తాజ్‌మహల్ చుట్టూ పెట్రోల్ మరియు డీజల్ వెహికల్స్ నిషేధం

తాజ్‌మహల్ పరిరక్షణలో భాగంగా ఉన్న తాజ్ ట్రెపీజియమ్ జోన్ (TTZ)ప్రాధికార సంస్థ తాజ్‌మహల్ చుట్టూ 500 మీటర్ల మేర పెట్రలో మరియు డీజల్ వాహనాలతో నడిచే వాహనాలను పూర్తిగా నిషేధించింది.

By Anil

తాజ్‌మహల్ పరిరక్షణలో భాగంగా ఉన్న తాజ్ ట్రెపీజియమ్ జోన్ (TTZ)ప్రాధికార సంస్థ తాజ్‌మహల్ చుట్టూ 500 మీటర్ల మేర పెట్రలో మరియు డీజల్ వాహనాలతో నడిచే వాహనాలను పూర్తిగా నిషేధించింది. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ వ్రాతపూర్వకంగా ఇచ్చిన సమధానంలో, కొన్ని అధ్యయనాల ప్రకారం, తాజ్‌మహాల్ నిర్మించిన పాలరాయి, వాహన ఉద్గార కర్బన కాలుష్య అవశేషాల కారణంగా తెలుపు నుండి పసుపు రంగుల్లో మారుతున్నట్లు తెలిపాడు.

తాజ్‌మహల్ చుట్టూ పెట్రోల్ మరియు డీజల్ వెహికల్స్ నిషేధం

అంతే కాకుండా TTZ కూడా ఈ విషయమై సీరియస్‌గా ఉంది. మరియు తాజ్‌మహల్ చుట్టూ వినియోగించే వాహనాల స్థానంలో సిఎన్‌జి వాహనాలను ప్రవేశపెట్టాలని కోరింది.

కేంద్ర మంత్రి హర్షవర్దన్ మాట్లాడుతూ, "తాజ్ ట్రెపీజియమ్ జోన్ అథారిటీ తాజమహల్‌ చుట్టూ 500మీటర్ల మేరకు పెట్రోల్ మరియు డీజల్ వాహనాల వినియోగాన్ని బ్యాన్ చేసింది. అంతే కాకుండా తాజ్‌మహల్ చుట్టు పర్యాటకుల కోసం వినియోగించే వాహనాల స్థానంలో పూర్తిగా సిఎన్‌జి వాహనాలను ప్రవేశపెట్టాలని ఆర్డర్స్ పాస్ చేసినట్లు తెలిపాడు.

Recommended Video

Ducati 1299 Panigale R Final Edition Launched In India | In Telugu - DriveSpark తెలుగు
తాజ్‌మహల్ చుట్టూ పెట్రోల్ మరియు డీజల్ వెహికల్స్ నిషేధం

ఆర్డర్‌ను ఖచ్చితంగా అమలు చేయాలని హర్షవర్దన్ తెలిపాడు. ఈ నియమాన్ని ఉల్లఘించి తాజ్‌‌మహల్ చుట్టూ పెట్రోల్ మరియ డీజల్ వాహనాల వినియోగించే వారికి అధిక మొత్తంలో జరిమానాలను విధించాలని కూడా పేర్కొన్నాడు.

తాజ్‌మహల్ చుట్టూ పెట్రోల్ మరియు డీజల్ వెహికల్స్ నిషేధం

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

యునెస్కో చేత గుర్తించబడిన వారసత్వ సంపదల్లో తాజ్‌మహల్ ఒకటి. ప్రేమకు చిహ్నంగా చెప్పుకునే తాజ్‌మహల్ దాని అద్బుతమైన కట్టడానికి మరియు తెలుపు రంగుకి ప్రత్తేకతగా చెప్పుకోవచ్చు. అయితే గత కొన్నేళ్లుగా కాలుష్యం పెరిగిపోయి తెలుపు రంగులో ఉన్న పాలరాయి కొద్దికొద్దిగా పసుపు రంగులోకి మారిపోతోంది. అయితే తాజ్‌మహల్ చుట్టూ 500 మీటర్ల వరకు పెట్రోల్ మరియు డీజల్ వాహనాలను బ్యాన్ చేయడం హర్షించదగ్గ విషయం!

Most Read Articles

English summary
Read In Telugu: Petrol And Diesel Vehicles Are Now Banned Within 500 Meters From Taj Mahal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X