నెక్ట్స్ జనరేషన్ నిస్సాన్ లీఫ్ టీజర్ విడుదల

Written By:

జపాన్‌కు చెందిన ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ తమ తరువాత తరానికి చెందిన లీఫ్ ఎలక్ట్రిక్ కారుకు చెందిన టీజర్‌ ఫోటోను విడుదల చేసింది. ఈ ఏడాదిలో జరగనున్న 45 వ టోక్యో మోటార్ షో వేదికగా తమ నెక్ట్స్ జనరేషన్ లీఫ్ ఇవి ను ఆవిష్కరించనుంది.

నిస్సాన్ లీఫ్

తొలి టీజర్ ఫోటోగా నూతన లీఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ హెడ్ ల్యాంప్ ఫోటోను విడుదల చేసింది. అత్యంత విరణాత్మక డిజైన్‌లో ఈ హెడ్ ల్యాంప్ నిస్సాన్ వారి మైక్రా హ్యాచ్‌బ్యాక్‌లో గుర్తించవచ్చు.

నిస్సాన్ లీఫ్

నిస్సాన్ ఇప్పుడు అధికారికంగా టీజర్ ద్వారా నెక్ట్స్ జనరేషన్ లీఫ్ డిజైన్ అంశాలను ఒక్కొక్కటిగా రివీల్ చేయడానికి ముందే పలుమార్లు రహస్యంగా పర్యక్షలు నిర్వహించింది. హెడ్ ల్యాంప్ మాత్రమే కాకుండా నూతన మైక్రా డిజైన్ లక్షణాలను దాదాపుగా కలిగి ఉంది.

నిస్సాన్ లీఫ్

మైక్రా పోలికలనే కాకుండా 2015లో జరిగిన టోక్యో మోటార్ షో వేదిక మీద ప్రదర్శించిన ఐడిఎస్ కాన్సెప్ట్ కారుకు సంభందించిన డిజైన్ ఫీచర్లతో సరికొత్త లీఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ రానుంది. ప్రధానంగా ఫ్లోటింగ్ రూఫ్ డిజైన్ ఐడిఎస్ కాన్సెప్ట్ కారు నుండి సేకరించినదే.

నిస్సాన్ లీఫ్

రేంజ్ విస్తరణ దిశగా భారీ మార్పులు చేపట్టిన నిస్సాన్. ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లో విపరీతమైన పోటీ ఉంది. నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ వెహికల్‌ ప్రస్తుతం షెవర్లే బోల్ట్ ఇవి మరియు టెస్లా మోడల్ 3 లతో తీవ్ర పోటీని ఎదుర్కోనుంది.

నిస్సాన్ లీఫ్

ప్రస్తుతం ఉన్న లీఫ్ పరిధి గరిష్టంగా 172 కిలోమీటర్లు(107 మైళ్లు)గా ఉంది. దీనిని 322 నుండి 482 కిలోమీటర్ల (200 నుండి 300 మైళ్లు) వరకు ప్రయాణించే విధంగా పరిధిని పెంచే దిశగా నిస్సాన్ పనిచేస్తోంది.

English summary
Read In Telugu Next-Gen Nissan Leaf Teased
Story first published: Saturday, May 20, 2017, 15:06 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark