణిలోకి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి తొలిసారిగా స్విఫ్ట్ హైబ్రిడ్ హ్యాచ్‌బ్యాక్ కారును దిగుమతి చేసుకుని పరీక్షిస్తోంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్

మూడవ తరానికి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ అతి త్వరలో ప్రారంభం కానున్న 2017 జెనీవా మోటార్ షో వేదిక మీద ఆవిష్కరణకు రానుంది. దేశీయ మరియు అంతర్జాతీయ మోస్ట్ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటి నిలిచిన స్విఫ్ట్ కొత్త టెక్నాలజీ మరియు డిజైన్ లక్షణాలతో సరికొత్త రూపంలో మార్కెట్ చేరనుంది.

Recommended Video
Toyota Etios Safety Experiential Drive in Bengaluru | In Telugu - DriveSpark తెలుగు
మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్

సరికొత్త మారుతి స్విఫ్ట్ బాలెనో ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా అభివృద్ది చేయబడింది. ప్రస్తుతం ఉన్న స్విఫ్ట్‌తో పోల్చితే నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్ కారు తేలికపాటి బరువును కలిగి ఉంది, దీంతో హ్యాండ్లింగ్ మరింత వృద్ది చెందుతుంది.

మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్

నూతన స్విఫ్ట్ ముందు వైపు డిజైన్‌ పూర్తి మారిపోయింది. స్వెప్ట్‌బ్యాక్ హెడ్ ల్యాంప్స్, హెక్సాగోనల్ ఫ్రంట్ గ్రిల్ మరియు రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్ ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. సైడ్ ప్రొఫైల్‌లో బ్లాక్డ్ అవుట్ ఏ మరియు బి పిల్లర్లు, ఫ్లోటింగ్ రూఫ్ డిజైన్ కలదు.

మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్

నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్ రియర్ డిజైన్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. సరికొత్త టెయిల్ ల్యాంప్ క్లస్టర్, బంపర్ మరియు టెయిల్ గేట్ డిజైన్‌ను మోడ్రన్ లుక్‌లో అందివ్వడం జరిగింది. పాత స్విఫ్ట్ రియర్ డిజైన్‌తో పోల్చితే ఎంతో చక్కగా ఉంటుంది.

మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్

మూడవ తరానికి చెందిన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభ్యం కానుంది. అయితే, బరువు తగ్గడంతో చాలా వేగం అధికంగా ఉంది. పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లు మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభించనున్నాయి.

మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్

స్విఫ్ట్ ఇంటీరియర్‌లో అధునాతన ప్లాట్‌బాటమ్ స్టీరింగ్ వీల్, తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్, ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లు, ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్ లతో పాటు పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు మరియు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి.

మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి తరువాత తరం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ఆవిష్కరించనుంది. ఆవిష్కరణ అనంతరం వెనువెంటనే విపణిలోకి విడుదల చేయనుంది.

ఫోటోలు...

English summary
Read In Telugu: Next-Generation Maruti Swift Hybrid Spotted In India For The First Time
Story first published: Saturday, September 9, 2017, 11:22 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark