కిక్స్ ఎస్‌యూవీని బరిలోకి దించుతున్న నిస్సాన్

Written By:

జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం నిస్సాన్ ఎట్టకేలకు తమ కిక్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విడుదల వివరాలను వెల్లడించింది. నిస్సాన్ గ్లోబల్ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, ఇండియన్ మార్కెట్లోకి నిస్సాన్ యొక్క నెక్ట్స్ మోడల్ కిక్స్ ఎస్‌యూవీని లాంచ్ చేస్తున్నట్లు పేర్కొన్నాడు.

నిస్సాన్ కిక్స్

నిస్సాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం మరియు ఇండియా మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మెన్ పేమెన్ కర్గార్ ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ, నిస్సాన్ ఇండియాలో తమ నెక్ట్స్ ప్రొడక్ట్ కిక్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీని అని తెలిపాడు.

Recommended Video - Watch Now!
[Telugu] Jeep Compass Launched In India - DriveSpark
నిస్సాన్ కిక్స్

2013 నుండి నిస్సాన్ ఇండియన్ మార్కెట్లోకి ఒక్క విడుదల కూడా చేయలేదు. కిక్స్ ఎస్‌యూవీని కూడా ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయనున్నట్లు తెలిసింది.

నిస్సాన్ కిక్స్

నిస్సాన్ కిక్స్ వెహికల్‌తో పాటు భవిష్యత్తులో మరిన్ని కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనున్నట్లు కర్గార్ తెలిపాడు. అంతర్జాతీయ మార్కెట్ కోసం అభివృద్ది చేసే ఉత్పత్తులనే ఇండియన్ రోడ్లకు అనుగుణంగా తీర్చిదిద్ది పరిచయం చేయనున్నారు.

నిస్సాన్ కిక్స్

నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీని రెనో వారి MO ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మించారు. ఇదే ఫ్లాట్‌ఫామ్ మీద డస్టర్ మరియు క్యాప్చర్ మోడళ్లను రెనో డెవలప్ చేసింది. తక్కువ ధర మరియు అత్యుత్త నిర్మాణ నాణ్యతా విలువలతో కిక్స్‌ను నిర్మించడానికి రెనో MO ఫ్లాట్‌ఫామ్ ఎంతగానో సహకరించిందని చెప్పవచ్చు.

నిస్సాన్ కిక్స్

కిక్స్ ఎస్‌యూవీని చూడటానికి రెనో మోడళ్లను పోలి ఉంటుంది. నూతన స్టైలింగ్ లుక్స్ మరియు స్లోపింగ్ రూఫ్ లైన్ ద్వారా కిక్స్ అగ్రెసివ్ డిజైన్‌ను సొంతం చేసుకుంది. నిస్సాన్ కిక్స్ స్మూత్ డిజైన్ లైన్స్, రూఫ్ రెయిల్స్ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి.

నిస్సాన్ కిక్స్

కిక్స్ ఎస్‌యూవీని చూడటానికి రెనో మోడళ్లను పోలి ఉంటుంది. నూతన స్టైలింగ్ లుక్స్ మరియు స్లోపింగ్ రూఫ్ లైన్ ద్వారా కిక్స్ అగ్రెసివ్ డిజైన్‌ను సొంతం చేసుకుంది. నిస్సాన్ కిక్స్ స్మూత్ డిజైన్ లైన్స్, రూఫ్ రెయిల్స్ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి.

నిస్సాన్ కిక్స్

సాంకేతికంగా నిస్సాన్ కిక్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 1.5-లీటర్ లేదా 1.6-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ వెర్షన్‌లలో వచ్చే అవకాశం ఉంది. 108బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేయగల 1.5-లీటర్ డీజల్ ఇంజన్ అతి త్వరలో విడుదల కానున్న క్యాప్చర్ ఎస్‌యూవీలో రానుంది.

నిస్సాన్ కిక్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో విక్రయాలు రోజు రోజుకీ పుంజుకుంటున్నాయి. ఇండియన్ మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కిక్స్ ఎస్‌యూవీని లాంచ్‌కు సిద్దం చేసింది.

విపణిలో ఉన్న టెర్రానో ఎస్‌యూవీ పై స్థానాన్ని భర్తీ చేయనుంది. రూ. 15 నుండి 20 లక్షల ధరల శ్రేణిలో వచ్చే అవకాశం ఉన్న నిస్సాన్ కిక్స్ హ్యుందాయ్ క్రెటా మరియు అప్ కమింగ్ రెనో క్యాప్చర్ ఎస్‌యూవీల నుండి గట్టి పోటీని ఎదుర్కోనుంది.

English summary
Read In Telugu: Nissan Kicks India Launch Details Revealed
Story first published: Tuesday, October 31, 2017, 10:26 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark