భారీ ధరల తగ్గింపుతో ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించిన నిస్సాన్

Written By:

నిస్సాన్ ఇండియా తమ అన్ని నిస్సాన్ మరియు డాట్సన్ కార్ల మీద గొప్ప తగ్గింపు మరియు డిస్కౌంట్లతో పండుగ సీజన్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా లభించే అన్ని నిస్సాన్-డాట్సన్ ప్యాసింజర్ కార్ల మీద సెప్టెంబర్ 5, 2017 నుండి ఆఫర్లు లభిస్తున్నాయి.

నిస్సాన్ డాట్సన్ ఆఫర్లు

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కార్ల తయారీ సంస్థలకు భారత్ అతి పెద్ద మార్కెట్. అందులో ప్రతి ఏడాదిలో వచ్చే చివరి నాలుగు నెలలు మరింత ప్రత్యేకం. అన్ని దీపావళి, దసరా, క్రిస్మస్ వంటి పండుగలతో చివరి నాలుగు నెలల్లో దేశం మొత్తం పండుగ వాతావరణం నెలకొంటుంది.

Recommended Video - Watch Now!
Toyota Etios Safety Experiential Drive in Bengaluru | In Telugu - DriveSpark తెలుగు
 నిస్సాన్ ఆఫర్లు

ఈ సమయంలో కార్ల తయారీ సంస్థలు రకరకాల ఆఫర్లను ప్రకటించి వీలైనన్ని కార్లను విక్రయించేస్తాయి. ఏడాది మొత్తం అంతంతమాత్రం విక్రయాలు జరిపే కంపెనీలు కూడా వీలైనంత వరకు అమ్మేస్తాయి. ఇప్పటికే పండుగ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో నిస్సాన్-డాట్సన్ భాగస్వామ్యం తమ ప్యాసింజర్ కార్ల మీద ఆఫర్లను ప్రకటించేశాయి.

 నిస్సాన్ ఆఫర్లు

నిస్సాన్ కార్ల మీద గరిష్టంగా రూ. 71,000 ల వరకు పండుగ ఆఫర్లను ప్రకటించింది. నిస్సాన్ ప్రకటించిన 71 వేల రుపాయల్లోనే ఉచిత ఇన్సూరెన్స్, రూ. 20,000 ల ఎక్స్‌చ్చేంజ్ బోనస్ మరియు రూ. 6,000 లు కార్పోరేట్ బోనస్‌లు ఉన్నాయి.

 నిస్సాన్ ఆఫర్లు

నిస్సాన్ మైక్రా ఎమ్‌సి మీద రూ. 39,000 లు మరియు మైక్రా ఆక్టివ్ మీద రూ. 34,000 ల వరకు లాభాలను అందిస్తోంది. ఇందులో ఉచిత ఇన్సూరెన్స్, ఎక్స్‌చ్చేంజ్ బోనస్ మరియు రూ. 10,000 ల కార్పోరేట్ బోనస్ ఉన్నాయి.

 నిస్సాన్ ఆఫర్లు

డాట్సన్ తమ కార్ల మీద రూ. 16,000 ల వరకు కస్టమర్లకు లాభాలను ప్రకటించింది. ఉచిత ఇన్సూరెన్స్ మరియు 2,000 రుపాయల కార్పోరేట్ బోనస్‌తో కలుపుకొని గో ప్లస్ కారు మీద రూ. 16,000 లు, గో కారు మీద రూ. 14,500 లు మరియు రెడి-గో(800సీసీ) హ్యాచ్‌బ్యాక్ కారు మీద రూ. 13,000 ల వరకు ఆఫర్లను అందిస్తోంది.

 నిస్సాన్ ఆఫర్లు

ఈ పండుగ సీజన్‌లో నిస్సాన్ లేదా డాట్సన్ కారును ఇంటికి తీసుకెళ్లే కస్టమర్లకు ఒక బంగారు నాణాన్ని అందిస్తున్నారు. అంతే కాకుండా నిస్సాన్ రెనో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా ద్వారా 7.99 శాతం వడ్డీ రేటుతో ఫైనాన్స్ సదుపాయం కల్పిస్తున్నారు. డాట్సన్ ఇండియా దేశీయంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు డాట్సన్ రెడిగో ఎంచుకోవడం ద్వారా రూ. 6,000 లు డిస్కౌంట్‌గా అందిస్తోంది.

 నిస్సాన్ ఆఫర్లు

ఈ యేడు పండుగ ఆఫర్లు ఇంతటితో ఆగిపోలేదు, సెప్టెంబర్ 5, 2017 నుండి సెప్టెంబర్ 19, 2017 మధ్య నిస్సాన్ లేదా డాట్సన్ కార్లను బుక్ చేసుకున్న వారిలో తొమ్మిది మంది లక్కీ విన్నర్లు పండుగ ఆఫర్ ద్వారా ఒక్కో కస్టమర్ నిస్సాన్ మరియు డాట్సన్ కారును ఉచితంగా గెలుపొందే అవకాశం అందిస్తోంది.

 నిస్సాన్ ఆఫర్లు

ఈ ఆఫర్లపై నిస్సాన్-డాట్సన్ వారి షరతులు మరియు నిభందనలు:

  • మొత్తం ఆఫర్లలో ఉచిత ఇన్సూరెన్స్, ఎక్స్‌చ్చేంజ్ బోనస్ మరియు కార్పోరేట్ ఆఫర్లు ఉన్నాయి.
  • నిస్సాన్ రెనో ఫైనాన్స్ సర్వీసెస్ ఇండియా వారి నుండి ఫైనాన్స్ చేయించుకునే వారికే సరసమైన వడ్డీ రేట్లు వర్తిస్తాయి.
  • నిస్సాన్ ఇన్సూరెన్స్ ద్వారా మాత్రమే ఉచిత ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.
  • పిల్లర్స్ ఆఫ్ ఇండియా లేదా కార్పోరేట్ ఆఫర్లలో ఏదైనా ఒక్కటే వర్తిస్తుంది.
  • నిస్సాన్ మరియు డాట్సన్ ప్రకటించిన ఫీచర్లు వివిధ రకాల వేరియంట్లు మరియు రాష్ట్రాలు పరంగా ఆఫర్లలో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది.
  • పూర్తి వివరాలు కోసం సమీపంలోనే నిస్సాన్-డాట్సన్ డీలర్‌ను సంప్రదించగలరు.

English summary
Read In Telugu: Nissan And Datsun India Announce Festive Benefits
Story first published: Friday, September 8, 2017, 16:59 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark