TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
పెట్రోల్ మరియు డీజల్ మీద ఎక్సైజ్ సుంకం తగ్గించిన కేంద్రం
దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజల్ మీద రెండు రుపాయల ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించింది. నిరంతరం పెరుగుతున్న ఇంధన ధరలు నుండి ప్రజలకు ఉపశమనం కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ సుంకం తగ్గించిన తరువాత సవరించబడిన కొత్త ధరలు నేటి(04 అక్టోబర్, 2017) నుండి అమల్లోకి వచ్చాయి.
లీటర్ పెట్రోల్ మరియు డీజల్ మీద నిన్నటి వరకు ఉన్న ధరలో ఎక్సైజ్ డ్యూటీ క్రింద రెండు రుపాయలు తగ్గించడం జరిగింది. ప్రస్తుతం, దేశ రాజధాని ఢిల్లీలో మరియు కేంద్ర రాజధాని పరిధిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 70.88 లు మరియు లీటర్ డీజల్ ధర రూ. 59.14 లుగా ఉన్నాయి.
దేశవ్యాప్తంగా బ్రాండెడ్ మరియు అన్‌బ్రాండెడ్ పెట్రోల్ మరియు డీజల్ మీద ఎక్సైజ్ సుంకం తగ్గింపు వర్తిస్తుంది. ఈ నిర్ణయంతో ఈ ఆర్థిక సంవత్సరం మిగలిన భాగంలో కేంద్రం సుమారుగా 13,000 కోట్ల రుపాయల మేర ఆదాయాన్ని కోల్పోనుంది.
జూలైలో 1.88 శాతంగా ఉన్న హోల్‌సేల్ ద్రవ్యోల్బణం ఆగష్టులో 3.44 శాతానికి పెరగడంతో ధరల భారం పెరిగింది. ఈ నేపథ్యంలో సామాన్యుడికి ఊరటనిచ్చేందుకు కేంద్రం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
భారత ఇంధన ధరలు అంతర్జాతీయ మార్కెట్‌తో ముడిపడి ఉన్నాయి, దీనికి అనుగుణంగానే ప్రపంచ విపణిలో జరిగే మార్పులను దృష్టిలో ఉంచుకుని రోజు వారీగా ఇంధన ధరలను సవరించే పద్దతిని ప్రవేశపెట్టారు.
అయితే, రిటైల్ ధర కన్నా ట్యాక్స్‌లే అధికంగా ఉండటంతో ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మూడేళ్ల క్రితం అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గుముఖంపట్టినా ప్రభుత్వం ట్యాక్స్ పెంచింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి మాట్లాడుతూ," బ్రాండెడ్ మరియు అన్‌బ్రాండెడ్ పెట్రోల్ మరియు డీజల్ ఇంధన ధరల మీద ఉన్న ప్రాథమిక ఎక్సైజ్ సుంకంలో రూ. 2 లను భారత ప్రభుత్వం తగ్గించినట్లు మరియు ఈ తగ్గింపు ఆక్టోబరు 4, 2017 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చినట్లు తెలిపాడు."
డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
రోజూ వారి ఇంధన ధరల సవరణ పేరుతో విపరీతంగా పెరుగుతున్న ఇంధన ధరలకు కేంద్రం బ్రేక్ వేసింది. మునుపెన్నడూ లేని విధంగా ఇంధన ధరలు గరిష్ట స్థాయిని చేరుకోవడంతో పెట్రోల్ మరియు డీజల్ ధరల మీద దేశవ్యాప్తంగా ఎక్సైజ్ సుంకాన్ని రెండు రుపాయల మేర తగ్గించింది.
గుడ్డి కన్నా మెల్ల మేలు అన్నట్లుగా.... అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న ఇంధన ధరల నుండి సామాన్యుడికి కాస్త ఊరట లభించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం మీద మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ బాక్సులో మాతో పంచుకోండి....