సేఫ్టీలో దీన్ని మించిన హ్యాచ్‌బ్యాక్ కారు లేదు: భద్రతలో రారాజు

Written By:

జర్మన్ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ ఆరవ తరానికి చెందిన పోలో హ్యాచ్‌బ్యాక్ కారును జూలై 2017 లో ఆవిష్కరించింది. మునుపటి తరానికి చెందిన పోలో కారుతో పోల్చుకుంటే ఇందులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు ఎన్నో కొత్త ఫీచర్లు ఉన్నాయి.

మరి కొన్ని రోజుల్లో విడుదల కానున్న కానున్న 6 జనరేషన్ పోలో కారుకు భద్రత పరీక్షలు నిర్వహించింది. ఇవాళ్టి కథనంలో పోలో హ్యాచ్‌బ్యాక్ ఎంత వరకు సురక్షితమైనదో చూద్దాం రండి...

వోక్స్‌వ్యాగన్ పోలో క్రాష్ పరీక్షలు

వోక్స్‌వ్యాగన్ తమ నూతన పోలో హ్యాచ్‍‌బ్యాక్‌కు అంతర్జాతీయ సేఫ్టీ టెస్ట్ ఏజెన్సీ లాటిన్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్(NCAP) ఆధర్యంలో క్రాష్ పరీక్షలు చేయించింది. 2018 పోలో ఈ పరీక్షల్లో పెద్దలు మరియు చిన్న పిల్లల సేఫ్టీ పరంగా 5-స్టార్ల రేటింగ్ పొందింది.

వోక్స్‌వ్యాగన్ పోలో క్రాష్ పరీక్షలు

2018 పోలో లభించే అన్ని వేరియంట్లకు ముందు, ప్రక్కవైపుల, సైడ్ పోల్ ద్వారా ఢీకొట్టించారు. దీంతో పోలో శరీర నిర్మాణం ధృడత్వం, నిర్మాణ నాణ్యత మరియు ప్రయాణికుల మీద ప్రమాద తీవ్రత ఏ మేరకు ఉంటుందో బయటపడుతుంది.

Recommended Video - Watch Now!
Toyota Etios Safety Experiential Drive in Bengaluru | In Telugu - DriveSpark తెలుగు
వోక్స్‌వ్యాగన్ పోలో క్రాష్ పరీక్షలు

లాటిన్ అమెరికాలో పరిచయం చేయనున్న పోలో వేరియంట్లలో నాలుగు ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్ మరియు ఎన్నో సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ పోలో క్రాష్ పరీక్షలు

సైడ్ మరియు ఫ్రంట్ క్రాష్ టెస్ట్ అనంతరం సరికొత్త పోలో బాడీ స్థిరంగా ఉన్నట్లు ఎన్‌సిఎపి గుర్తించింది. అంతే కాకుండా, తరువాత తరం పోలో కారులో ఉన్న ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్ సిస్టమ్ పనితీరు అద్భుతమని పేర్కొంది.

వోక్స్‌వ్యాగన్ పోలో క్రాష్ పరీక్షలు

లాటిన్ అమెరికా విపణి కోసం అభివృద్ది చేసిన పోలో విభిన్న ఇంజన్ ఆప్షన్లలో లభించనుంది. అవి,

  • 83బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్
  • 116బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్
  • 127బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే 1.0-లీటర్ టుర్బో-పెట్రోల్ ఇంజన్
తొలి రెండు ఇంజన్‌లు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరియు టాప్ రేంజ్ పోలో 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో రానున్నాయి.
వోక్స్‌వ్యాగన్ పోలో క్రాష్ పరీక్షలు

నెక్ట్స్ జనరేషన్ వోక్స్‌వ్యాగన్ పోలో మునుపటి పోలో పోల్చుకుంటే మరింత కండలు తిరిగిన శరీరాకృతిని పోలి ఉంది. హెడ్ ల్యాంప్స్ మరియు C-ఆకారంలో ఉన్న పగటి పూట వెలిగే లైట్లు అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా ఉన్నాయి.

సరికొత్త పోలో ఇంటీరియర్ ఇప్పుడు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందుకు ప్రధాన కారణం వీల్ బేస్ గణనీయంగా పెరగడం. నూతన స్టీరింగ్ వీల్ సిస్టమ్‌తో పాటు ఇంటీరియర్‌లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.

వోక్స్‌వ్యాగన్ పోలో క్రాష్ పరీక్షలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కార్ల వినియోగం పెరిగే కొద్దీ ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే, ప్రమాదానంతరం కూడా ప్రాణాలతో బయటపడాలంటే కార్లలో తగినన్ని సేఫ్టీ ఫీచర్లు ఉండాలి.

ప్రస్తుతం కొనుగోలుదారు సేఫ్టీ మీద దృష్టి సారించడం మరియు ప్రభుత్వాలు కొన్ని భద్రత ఫీచర్లను కార్లలో తప్పనిసరి చేయడం మరియు బ్రాండ్ వ్యాల్యూ పెంచుకోవడం కోసం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని తమ కార్ల అధునాతన సేఫ్టీ ఫీచర్లను అందిస్తున్నాయి. ఫీచర్లు మాత్రమే కాదండోయ్, నిర్మాణ నాణ్యత కూడా బాగుండాలి. అందుకే తమ కార్ల నిర్మాణ నాణ్యత మరియు సేఫ్టీ పరంగా టెస్ట్ నిర్వహించి ఎంత వరకు సురక్షితమైనదో కస్టమర్లకు వివరిస్తాయి.

ఇప్పుడు ఇండియన్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో అత్యంత సురక్షితమైన కారు ఏదంటే వోక్స్‌వ్యాగన్ పోలో అని చెప్పవచ్చు. ఇదే సెగ్మెంట్లో ఉన్న ఫోర్డ్ ఫిగో కూడా సేఫ్టీ పరంగా మంచి మార్కులే పొందింది.

English summary
Read In Telugu: next generation volkswagen polo gets 5 star safety rating NCAP
Story first published: Wednesday, October 11, 2017, 15:48 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark